కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు తమ తల్లిదండ్రుల హృదయాలను సంతోషపరిచారు

వారు తమ తల్లిదండ్రుల హృదయాలను సంతోషపరిచారు

వారు తమ తల్లిదండ్రుల హృదయాలను సంతోషపరిచారు

“నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.” (సామెతలు 23:​15) నిజమే, క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలు దైవిక జ్ఞానాన్ని ఆర్జిస్తే చాలా ఆనందిస్తారు. సెప్టెంబరు 10, 2005 శనివారంనాడు, వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 119వ తరగతి స్నాతకోత్సవానికి ప్రపంచమంతటి నుండి 6,859 మంది హాజరయ్యారు. ప్రాముఖ్యంగా 56 మంది పట్టభద్రుల తల్లిదండ్రులతోపాటు హాజరైన వారందరి హృదయాలు ఉల్లాసంతో ఉప్పొంగిపోయాయి.

ఎంతోకాలంగా అమెరికా బెతెల్‌ కుటుంబంలో సభ్యుడిగావున్న డేవిడ్‌ వాకర్‌ చేసిన హృదయపూర్వక ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడూ, అధ్యక్షుడూ అయిన డేవిడ్‌ స్‌ప్లేన్‌ పట్టభద్రుల తల్లిదండ్రులతో ఈ మాటలు చెబుతూ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించాడు, “మీరు మా హృదయపూర్వక ప్రశంసకు అర్హులు. మీరు మీ కుమారుల్లో, కుమార్తెల్లో పెంపొందించిన లక్షణాలు మిషనరీ సేవను చేపట్టేలా వారిని పురికొల్పాయి.” తమ కుమారులు, కుమార్తెలు త్వరలో దూర ప్రాంతాల్లో నియామకానికి వెళ్ళిపోతారన్న ఆవేదన ఆ తల్లిదండ్రుల్లో ఉండవచ్చు. అయితే సహోదరుడు స్‌ప్లేన్‌ వారికిలా అభయమిచ్చాడు: “మీ పిల్లల గురించి ఆందోళన పడవద్దు. వారిపట్ల మీరు తీసుకోగల శ్రద్ధకన్నా ఎక్కువగా యెహోవా శ్రద్ధ తీసుకోగలడు.” ఆ తర్వాత ఆయనిలా చెప్పాడు: “మీ కుమారులు కుమార్తెలు సాధించే మంచి గురించి ఆలోచించండి. బాధలనుభవిస్తున్న ప్రజలు వారి జీవితాల్లో మొదటిసారి ఓదార్పును పొందుతారు.”

ఇతరులకు సంతోషం కలిగించడంలో ఎలా కొనసాగాలి?

నలుగురు ప్రసంగీకులను అధ్యక్షుడు పరిచయం చేశాడు. “మీ కళ్ళు తెరిచేవుంచుకోండి” అనే అంశంపై అమెరికా బ్రాంచి కమిటీ సభ్యుడైన రాల్ఫ్‌ వాల్స్‌ మొదట మాట్లాడాడు. భౌతిక అంధత్వంకన్నా ఆధ్యాత్మిక అంధత్వం ఘోరమైనదని ఆయన నొక్కిచెప్పాడు. మొదటి శతాబ్దంలోని లవొదికయ సంఘం తన ఆధ్యాత్మిక దృష్టిని కోల్పోయింది. ఆధ్యాత్మికంగా గ్రుడ్డివారిగావున్న ఆ సంఘంలోని క్రైస్తవులకు సహాయం అందజేయబడింది, కానీ మన ఆధ్యాత్మిక కళ్ళు ఎప్పుడూ తెరిచేవుంచుకోవడం ద్వారా అలాంటి అంధత్వాన్ని నివారించడం ఎల్లప్పుడూ ఎంతో మంచిది. (ప్రకటన 3:​14-18) “మీ కళ్ళు తెరిచేవుంచుకుని, బాధ్యతగల పురుషులను యెహోవా చూసినట్లే చూడండి” అని ప్రసంగీకుడు చెప్పాడు. సంఘంలో సమస్యలుంటే పట్టభద్రులు అధికంగా చింతించాల్సిన అవసరంలేదు. అలాంటి అన్ని విషయాలు ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు. సరైన సమయంలో విషయాలు సరిదిద్దబడేలా ఆయన చూస్తాడు.

ఆ తర్వాత పరిపాలక సభ సభ్యుడైన సామ్యూల్‌ హెర్డ్‌ “మీరు సిద్ధంగా ఉన్నారా?” అనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ప్రయాణికుడు తన ప్రయాణానికి కావల్సిన బట్టలను తనతోపాటు ఎలాగైతే తీసుకువెళ్తాడో, అలాగే పట్టభద్రులు ఎల్లప్పుడూ కొత్త స్వభావపు లక్షణాలను ధరించుకోవాలి. యేసుకున్న కనికరాన్నే వారు కూడా కలిగివుండాలి. కుష్ఠువ్యాధిగల వ్యక్తి ‘నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పినప్పుడు, ఆయన నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో’ చెప్పాడు. (మార్కు 1:​40-42) “మీరు నిజంగా ప్రజలకు సహాయం చేయాలనుకుంటే అలా సహాయం చేయడానికి అవసరమైన మార్గాలను కూడా మీరు కనుగొంటారు” అని ప్రసంగీకుడు చెప్పాడు. ‘ఇతరులను తనకంటే యోగ్యులుగా’ పరిగణించాలని ఫిలిప్పీయులు 2:3 క్రైస్తవులకు చెప్తోంది. సహోదరుడైన హెర్డ్‌ ఇలా చెప్పాడు: “జ్ఞానము కలిగివుండడంకంటే వినయ హృదయాన్ని కలిగివుండడం చాలా ప్రాముఖ్యం. మీ పరిచర్యలో మీరు కలిసేవారు, సంఘంలోని మీ సహోదర సహోదరీలు మీరు వినయమనస్సు కలిగివుంటేనే మీ జ్ఞానము నుండి ప్రయోజనం పొందుతారు.” పట్టభద్రులు క్రైస్తవ ప్రేమను ధరించుకోవడంలో కొనసాగితే వారు నిశ్చయమైన విజయాన్ని తమ ముందుంచుకొని, నియామకాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు.​—⁠కొలొస్సయులు 3:​14.

గిలియడ్‌ ఉపదేశకుడైన మార్క్‌ న్యూమర్‌ “మీరు దాన్ని కాపాడుకోగలరా?” అనే తన ప్రసంగాంశంతో ఆసక్తిని రేకెత్తించాడు. ఇక్కడ “దాన్ని” అనే పదం యెహోవా మంచితనంపట్ల మన కృతజ్ఞతను సూచిస్తుంది. కీర్తన 103:2 ఇలా చెబుతోంది: “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.” ఇశ్రాయేలీయులు తమను సజీవంగా ఉంచిన మన్నాపట్ల కృతజ్ఞతాలేమిని చూపిస్తూ దాన్ని ‘చవిసారములు లేని అన్నము’ అన్నారు. (సంఖ్యాకాండము 21:⁠5) సమయం గడుస్తుండగా, మన్నా విలువ మారలేదు, కానీ దానిపట్ల వారికి మెప్పు లేకుండాపోయింది. ఉపదేశకుడు ఇలా అన్నాడు: “మీరు యెహోవా కార్యాలను మరచిపోయి, మీ విదేశీ సేవ సామాన్యమైనదిగా తయారవడానికి అనుమతిస్తే, యెహోవా మీకిచ్చిన పనిని మీరెలా దృష్టిస్తారనే విషయంపై అది ప్రభావం చూపిస్తుంది.” యెహోవా “కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు” అని కీర్తన 103:4 చెబుతోంది. పట్టభద్రులు తమ క్రొత్త సంఘాల్లో దేవుని కరుణాకటాక్షములను చవిచూస్తారు.

లారెన్స్‌ బొవెన్‌ అనే మరో గిలియడ్‌ ఉపదేశకుడు, “మీకు ప్రాప్తిస్తాయా?” అనే అంశంపై మాట్లాడాడు. 119వ గిలియడ్‌ పాఠశాల సభ్యులు విజయవంతమైన మిషనరీలుగా ఉండడానికి గట్టి తర్ఫీదుపొందారు అని ఆయన అన్నాడు. కానీ ఇప్పుడు, వారు యెహోవాను, ఆయన వారికిచ్చిన పనిని హత్తుకుని ఉండాలి. ప్రకటన 14:1-4లో 1,44,000 మంది, “గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడిం[చే]” వారిగా వర్ణించబడ్డారు. ఆ గుంపులోని వారందరూ తమకు ఎలాంటి శ్రమలు వచ్చినా యెహోవాను, ఆయన కుమారుణ్ణి నమ్మకంగా హత్తుకుని ఉండి, తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. “ఏమి జరిగినా మనం కూడా యెహోవాను ఆయన ఇచ్చిన పనిని నమ్మకంగా హత్తుకుని ఉంటాము” అని ప్రసంగీకుడు అన్నాడు. అలా చేయడం ద్వారా పట్టభద్రులు యెహోవా ఆశీర్వాదాలు తమకు “ప్రాప్తించును” అని తెలుసుకుంటారు.​—⁠ద్వితీయోపదేశకాండము 28:⁠2.

తమ సేవలో ఫలాన్ని ఉత్పన్నం చేయడం

తరగతి జరుగుతున్న కాలంలో, ప్రతీ వారాంతం విద్యార్థులు క్షేత్ర సేవలో పాల్గొన్నారు. కార్యక్రమం సమయంలో పాఠశాల రిజిస్ట్రార్‌ వాలెస్‌ లివరెన్స్‌ మాట్లాడినట్లుగా, వారు విజయం సాధించారని స్పష్టమయ్యింది. వారు కనీసం పది భాషల్లో సువార్త ప్రకటించి అనేక బైబిలు అధ్యయనాలు ప్రారంభించారు. ఒక గిలియడ్‌ జంట ఒక చైనా దేశస్థునితో బైబిలు అధ్యయనం ప్రారంభించారు. రెండు సందర్శనాల తర్వాత, యెహోవాను తెలుసుకోవడం గురించి ఎలా భావిస్తున్నావని వారు అతడినడిగారు. ఆయన తన బైబిలు తెరిచి వాళ్ళను యోహాను 17:3 చదవమన్నాడు. తాను జీవమార్గంపై ఉన్నానని ఆయన భావించాడు.

ఆ తర్వాత పరిపాలక సభకు చెందిన ఆంటోనీ మోరీస్‌, కోటె డి ఐవరీ, డిడొమినికన్‌ రిపబ్లిక్‌, ఈక్వెడార్‌ల బ్రాంచి కమిటీ సభ్యులుగా ఉన్న ముగ్గురు సహోదరులను ఇంటర్వ్యూ చేశాడు. బ్రాంచి కమిటీలు వారి ఆగమనం కోసం ఎదురుచూస్తున్నాయని, వారు తమ నియామకాలలో సర్దుకుపోవడానికి వారికి సహాయం చేస్తాయని ఈ సహోదరులు పట్టభద్రులకు హామీ ఇచ్చారు.

అమెరికా బెతెల్‌ కుటుంబానికి చెందిన లియోనార్డ్‌ పియర్‌సన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, పాపువా న్యూగినీ, ఉగాండాల బ్రాంచి కమిటీ సభ్యులు ముగ్గురితో మాట్లాడాడు. ఈ సహోదరులు క్షేత్రసేవలో పూర్తిగా నిమగ్నమవమని పట్టభద్రులను ప్రోత్సహించారు. కాంగోలో 21 సంవత్సరాలు గడిపిన ఒక మిషనరీ జంట, 60 మంది సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడానికి సహాయం చేశారు. ఆ జంట ఇప్పుడు 30 బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నారు, వారి విద్యార్థుల్లో 22 మంది సంఘ కూటాలకు హాజరవుతున్నారు. అంత గొప్ప ఆధ్యాత్మిక కోత ఉండగా మిషనరీగా సేవ చేయడానికి ఇది అద్భుతమైన సమయం.

అత్యవసర స్ఫూర్తితో సాక్ష్యమివ్వడం

పరిపాలక సభకు చెందిన గెరట్‌ లోష్‌ చివరి ప్రసంగాన్నిచ్చాడు. “ప్రభువు దినంలో దేవుని గురించి మాట్లాడడం, యేసు గురించి సాక్ష్యమివ్వడం” అనేది ఆయన ప్రసంగాంశం. “సాక్షి,” ‘సాక్షులు,’ ‘సాక్ష్యమివ్వడం’ అనే పదాలు ప్రకటన గ్రంథంలో 19 సార్లు కనిపిస్తాయి. అలా, యెహోవా తన ప్రజలు చేయాలని తాను ఆశిస్తున్న పనిని స్పష్టం చేస్తున్నాడు. అలాంటి సాక్ష్యాన్ని మనమెప్పుడు ఇవ్వాలి? “ప్రభువు దినమందు.” (ప్రకటన 1:​9, 10) ఆ దినం 1914లో ప్రారంభమై, మన కాలంలో కొనసాగుతూ, భవిష్యత్తులోకి కూడా వెళుతుంది. ప్రకటన 14:6, 7 ప్రకారం, దేవుని గురించి మాట్లాడే పనికి దేవదూతల మద్దతుంది. యేసును గురించి సాక్ష్యమిచ్చే పనిని నిర్దేశించే బాధ్యత అభిషిక్త క్రైస్తవుల శేషానికి అప్పగించబడిందని ప్రకటన 22:⁠17 చూపిస్తోంది. కానీ మనమందరం ఇప్పుడు ఆ ఆధిక్యత నుండి ప్రయోజనం పొందాలి. యేసు “త్వరగా వచ్చుచున్నాను” అని చెబుతున్నట్లు 20వ వచనంలో వ్రాయబడివుంది. సహోదరుడు లోష్‌ అందరినీ ఇలా ప్రోత్సహించాడు: “‘వచ్చి, జీవజలమును ఉచితముగా తీసుకోండి’ అని ప్రజలకు చెప్పండి. యేసు త్వరగా వస్తున్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా?”

గిలియడ్‌ పాఠశాల ఉపదేశకునిగా 11 సంవత్సరాలపాటు సేవచేసిన ఫ్రెడ్‌ రస్క్‌, యెహోవాకు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ప్రార్థన అక్కడున్న వారందరి హృదయాలను స్పృశించింది. ఎంతో ఆనందానికి కారణమైన సందర్భంగా ఉండిన ఆ దినానికి అది తగిన ముగింపు.

[13వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంకాలు

ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 10

నియమించబడిన దేశాల సంఖ్య: 25

విద్యార్థుల సంఖ్య: 56

సగటు వయస్సు: 32.5

సత్యంలో ఉన్న సగటు సంవత్సరాలు: 16.4

పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 12.1

[15వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 119వ తరగతి పట్టభద్రులు

ఈ క్రింద ఉన్న లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోని పేర్లు ఎడమ నుండి కుడికి ఇవ్వబడ్డాయి.

(1) హెల్గెసెన్‌, ఎస్‌.; డాగొర్‌, హెచ్‌.; పియర్లూసి, ఎ.; జోసెఫ్‌, ఐ.; రాకనెలీ, సి. (2) బెర్జ్‌, టి.; బట్లర్‌, డి.; ఫ్రెడ్‌లెన్‌, జె.; న్యూన్‌యెస్‌, కె.; పావజో, సి.; డ్యుమెన్‌, టి. (3) కామాచో, ఓ.; లిండిక్విస్ట్‌, ఎల్‌.; బ్రూమర్‌, ఎ.; వెస్సెల్స్‌, ఇ.; బర్టన్‌, జె.; ఉడ్‌హౌస్‌, ఓ.; డ్యుమెన్‌, ఎ. (4) టిరియన్‌, ఎ.; కానెలీ, ఎల్‌.; ఫోర్నియే, సి.; గిల్‌, ఎ.; యూన్‌సన్‌, కె.; హామిల్టన్‌, ఎల్‌. (5) బయిర్డ్‌, డి.; స్క్రిబ్‌నర్‌, ఐ.; కామాచో, బి.; లాషిన్‌స్కీ, హెచ్‌.; హాలెహాన్‌, ఎమ్‌.; లీబ్యూడా, ఓ. (6) జోసెఫ్‌, ఎ.; లిండిక్విస్ట్‌, ఎమ్‌., హెల్గెసెన్‌, సి.; న్యూన్‌యెస్‌, డి.; స్క్రిబ్‌నర్‌, ఎస్‌.; ఫోర్నియే, జె. (7) పియర్లూసి, ఎఫ్‌.; పావజో, టి.; బ్రూమర్‌, సి.; రాకనెలీ, పి.; బట్లర్‌, టి.; ఉడ్‌హౌస్‌, ఎమ్‌.; లీబ్యూడా, జె. (8) లాషిన్‌స్కీ, ఎమ్‌.; ఫ్రెడ్‌లెన్‌, ఎస్‌.; బర్టన్‌, ఐ.; టిరియన్‌, ఎమ్‌.; బయిర్డ్‌ ఎమ్‌., బెర్జ్‌, జె. (9) వెస్సెల్స్‌, టి.; హాలెహాన్‌, డి.; కానెలీ, ఎస్‌.; గిల్‌, డి.; డాగొర్‌, పి.; హామిల్టన్‌, ఎస్‌.; యూన్‌సన్‌, టి.