కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లగానీ ఔనా చెట్టులా మీరున్నారా?

లగానీ ఔనా చెట్టులా మీరున్నారా?

లగానీ ఔనా చెట్టులా మీరున్నారా?

పాపువా న్యూ గినీలోని పోర్ట్‌ మెర్సిబి పొలిమేర్లలో ఉన్న ఒక పల్లెటూరులో ఇద్దరు ప్రచారకులు తమ ప్రకటనా పని నుండి ఇంటికి తిరిగొస్తున్నారు. వారు నడుస్తున్నప్పుడు వారికి ఒక అందమైన చెట్టు కనిపించింది. “ఓహ్‌, ఇది లగానీ ఔనా!” అని వారిలో వృద్ధవ్యక్తి అన్నాడు. ఆయన యౌవనునివైపు తిరిగి ఇంకా ఇలా అన్నాడు: “ఆ పేరుకు ‘వార్షిక చెట్టు’ అని అర్థం. ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండే అనేక ఇతర చెట్లలా కాక ఈ చెట్టు ప్రతీ సంవత్సరం తన ఆకుల్ని రాల్చి మృతి చెందినట్లు కనిపిస్తుంది. అయితే వర్షం కురిసినప్పుడు అది మళ్ళీచిగురించి, పూలు పూసి తిరిగి తన అందాన్ని ప్రదర్శిస్తుంది.”

లగానీ ఔనా లేక రాయల్‌ పొయిన్సియానా అని కొన్ని దేశాల్లో సామాన్యంగా పిలవబడే చెట్టు నుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు. కొంతమంది నిపుణుల ప్రకారం, అది ప్రపంచంలోని అతి అందమైన పూలు పూసే ఐదు చెట్లలో ఒకటిగా పరిగణించబడుతోంది. అది ఎండాకాలంలో తన పూలను, ఆకులను కోల్పోయినా ఆ చెట్టు నీటిని నిల్వ ఉంచుకుంటుంది. దాని వేళ్ళ వ్యవస్థ బలంగా ఉండి వేళ్ళు చాలా లోతులో ఉన్న భూగర్భంలోని రాళ్ళ చుట్టూ కూడా పెరగగలవు. ఆ వేళ్ళ ఆధారంగా అది బలమైన గాలులను కూడా తట్టుకొని నిలబడుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, అది కష్టమైన పరిస్థితులకు తగినట్లు మారడం ద్వారా వర్ధిల్లుతుంది.

మన విశ్వాస నాణ్యతను పరీక్షించే పరిస్థితులు మనకు కూడా ఎదురుకావచ్చు. అలాంటి పరిస్థితిని సహించేందుకు మనకేమి సహాయం చేస్తుంది? లగానీ ఔనా చెట్టులాగా మనం కూడా దేవుని వాక్యానికి సంబంధించిన జీవాన్నిచ్చే నీళ్ళను లోనికి తీసుకొని వాటిని భద్రపరచుకోవచ్చు. మనం మన ‘దుర్గమైన’ యెహోవాతోపాటు ఆయన సంస్థను కూడా గట్టిగా హత్తుకోవాలి. (2 సమూయేలు 22:⁠3) నిజమే, యెహోవా మనకు అందుబాటులో ఉంచుతున్న ఏర్పాట్లను సద్వినియోగం చేసుకుంటే కఠోరమైన వాతావరణంలో కూడా మనం మన ఆధ్యాత్మిక బలాన్ని, అందాన్ని కాపాడుకోవచ్చని లగానీ ఔనా చెట్టు మనకు ఆకర్షణీయమైన రీతిలో గుర్తు చేస్తుంది. అలా సద్వినియోగం చేసుకున్నట్లయితే, మనం నిత్యజీవపు వాగ్దానంతో సహా దేవుని వాగ్దానాలను ‘స్వతంత్రించుకుంటాం.’​—⁠హెబ్రీయులు 6:11; ప్రకటన 21:⁠4.