అపవాది నిజంగా ఉన్నాడా?
అపవాది నిజంగా ఉన్నాడా?
అపవాది విషయంలో మీ అభిప్రాయమేమిటి? అతడు చెడ్డపనులు చేసేలా ప్రజల్ని ప్రేరేపించే నిజమైన వ్యక్తి అని అనుకుంటున్నారా లేక ఒక దుష్ట స్వభావం మాత్రమే అని అనుకుంటున్నారా? అపవాదికి మనం భయపడాలా లేక అతడు కేవలం ఒక మూఢనమ్మకపు ఆలోచన అనో లేదా పుక్కిటిపురాణాల్లోని అవాస్తవిక పాత్ర అనో కొట్టిపారేయాలా? “అపవాది” అనే పదం, విశ్వంలోని నిగూఢమైన నాశక శక్తిని సూచిస్తుందా? లేక అనేక ఆధునిక వేదాంతులు వాదిస్తున్నట్లు, ఆ పదం కేవలం మానవుల్లోని దుష్ట లక్షణాలకు మాత్రమే ప్రతీకగా ఉందా?
అపవాది ఎవరనే విషయం గురించి మానవులకు భిన్నాభిప్రాయాలు ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. మారువేషాలు వేయడంలో దిట్టయైన ఒక వ్యక్తి నిజస్వరూపాన్ని గుర్తించడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి! ప్రాముఖ్యంగా ఆ వ్యక్తి ముసుగు చాటునే ఉండాలని నిశ్చయించుకున్నప్పుడు గుర్తించడం మరీ కష్టం. అపవాది అలాంటి వ్యక్తేనని బైబిలు వివరిస్తోంది. అతణ్ణి సాతాను అని సంబోధిస్తూ అదిలా చెబుతోంది: “సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు.” (2 కొరింథీయులు 11:14) అపవాది దుష్టుడే అయినా ఇతరులను తప్పుదోవ పట్టించడానికి, తాను మంచివాడినన్నట్లు నటిస్తాడు. తాను ఉనికిలోనే లేనని ప్రజలను నమ్మించగలిగితే, అతని పథకం ఫలించినట్లే.
కాబట్టి, నిజానికి అపవాది ఎవరు? అతడు ఎప్పుడు, ఎలా ఉనికిలోకి వచ్చాడు? నేడు అతడు మానవజాతిపై ఎలా ప్రభావం చూపిస్తున్నాడు? ఆ ప్రభావాన్ని ఎదిరించడానికి మనం చేయగలిగినదేమైనా ఉందా? బైబిలులో అపవాది ఆరంభాన్ని గురించిన ఖచ్చితమైన చరిత్ర ఉంది, అది ఈ ప్రశ్నలకు నమ్మదగిన జవాబులను ఇస్తోంది.
[3వ పేజీలోని చిత్రం]
ముసుగు చాటునే ఉండాలని నిశ్చయించుకున్న వ్యక్తిని గుర్తించడం ఎంత కష్టమో కదా!