నూతన సంవత్సర చెట్టు రష్యన్ ఆచారమా? క్రైస్తవ ఆచారమా?
నూతన సంవత్సర చెట్టు రష్యన్ ఆచారమా? క్రైస్తవ ఆచారమా?
“ఆ సతతహరిత చెట్టు, 1830ల ప్రారంభం వరకూ ‘ఆకర్షణీయమైన జర్మన్ ఆలోచన’గానే పిలవబడేది. ఆ దశాబ్ద అంతానికి అది సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఉన్నతవర్గపు వారి ఇళ్ళలో ‘ఒక సామాన్య విషయం అయింది’. . . . అయితే 19వ శతాబ్దంలో మతనాయకులు, రైతులు ఆ చెట్టును తమ నివాసాల్లో అలంకరించే ఆచారాన్ని మాత్రం స్వీకరించలేదు. . . .
“19వ శతాబ్దానికి ముందు ఆ చెట్టుకు . . . ప్రత్యేక ఆదరణ లభించేది కాదు. రష్యన్ సంప్రదాయం ప్రకారం దాన్ని మరణానికి చిహ్నంగా, ‘ఆత్మ సంబంధ లోకంతో’ సంబంధం ఉన్న చెట్టుగా భావించడంతోపాటు దాన్ని హోటళ్ళ పైకప్పు మీద పెట్టే ఆచారం 19వ శతాబ్దపు మధ్య భాగంలో వైఖరులలో వచ్చిన మార్పులకు, దృక్పథాలకు భిన్నంగా ఉంది. . . . ఆ చెట్టుతో ఇంటిని అలంకరించడమనే పరాయిదేశ ఆచారం చివరకు పశ్చిమ దేశాల్లో క్రిస్మస్‌కు సంబంధించి క్రిస్మస్ చెట్టుకు ఇచ్చే అర్థాన్నే సంతరించుకుంటుందనేది పూర్తిగా అర్థం చేసుకోదగిన విషయమే. . . .
“రష్యాలో ఆ చెట్టును ‘క్రైస్తవ’ చిహ్నంగా మార్చే ప్రక్రియ సజావుగా సాగలేదు. అది ఆర్థడాక్స్ చర్చి నుండి వ్యతిరేకతను ఎదుర్కొంది. మతనాయకులు ఆ క్రొత్త పండుగలో ‘దయ్యాల సంబంధమైన చర్య’ ఉన్నట్లు, రక్షకుని పుట్టుకతో ఎలాంటి సంబంధంలేని అన్య ఆచారం ఉన్నట్లు గమనించారు, అదీకాక అది పశ్చిమ దేశాల నుండి అరువుతెచ్చుకున్న ఆచారం కూడా.”—ప్రొఫెసర్ యలీనా వి. దుష్యన్కేనా, సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో భాషాశాస్త్ర సంబంధ విజ్ఞానంలో పండితుడు.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Photograph: Nikolai Rakhmanov