కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదట వారిని తరిమి, ఆ తర్వాత సత్యాన్ని హత్తుకున్నాడు

మొదట వారిని తరిమి, ఆ తర్వాత సత్యాన్ని హత్తుకున్నాడు

మొదట వారిని తరిమి, ఆ తర్వాత సత్యాన్ని హత్తుకున్నాడు

కొన్ని సంవత్సరాల క్రితం, సాంట్యాగో, అతని భార్య లూర్డిస్‌, పెరూలో ఉన్న ప్రజలతో బైబిలు నిరీక్షణా సందేశాన్ని పంచుకోవడానికి అక్కడి చూడముచ్చటైన వీల్‌కాపాటా అనే పట్టణానికి తరలివెళ్లారు. అయితే ఎన్నోరోజులు గడవకముందే కూస్కో నుండి ఒక ప్రీస్టువచ్చి ఆ పట్టణస్థుల్ని ఒకచోట సమావేశపరచి, యెహోవాసాక్షులు గనుక ఈ పట్టణంలో ఉంటే పాడిపంటల్ని నాశనంచేసే మరణకరమైన తెగులు వ్యాపిస్తుందనీ, మంచు దట్టంగా కురుస్తుందనీ వారిని హెచ్చరించాడు.

ఈ “జోస్యం”వల్ల చాలామంది ప్రభావితులై, ఆర్నెల్లకుపైగా ఆ పట్టణంలో బైబిలు అధ్యయనానికి సాంట్యాగో, లూర్డిస్‌లు ఇస్తున్న ఆహ్వానాన్ని ఎవరూ అంగీకరించలేదు. గవర్నర్‌ ప్రతినిధిగా ఉన్న మీగెల్‌ అనే ఆ పట్టణాధికారి సాంట్యాగో, లూర్డిస్‌లపై రాళ్లు రువ్వుతూ వారిని వీధి చివరిదాకా తరిమాడు. కానీ వారు అన్ని సందర్భాల్లో సమాధానకరంగా, క్రైస్తవ మన్ననతో ప్రవర్తించారు.

కొద్ది రోజులకే ఆ పట్టణస్థులు కొందరు బైబిలు అధ్యయనానికి అంగీకరించారు. మీగెల్‌ కూడా తన దృక్పథం మార్చుకున్నాడు. ఆయన సాంట్యాగోతో అధ్యయనం ఆరంభించి అతిగా త్రాగడం మానేసి సమాధానపరుడయ్యాడు. చివరకు మీగెల్‌ ఆయన భార్య, ఆయన కుమార్తెలిద్దరు బైబిలు సత్యాన్ని హత్తుకున్నారు.

నేడు ఈ పట్టణంలో వర్ధిల్లుతున్న యెహోవాసాక్షుల సంఘం ఉంది. సాంట్యాగో, లూర్డిస్‌లపై తాను విసిరిన రాళ్లు చాలావరకు వారికి తగలనందుకు మీగెల్‌ సంతోషించడమే కాక, ఆ దంపతుల సమాధానకరమైన చక్కని మాదిరి విషయంలో ఆయన కృతజ్ఞతతో ఉన్నాడు.

[32వ పేజీలోని చిత్రాలు]

సాంట్యాగో, లూర్డిస్‌ల (పైన) సమాధానకరమైన వైఖరి మీగెల్‌ (కుడివైపు చివర) తన దృక్పథాన్ని మార్చుకునేలా చేసింది