కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు మంచి స్నేహితులు కావాలా?

మీకు మంచి స్నేహితులు కావాలా?

మీకు మంచి స్నేహితులు కావాలా?

చాలామంది తమకు మంచి స్నేహితులు కావాలని కోరుకుంటారు. సన్నిహిత సహచరులతో మీ అనుభవాలను పంచుకోగలగడం జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. అయితే, మీరు నిజమైన స్నేహాన్ని ఎలా కనుగొనవచ్చు? దాదాపు 2,000 సంవత్సరాల క్రితం యేసు, మానవ సంబంధాలన్నింటిలో విజయం సాధించడానికి నిస్వార్థ ప్రేమ కీలకం అని వివరించాడు. ఆయనిలా బోధించాడు: “మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.” (లూకా 6:​31) తరచూ బంగారు సూత్రమని పిలువబడే ఈ వాక్యం, మీకు స్నేహితులు కావాలంటే మీరు నిస్వార్థ ప్రేమను, ఉదారస్వభావాన్ని చూపించేవారిగా ఉండాలని వివరిస్తోంది. సరళంగా చెప్పాలంటే, మీకు స్నేహితులు కావాలంటే మీరే స్నేహితులుగా ఉండాలి. ఎలా?

హృదయపూర్వక సన్నిహిత స్నేహబంధాన్ని ఒక్క రాత్రిలోనే పెంపొందించుకోలేము. స్నేహితులంటే కేవలం పరిచయస్థులు మాత్రమే కాదు! వారు, మనం మానసికంగా ఒక సంబంధం ఏర్పర్చుకునే వ్యక్తులు. అటువంటి సన్నిహిత సంబంధాలను పెంపొందించుకుని, వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నం అవసరం. స్నేహంలో తరచూ మీ అనుకూలత కంటే మీ సహచరుల అవసరాలను ముందుంచడం అవసరం. స్నేహితులు తమ ఆనందాన్నే కాక, తమ కష్టాలనూ పంచుకుంటారు.

అవసరంలో ఉన్నవారికి క్రియాత్మకంగా, ప్రత్యేకంగా మానసిక మద్దతునివ్వడం ద్వారా మీరు మీ నిజమైన స్నేహాన్ని ప్రదర్శిస్తారు. సామెతలు 17:⁠17 ఇలా చెబుతోంది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.” నిజానికి, కుటుంబంలోని బంధాలకంటే స్నేహబంధాలే మరింత బలంగా ఉండగలవు. సామెతలు 18:⁠24 ఇలా చెబుతోంది: “బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.” అటువంటి నిజమైన స్నేహబంధాలను ఎలా పెంపొందించుకోవాలనే విషయం గురించి మీరు మరింత తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ప్రేమగలవారని పేరెన్నికగన్న గుంపులో మీరూ ఉండాలని కోరుకుంటున్నారా? (యోహాను 13:35) అలా అయితే, మీ ప్రాంతంలోనే ఉన్న యెహోవాసాక్షులు మీకు నిజమైన స్నేహితులను ఎలా కనుగొనాలో చూపించడానికి సహాయం చేసేందుకు సంతోషిస్తారు.