కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి ప్రవర్తన ప్రతిఫలాన్నిస్తుంది

మంచి ప్రవర్తన ప్రతిఫలాన్నిస్తుంది

మంచి ప్రవర్తన ప్రతిఫలాన్నిస్తుంది

దక్షిణ జపాన్‌ తీరానికి దగ్గర్లో ఉన్న ఒక చిన్న ద్వీపంలో ఒక తల్లి తన ముగ్గురు చిన్న పిల్లలతో కలిసి యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించింది. చాలా సాంప్రదాయకమైన ఆ మారుమూల ప్రాంతంలోని పొరుగువారు దానిని గమనించి, ఆ తల్లిని చూసినప్పుడెల్లా ఆమెను పట్టించుకొనేవారు కాదు. “నన్ను పట్టించుకోకపోవడంకన్నా వారు మావారితో, పిల్లలతో స్నేహపూర్వకంగా వ్యవహరించకపోవడం నన్ను ఎక్కువగా బాధించింది” అని ఆమె చెబుతోంది. అయినా ఆమె తన పిల్లలకు ఇలా నేర్పించింది: “యెహోవా కోసం మనం మన పొరుగువారిని పలకరిస్తూ ఉండాలి.”​—⁠మత్తయి 5:​47, 48.

తిరస్కారానికి గురైనప్పటికీ సభ్యతతో ప్రవర్తించాలని ఆమె తన పిల్లలకు ఇంట్లో నేర్పించింది. తాము క్రమంగా సందర్శించే వేణ్ణీళ్ళ కొలనుల దగ్గరికి కార్లో వెళ్తున్నప్పుడు మార్గంలో పిల్లలు ఇతరులను ఎలా పలకరించాలో అభ్యాసం చేసేవారు. పిల్లలు భవనంలోకి ప్రవేశించిన తర్వాత వారు ఎప్పుడూ ఆనందంగా “కోనిచీవా!” అని చెప్పేవారు, దానికి మంచి రోజు అని అర్థం. పొరుగువారు స్నేహపూర్వకంగా ప్రతిస్పందించకపోయినా ఆ కుటుంబం ఓర్పుతో తాము కలిసేవారినందరినీ పలకరిస్తూ ఉండేది. అయితే ప్రజలు పిల్లల మంచి ప్రవర్తన గమనించకుండా ఉండలేదు.

చివరకు పొరుగువారు ఒకరి తర్వాత మరొకరు “కోనిచీవా!” అని ప్రతిస్పందించడం మొదలుపెట్టారు. రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ నగరవాసులలో దాదాపు ప్రతీ ఒక్కరు ఆ కుటుంబంలోనివారు పలకరించినప్పుడు ప్రతిస్పందించడం మొదలుపెట్టారు. వారు ఒకరినొకరు పలకరించుకోవడం కూడా మొదలుపెట్టారు, మరింత స్నేహశీలురుగా తయారయ్యారు. ఆ మార్పు రావడంలో పిల్లలు పోషించిన పాత్రకు వారిని సన్మానించాలని డిప్యూటీ మేయర్‌ అనుకున్నాడు. క్రైస్తవులు చేయాల్సిందే తాము చేస్తున్నామని వారి తల్లి ఆయనకు చెప్పింది. ఆ తర్వాత ద్వీపమంతటిలో జరిగిన ఉపన్యాస పోటీల్లో వారిలో ఒక అబ్బాయి, ఇతరులు ఏ విధంగా ప్రతిస్పందించినా వారిని సభ్యతతో పలకరించడానికి తన తల్లి కుటుంబానికి ఎలా శిక్షణ ఇచ్చిందో వివరించాడు. ఆయన ఉపన్యాసం మొదటి బహుమతిని గెలుచుకుంది, అది నగర వార్తాపత్రికలో ముద్రించబడింది. క్రైస్తవ సూత్రాలను అనుసరించడంవల్ల అలాంటి మంచి ఫలితాలు లభించాయని నేడు ఆ కుటుంబం ఎంతో సంతోషిస్తోంది. ప్రజలు స్నేహశీలురుగా ఉన్నప్పుడు ఇతరులకు సువార్త ప్రకటించడం చాలా సులభం.