కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అర్మగిద్దోను—వినాశకరమైన అంతమా?

అర్మగిద్దోను—వినాశకరమైన అంతమా?

అర్మగిద్దోను—వినాశకరమైన అంతమా?

అర్మగిద్దోను! ఆ పదం విన్నప్పుడు మీ మనసుల్లో, సామూహిక విధ్వంసానికి సంబంధించిన చిత్రాలు లేక విశ్వం అగ్నికి ఆహుతి కావడానికి సంబంధించిన చిత్రాలు మెదులుతున్నాయా? ప్రపంచంలోని చాలా భాగాల్లో జరిగే అనుదిన సంభాషణలో, “అర్మగిద్దోను” అనే బైబిలు పదం ఉపయోగించబడుతున్నంత ఎక్కువగా చాలా కొద్ది బైబిలు పదాలు ఉపయోగించబడుతున్నాయి. ఆ పదం, మానవులు ఎదుర్కోబోతున్న నిరాశాపూరితమైన భవిష్యత్తును వర్ణించడానికి విస్తృతంగా ఉపయోగించబడింది. వినోద పరిశ్రమ, ప్రజల మనసుల్లో రాబోయే “అర్మగిద్దోను” గురించిన భయంకరమైన దృశ్యాలను నింపింది. ఆ పదం మర్మం, అపోహల ముసుగులో పడిపోయింది. అర్మగిద్దోనుకు ఉన్న భావం గురించి అనేక అభిప్రాయాలున్నా, వాటిలో అనేకం ఆ పదానికి మూలమైన బైబిలు బోధిస్తున్న దానికి అనుగుణంగా లేవు.

బైబిలు, అర్మగిద్దోనును ‘లోకాంతముతో’ ముడిపెడుతోంది కాబట్టి, ఆ పదానికి ఉన్న నిజమైన అర్థం గురించిన స్పష్టమైన అవగాహన సంపాదించుకోవడం చాలా ప్రాముఖ్యమని మీరు అంగీకరించరా? (మత్తయి 24:⁠3, క్యాతలిక్‌ అనువాదము) అర్మగిద్దోను అంటే ఏమిటి, అది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే ప్రశ్నలకు జవాబు పొందడానికి, సత్యానికి తిరుగులేని మూలమైన దేవుని వాక్యాన్ని పరిశీలించడం సహేతుకం కాదా?

అర్మగిద్దోను వినాశకరమైన అంతాన్ని తీసుకువచ్చే బదులు నీతియుక్త నూతనలోకంలో జీవించాలని, దానిలో వర్ధిల్లాలని కోరుకునే ప్రజలకు సంతోషకరమైన ప్రారంభాన్ని తీసుకువస్తుందని అలాంటి పరిశీలన నిరూపిస్తుంది. మీరు అర్మగిద్దోనుకున్న నిజమైన భావం గురించిన చర్చను తర్వాతి ఆర్టికల్‌లో చదువుతున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైన ఈ లేఖన సత్యాన్ని గురించిన స్పష్టమైన అవగాహనను పొందుతారు.

[3వ పేజీలోని బాక్సు/చిత్రం]

అర్మగిద్దోను అంటే ఏమిటని మీరనుకుంటున్నారు?

అణు విధ్వంసం

వాతావరణ విపత్తు

ఆకాశ గ్రహం భూమిని ఢీకొనడం

దేవుడు దుష్టులను నాశనం చేయడం