కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“అన్ని దేశాల ప్రజలకు సువార్త”

“అన్ని దేశాల ప్రజలకు సువార్త”

“అన్ని దేశాల ప్రజలకు సువార్త”

పైన చూపించబడిన చిన్నపుస్తకం యెహోవాసాక్షులు 2004/5లో నిర్వహించిన “దేవునితో నడవండి” అనే జిల్లా సమావేశాల్లో విడుదల చేయబడింది. 32 పేజీల అలాంటి ఒక చిన్నపుస్తకపు ప్రతిలో అరబిక్‌ నుండి హిందీ వరకు, 29 భాషల్లో క్లుప్త సందేశం ఉంది, సాధ్యమైనంత ఎక్కువమందికి రాజ్య సువార్తను వ్యాప్తి చేసేందుకు తోడ్పడేలా అది రూపొందించబడింది. (మత్తయి 24:14) ఆ చిన్నపుస్తకాన్ని ఉపయోగించినప్పుడు సాధారణంగా క్రింద ఇవ్వబడినలాంటి ఫలితాలు లభిస్తాయి.

• సమావేశంలో ఆ చిన్నపుస్తకాన్ని అందుకున్న తర్వాత, ఒక సాక్షి కుటుంబం మూడు జాతీయ పార్కులను సందర్శించింది. అక్కడ వారు ఇండియా, నెదర్లాండ్స్‌, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌ నుండి వచ్చిన ప్రజలను కలిశారు. భర్త ఇలా అంటున్నాడు: “వీళ్లందరూ కొంతమేరకు ఇంగ్లీషు మాట్లాడినప్పటికీ, వారు తమ స్వదేశంనుండి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నందున వారికి వారి మాతృభాషలో ఆ సందేశాన్ని మేము చూపించినప్పుడు ఎంతో ముగ్ధులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మన పని ఎలా జరుగుతుందనే విషయాన్ని, మన ఐక్యతను వారు స్పష్టంగా గుర్తించారు.”

• ఒక సాక్షి ఇండియా నుండి వచ్చిన సహోద్యోగికి ఆ చిన్నపుస్తకాన్ని చూపించింది. దానిలోని భాషలన్నింటిని చూసేందుకు అతను అమితాసక్తి చూపించి తన మాతృభాషలో ఆ సందేశాన్ని చదివాడు. ఇది మరిన్ని బైబిలు చర్చలకు దారితీసింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన మరో సహోద్యోగి, ఆ చిన్నపుస్తకంలో తన మాతృభాష ఉండడం చూసి ఆశ్చర్యపోయి, యెహోవాసాక్షుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని చూపించింది.

• కెనడాలో, నేపాల్‌కు చెందిన ఒక స్త్రీ ఫోనులో సాక్షితో బైబిలు అధ్యయనం చేయడానికైతే ఒప్పుకుంది కానీ ఆ సహోదరిని ఇంటికి పిలవడానికి వెనుకాడింది. అయితే ఆ సాక్షి నేపాలీలో సందేశమున్న ఆ చిన్నపుస్తకం గురించి ఆ స్త్రీకి చెప్పినప్పుడు, ఆమె ఉత్సాహంగా ఆ సహోదరిని ఇంటికి ఆహ్వానించింది. ఆమె తన మాతృభాషలో ఉన్న సందేశాన్ని కళ్లారా చూడాలని ఆశించింది! అప్పటినుండి ఆ స్త్రీ ఇంట్లో బైబిలు అధ్యయనం నిర్వహించబడుతోంది.