కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

నిబంధనా మందసంలో కేవలం రెండు రాతి పలకలు మాత్రమే ఉన్నాయా లేక ఇతర వస్తువులు కూడా ఉన్నాయా?

సా.శ.పూ. 1026లో సొలొమోను నిర్మించిన దేవాలయ ప్రతిష్ఠాపనా సమయానికి, “యెహోవా హోరేబు నందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు.” (2 దినవృత్తాంతములు 5:​10) అయితే, పరిస్థితి ఎప్పుడూ ఆ విధంగానే లేదు.

“ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో” వారు సీనాయి అరణ్య ప్రాంతానికి చేరుకున్నారు. (నిర్గమకాండము 19:1, 2) ఆ తర్వాత, మోషే సీనాయి పర్వతం పైకి వెళ్ళినప్పుడు, ధర్మశాస్త్ర సంబంధమైన రెండు రాతి పలకలు ఆయనకివ్వబడ్డాయి. ఆయన ఇలా వివరిస్తున్నాడు: “నేను తిరిగి కొండ దిగివచ్చి, నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.” (ద్వితీయోపదేశకాండము 10:​4-5) అది, ధర్మశాస్త్ర సంబంధమైన రాతి పలకలను ఉంచడానికి, యెహోవా దేవుడు మోషేను తయారుచేయమని చెప్పిన తాత్కాలికమైన ఒక పెట్టె లేదా మందసము. (ద్వితీయోపదేశకాండము 10:⁠1) నిబంధనా మందసము సా.శ.పూ. 1513వ సంవత్సరం ముగింపుకు వచ్చే సమయానికల్లా సిద్ధం చేయబడింది.

ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలైన కొంతకాలానికి, ఆహారం విషయంలో సణగడం మొదలుపెట్టారు. కాబట్టి, యెహోవా వారికి మన్నా అనుగ్రహించాడు. (నిర్గమకాండము 12:17, 18; 16:1-5) ఆ సమయంలో, మోషే అహరోనును ఇలా నిర్దేశించాడు: “నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుము.” ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము [ముఖ్యమైన దస్తావేజులను భద్రంగా ఉంచడానికి ఉపయోగించే స్థలం] ఎదుట అహరోను దాని పెట్టెను.” (నిర్గమకాండము 16:33, 34) ఆ సమయంలో, అహరోను నిస్సందేహంగా మన్నాను పాత్రలో వేసి ఉంచినప్పటికీ, ఆ పాత్రను సాక్ష్యపు మందసము ఎదుట ఉంచడానికి కొంతకాలం ఆగవలసి వచ్చింది. అంటే, మోషే మందసాన్ని తయారుచేసి దానిలో రాతి పలకలను పెట్టే వరకు ఆగవలసి వచ్చింది.

ముందే పేర్కొనబడినట్లుగా, నిబంధనా మందసము సా.శ.పూ. 1513వ సంవత్సరాంతానికి తయారుచేయబడింది. అహరోను కర్ర ఆ తర్వాత చాలాకాలానికి అంటే కోరహు, మరితరులు తిరుగుబాటు చేసిన తరువాతే మందసములో పెట్టబడింది. ‘మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతికఱ్ఱ, నిబంధన పలకలు ఉన్న మందసము’ గురించి అపొస్తలుడైన పౌలు ప్రస్తావించాడు.​—⁠హెబ్రీయులు 9:⁠4.

ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు, దేవుడు వారికి మన్నాను అనుగ్రహించాడు. వారు ఆ వాగ్దాన “దేశపు పంటను తినుచుండగా,” అది వారికి ఇక ఇవ్వబడలేదు. (యెహోషువ 5:11, 12) అహరోను కర్ర తిరుగుబాటు చేసిన జనాంగానికి ఒక సూచనగా లేదా సాక్ష్యంగా ఉండాలనే ఉద్దేశంతో మందసములో పెట్టబడింది. అంటే కనీసం, వారు అరణ్య ప్రాంతంలో ఉన్నంతవరకైనా అది సాక్ష్యపు మందసములో ఉంచబడిందనే విషయాన్ని ఇది సూచిస్తోంది. కాబట్టి, ఇశ్రాయేలు జనాంగం వాగ్దాత్త దేశానికి చేరుకున్న కొంతకాలానికి, అంటే సొలొమోను నిర్మించిన దేవాలయ ప్రతిష్ఠాపన జరగకముందే అహరోను కర్ర, మరియు మన్నాగల బంగారు పాత్ర నిబంధనా మందసములో నుండి తీసివేయబడ్డాయనే ముగింపుకు రావడం తర్కబద్ధంగా ఉంటుంది.