విమోచనా క్రయధనం దేవుని నీతిని ఘనపరుస్తుంది
విమోచనా క్రయధనం దేవుని నీతిని ఘనపరుస్తుంది
ఆదాము హవ్వలు తిరుగుబాటు చేసిన తర్వాత, మడిమె మీద కొట్టబడే సంతానాన్ని తీసుకురావడం అనే తన సంకల్పం గురించి యెహోవా చెప్పాడు. (ఆదికాండము 3:15) దేవుని శత్రువులు యేసుక్రీస్తును మ్రాను మీద చంపినప్పుడు అది నెరవేరింది. (గలతీయులు 3:13, 16) యేసు కన్య గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి సహాయంతో అద్భుతంగా జన్మించాడు కాబట్టి, ఆయనలో పాపం లేదు. అందుకే ఆదాము నుండి పాప మరణాలను వారసత్వంగా పొందిన మానవులను విమోచించడానికి ఆయన చిందించిన రక్తాన్ని విమోచన క్రయధనంగా ఉపయోగించవచ్చు.—రోమీయులు 5:12, 19.
సర్వశక్తిగల దేవుడైన యెహోవా తాను సంకల్పించింది నెరవేర్చకుండా ఆయనను ఏదీ ఆపలేదు. కాబట్టి మానవుడు పాపము చేసిన తర్వాత, విమోచన క్రయధనం చెల్లించబడకపోయినా యెహోవా దృష్టికి అది అప్పటికే చెల్లించబడినట్లే లెక్క, అందుకే ఆయన తన వాగ్దానాల నెరవేర్పులో నమ్మకముంచిన వారితో సంబంధం కలిగివుండగలడు. ఆ కారణంగా హనోకు, నోవహు, అబ్రాహాము వంటి ఆదాము పాపభరిత సంతానానికి దేవుని పరిశుద్ధతకు భంగం వాటిల్లజేయకుండానే దేవునితో నడవడానికి అంతేకాక ఆయనతో స్నేహం చేయడానికి సాధ్యమైంది.—ఆదికాండము 5:24; 6:9; యాకోబు 2:23.
యెహోవా మీద నమ్మకముంచిన కొంతమంది గంభీరమైన పాపాలు చేశారు. అలాంటివారిలో రాజైన దావీదు ఒక ఉదాహరణ. ‘బత్షెబతో వ్యభిచరించి, ఆ తర్వాత ఆమె భర్త ఊరియాను చంపించిన రాజైన దావీదును యెహోవా ఆశీర్వదిస్తూ ఎలా ఉండగలడు’ అని మీరు అడగవచ్చు. అలా ఆశీర్వదిస్తూ ఉండడానికి ముఖ్య కారణం దావీదు చూపించిన నిజమైన పశ్చాత్తాపం, విశ్వాసం. (2 సమూయేలు 11:1-17; 12:1-14) యేసుక్రీస్తు అర్పించబోయే బలి ఆధారంగా దేవుడు, పశ్చాత్తాపపడిన దావీదును క్షమించి, అదే సమయంలో తన న్యాయాన్ని, నీతిని కాపాడుకోగలిగాడు. (కీర్తన 32:1, 2) దానిని రుజువు చేయడానికి బైబిలు, యేసు విమోచనా క్రయధనంవల్ల సాధ్యమయ్యే అతి అద్భుతమైన నెరవేర్పు ఏమిటో వివరిస్తోంది, అదేమిటంటే, ‘దేవుని నీతి కనబరచబడడం,’ అందుకే ఆయన ‘పూర్వము చేయబడిన పాపాలను ఉపేక్షించడమే కాక ఇప్పటి కాలమందు చేయబడుతున్న పాపాలను కూడా ఉపేక్షిస్తున్నాడు.’—రోమీయులు 3:25, 26.
అవును యేసు రక్తపు విలువ కారణంగా మానవజాతి గొప్ప ప్రయోజనాలు పొందుతుంది. విమోచన క్రయధనం ఆధారంగా అతి గొప్ప ప్రయోజనం ఏమిటంటే, పశ్చాత్తాపపడే పాపులైన మానవులు దేవునితో సన్నిహిత సంబంధాన్ని అపొస్తలుల కార్యములు 24:14) ఆ సమయంలో విమోచనా క్రయధనం ఆధారంగా విధేయులైన మానవులందరికీ యెహోవా నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. (యోహాను 3:36) యేసే ఇలా వివరించాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) దేవుడు ఏర్పాటు చేసిన విమోచనా క్రయధన బలి కారణంగా ఆ ప్రయోజనాలన్నీ మానవజాతికి చేకూరుతాయి.
అనుభవించవచ్చు. అంతేకాక, క్రీస్తు విమోచనా క్రయధనంవల్ల, మరణించినవారు నూతనలోకంలో పునరుత్థానమయ్యేందుకు మార్గం సుగమం చేస్తుంది అలా పునరుత్థానం చేయబడేవారిలో యేసు విమోచనా క్రయధనం చెల్లించకముందు మరణించిన నమ్మకమైన దేవుని సేవకులే కాక, అజ్ఞానంతో మరణించిన దేవుని ఆరాధకులు కానివారు కూడా ఉంటారు. బైబిలు ఇలా చెబుతోంది: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.” (అయితే, విమోచనా క్రయధనం విషయంలో అసాధారణమైన అంశం, మనం దాని నుండి పొందే ప్రయోజనాలు కాదు. క్రీస్తు విమోచనా క్రయధనం యెహోవా నామానికి ఏమి చేస్తుందనేదే అతి ప్రాముఖ్యమైన విషయం. యెహోవా పాపులైన మానవులతో వ్యవహరిస్తూ కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండగల పరిపూర్ణ న్యాయంగల దేవుడు అని అది రుజువు చేస్తుంది. దేవుడు విమోచనా క్రయధనాన్ని ఇవ్వడానికి సంకల్పించనట్లయితే ఆదాము సంతతివారిలో ఎవ్వరూ హనోకు, నోవహు, అబ్రాహాము వంటి వారు కూడా యెహోవాతో నడవలేకపోయేవారు లేక ఆయన స్నేహితులుగా ఉండలేకపోయేవారు. కీర్తనకర్త దానిని గుర్తించి ఇలా వ్రాశాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్తన 130:3) యెహోవా తన ప్రియ కుమారుణ్ణి భూమ్మీదకు పంపించినందుకు, యేసు ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని మన కోసం విమోచనా క్రయధనంగా అర్పించినందుకు మనం వారిద్దరికీ ఎంత కృతజ్ఞులమై ఉండాలో కదా!—మార్కు 10:45.