పనామాలో ఆటంకాలను అధిగమించడం
పనామాలో ఆటంకాలను అధిగమించడం
“పనామా ప్రపంచాన్ని కలిపే వారధి లాంటిది.” ఆ నినాదం, యాభై సంవత్సరాల క్రితం, ఆ మధ్య అమెరికా దేశంలో ప్రసారం చేయబడిన ప్రజాదరణ పొందిన ఒక రేడియో కార్యక్రమంలో వినిపించింది. నేడు ఆ నినాదం, ఆ దేశంపట్ల అనేకులకున్న భావాలను వ్యక్తం చేస్తోంది.
పనామా ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య ఒక విధమైన వారధిలాగా పనిచేస్తుంది. అంతేగాక, బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్ అనే అక్షరార్థ వంతెన, ప్రఖ్యాత పనామా కాలువ రెండు గట్లను కలుపుతుంది. పనామా కాలువ నిర్మాణం ఇంజనీరింగ్ రంగంలో ఒక అసాధారణమైన అద్భుత సృష్టి, ఆ కాలువ ఆ దేశం గుండా ప్రవహిస్తూ అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. అలా కలుపుతున్న కారణంగా ప్రపంచమంతటి నుండి వచ్చే ఓడలు కొన్ని గంటల్లోనే ఆ కాలువను దాటగలవు, ఒకవేళ ఆ కాలువే లేనట్లయితే ఓడలు సముద్రంలో చాలా రోజులు లేక వారాలు ప్రయాణించాల్సివస్తుంది. అవును, పనామా ప్రపంచంలోని అనేక ప్రాంతాల మధ్య ప్రాముఖ్యమైన వారిధిలా పనిచేస్తుంది.
వారధి, అనేక రకాల ప్రజలు
పనామా, వివిధ జాతీయ, తెగల నేపథ్యానికి చెందిన ప్రజలు సమ్మిళితమయ్యే స్థలంగా కూడా మారింది. ఆ ప్రజలతో పాటు అనేక స్వదేశీ గుంపులవారు కూడా ఆ అందమైన దేశమంతటా విస్తరించివున్నారు. వారు విభిన్న జాతులతో కూడిన జనాభా ఏర్పడడానికి కారణమయ్యారు. అయితే వివిధ సామాజిక, సాంస్కృతిక, మతసంబంధ, భాషాపరమైన నేపథ్యాలుగల ప్రజలు సమ్మిళితమవడంవల్ల తలెత్తే సవాళ్ళను అధిగమించి, దేవుని వాక్యంలో కనిపించే అమూల్యమైన సత్యాల ఆధారంగా ప్రజల ఆలోచనలో, ఉద్దేశంలో ఐక్యత సాధించడం సాధ్యమేనా?
సాధ్యమే. మొదటి శతాబ్దపు క్రైస్తవులైన యూదులు, అన్యులు క్రీస్తు బలికున్న ఐక్యపరచే ప్రభావం ఆధారంగా అలాంటి సవాలునే అధిగమించగలిగారని ఎఫెసీయులు 2:17, 18లో నమోదుచేయబడిన అపొస్తలుడైన పౌలు మాటలు సూచిస్తున్నాయి. పౌలు ఇలా వ్రాశాడు: “ఆయన [యేసు] వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.”
నేడు అదే విధంగా, పనామాలో యెహోవాసాక్షులు, ఆధ్యాత్మికంగానే కాక కొన్నిసార్లు అక్షరార్థంగా దూరం నుండి వచ్చిన వ్యక్తులకు, గుంపులకు “సమాధాన సువార్తను” ప్రకటిస్తున్నారు. ఆ ప్రాంతంలో యెహోవా “సన్నిధికి” వస్తున్నవారి మధ్య చక్కని ఐక్యత వృద్ధిచెందుతోంది. ఆ కారణంగా, పనామాలో ఆరు భాషల్లో సంఘాలు ఏర్పడ్డాయి, ఆ భాషలు, స్పానిష్, కంటోనీస్, పనామా సంజ్ఞా భాష, ఇంగ్లీషులతోపాటు స్వదేశీ భాషలైన కూనా, నోబేరేలు (గ్వైమి) కూడా ఉన్నాయి. ఈ భాషా గుంపులవారు యెహోవా ఆరాధనలో ఎలా ఐక్యమయ్యారో తెలుసుకోవడం మనకు ప్రోత్సాహాన్నిస్తుంది.
కోమార్కాలో ఆటంకాలను అధిగమించడం
పనామాలో ఉన్న ఎనిమిది స్థానిక జాతుల్లో, నోబే జాతి చాలా పెద్దది. వారి జనాభా దాదాపు 1,70,000. ఆ జాతికి చెందిన అనేకులు ఇటీవలే కోమార్కాగా, లేక రక్షిత భూమిగా కేటాయించబడిన విస్తారమైన ప్రదేశంలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలోని అధిక భాగంలో, కాలినడకన మాత్రమే చేరుకోగల ఎత్తుపల్లాలుగల అడవి ప్రాంతాలు ఎక్కువగా ఉండడమేకాక సముద్రం ద్వారా చేరుకోగల రమణీయమైన కోస్తా ప్రాంతాలు కూడా ఉన్నాయి. అనుకూలమైన రవాణా
మార్గాలుగా పనిచేసే నదుల దగ్గరే కాక, తీరం వెంబడి కూడా సముదాయాలు ఎక్కువగా స్థిరపడ్డాయి. కోమార్కా నివాసుల్లో చాలామంది, పర్వతాల మీద కాఫీ తోటల ఆధారంగా, చేపలు పట్టడం ద్వారా, వ్యవసాయం చేయడం ద్వారా కొద్దిపాటి జీవనోపాధిని సంపాదించుకుంటున్నారు. వారిలో చాలామంది, క్రైస్తవమత చర్చీలకు చెందినవారున్నారు. అయితే, వారు మామా టాటా అని పిలవబడే స్థానిక మతాన్ని అవలంబిస్తున్నారు. మరికొందరు తమకు జబ్బుచేసినప్పుడు లేక దుష్టాత్మలు తమను వేధిస్తున్నట్లు భావించినప్పుడు స్వస్థత కోసం స్థానిక సుకియాల (భూతవైద్యుల) దగ్గరికి వెళ్తారు. చాలామంది స్పానిష్ భాష మాట్లాడగలిగినా నోబేరే భాషనే చక్కగా అర్థం చేసుకుంటారు.ప్రజల హృదయాలను చేరుకోవడానికి పడవను నడపడం
ప్రజలు సత్యాన్ని అర్థం చేసుకోవడమే కాక అది వారి హృదయాలను చేరుకునేంతగా సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయడం ప్రాముఖ్యమని యెహోవాసాక్షులు గుర్తించారు. అది హృదయాన్ని చేరుకున్నప్పుడు, బైబిలు సూత్రాలకు అనుగుణంగా తమ జీవితంలో అవసరమైన మార్పులు చేసుకునే ప్రేరణను వారు పొందుతారు. కాబట్టి, రక్షిత ప్రాంతంలోని ఎనిమిది విభాగాల్లో సేవచేయడానికి నియమించబడిన ప్రత్యేక పయినీరు పరిచారకులు, నోబేరే భాష మాట్లాడే స్థానిక సాక్షుల సహాయంతో ఆ భాష నేర్చుకున్నారు.
ఆ ప్రాంతంలో ఏర్పడిన 14 సంఘాలు, అక్కడ గమనార్హమైన అభివృద్ధి సాధించే అవకాశం ఉందని చూపిస్తున్నాయి. ఉదాహరణకు, కొన్ని సంవత్సరాల క్రితం, డీమస్, హీజెలా అనే ప్రత్యేక పయినీరు జంట టొబోబి అనే కోస్తా ప్రాంతంలోని దాదాపు 40 మంది ప్రచారకులుగల చిన్న సంఘానికి నియమించబడ్డారు. అట్లాంటిక్ తీరంవెంబడి నివసించే దీనులకు ప్రకటించేందుకు తరచూ పడవలో ప్రయాణాలు చేయడాన్ని అలవాటుచేసుకోవడం వారికి కష్టమనిపించింది. ప్రశాంతంగా ఉన్న మహాసముద్రపు నీరు ప్రాణాంతకమైన అలలుగా మారడానికి ఎంతో సమయం పట్టదని డీమస్, హీజెలా గ్రహించారు. ఒక పల్లె నుండి మరో పల్లెకు పడవను నడిపిన తర్వాత వారి చేతులు, వీపు తరచూ నొప్పిపుట్టేవి. స్థానిక భాష నేర్చుకోవడం మరో సవాలు. అయితే, 2001లో క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు దాదాపు 552 మంది హాజరైనప్పుడు వారు చేసిన త్యాగాలకు, వారు ప్రదర్శించిన పట్టుదలకు తగిన ప్రతిఫలం లభించింది.
టొబోబి దగ్గరున్న అఖాతం ఆవలివైపు పుంటా ఎస్కోండిడా అనే పల్లె ఉంది. కొంతకాలంవరకు అక్కడున్న ప్రచారకుల చిన్నగుంపు, వాతావరణం అనుకూలిస్తే, టొబోబిలో కూటాలకు హాజరుకావడానికి తరచూ పడవలో అఖాతాన్ని దాటివచ్చేవారు, ఆ ప్రాంతంలో క్రొత్త సంఘాన్ని ఏర్పర్చడానికి మంచి అవకాశాలున్నాయని నివేదికలు సూచించాయి. దానిని దృష్టిలోవుంచుకొని, పుంటా ఎస్కోండిడాకు తరలివెళ్ళమని డీమస్, హీజెలాలు నిర్దేశించబడ్డారు. రెండు సంవత్సరాలలోపు పుంటా ఎస్కోండిడాలోని గుంపు 28 మంది ప్రచారకులుగల సంఘంగా తయారైంది, వారపు బహిరంగ ప్రసంగానికి సగటున 114 మంది హాజరయ్యేవారు. 2004లో క్రీస్తు మరణ జ్ఞాపకార్థానికి 458 మంది హాజరైనప్పుడు ఆ క్రొత్త సంఘం ఆనందించింది.
నిరక్షరాస్యత అనే సవాలును అధిగమించడం
నిరక్షరాస్యతను అధిగమించడం యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని వృద్ధిచేసుకునేందుకు చాలామంది యథార్థహృదయులకు సహాయం చేసింది. కోమార్కా పర్వత ప్రాంతానికి చెందిన ఫర్మీనా అనే యువతి విషయంలో అదే నిజమైంది. ఆమె నివసిస్తున్న మారుమూల ప్రాంతంలో సేవచేస్తున్న మిషనరీలు, ఆమెకు రాజ్య సందేశంపట్ల ఎంతో శ్రద్ధ ఉన్నట్లు గ్రహించారు. ఆమెకు బైబిలు అధ్యయనం గురించి వివరించినప్పుడు తాను మరింత తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. అయితే ఒక సమస్య ఉంది. ఆమె స్పానిష్, నోబేరే భాషల్లో మాట్లాడగలదు కానీ * అనే బ్రోషుర్‌ను ఉపయోగించి ఆమెకు బోధించడానికి ఒక మిషనరీ ముందుకొచ్చింది.
ఆ రెండింటిలోనూ ఆమెకు చదవడం, వ్రాయడం రాదు. చదవడం మరియు వ్రాయడం మీద శ్రద్ధవహించండిఫర్మీనా తెలివైన విద్యార్థి, ఆమె తన పాఠాలను ఉత్సాహంగా సిద్ధపడేది, తన హోమ్‌వర్కంతా చేసేది, పదాల ఉచ్ఛారణను శ్రద్ధతో అభ్యసించేది. ఏడాదిలోగా, ఆమె మీరు దేవుని స్నేహితులు కాగలరు! (ఆంగ్లం)* అనే బ్రోషుర్‌ను అధ్యయనం చేసేంతగా ప్రగతి సాధించింది. కూటాలు ఏర్పాటు చేయబడినప్పుడు ఫర్మీనా వాటికి హాజరవడం ప్రారంభించింది. అయితే, పేదరికం మూలంగా ఆమె తన పిల్లలతో కలిసి కూటాలకు హాజరవడానికయ్యే ప్రయాణ ఖర్చులు భరించడం ఆమెకు ఎంతో కష్టమైంది. ఫర్మీనా పరిస్థితుల గురించి తెలిసిన ఒక పయినీరు, నోబే మహిళల సాంప్రదాయ దుస్తులను కుట్టి, అమ్మడం గురించి ఆలోచించమని ఆమెకు సలహా ఇచ్చింది. ఫర్మీనా ఆమె సలహాననుసరించింది. ఆమెకు ఇతర భౌతిక అవసరాలున్నా, దుస్తులను అమ్మడంవల్ల వచ్చిన డబ్బును క్రైస్తవ కూటాలకు హాజరుకావడానికే ఉపయోగించడానికి కృషి చేసేది. ఆమె ఇప్పుడు తన కుటుంబంతో కలిసి మరో ప్రాంతానికి తరలివెళ్ళింది, ఆమె ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూనే ఉంది. ఆమె కుటుంబసభ్యులు నిరక్షరాస్యతను అధిగమించినందుకేకాక మరింత ప్రాముఖ్యంగా యెహోవాను తెలుసుకున్నందుకు కూడా సంతోషంగా ఉన్నారు.
బధిరులకు బోధించడం అనే సవాలును అధిగమించడం
పనామాలో సాధారణంగా, అనేక కుటుంబాలు తమ ఇంట్లోని సభ్యులు బధిరులుగా ఉన్నందుకు సిగ్గుపడతాయి. కొన్నిసార్లు అలాంటివారికి ఎలాంటి విద్యా అందించబడదు. వారితో సంభాషించడం చాలా కష్టం కాబట్టి చాలామంది బధిరులు తాము వంటరివాళ్లమని, బహిష్కృతులమని భావిస్తారు.
కాబట్టి, బధిరులకు సువార్త ప్రకటించడానికి ఏదో ఒకటి చేయాలనేది స్పష్టమైంది. ఒక ప్రయాణ పైవిచారణకర్త ప్రోత్సాహంతో కొంతమంది ఉత్సాహవంతులైన పయినీర్లు, మరితరులు పనామా సంజ్ఞా భాష నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు తీసుకున్న చొరవకు తగిన ఫలితం లభించింది.
2001 చివరి భాగానికల్లా పనామా నగరంలో సంజ్ఞా భాషా గుంపు స్థాపించబడింది. కూటాలకు దాదాపు 20 మంది హాజరయ్యేవారు. సహోదర సహోదరీలు ఆ భాషలో మరింత ప్రావీణ్యం సాధించేకొద్దీ, వారు చాలామందికి సాక్ష్యమివ్వగలిగారు. అక్కడి బధిరులు బైబిలు సత్యాన్ని మొదటిసారిగా తమ భాషలో “విన్నారు.” చాలామంది సాక్షులు కూడా బధిరులైన తమ పిల్లలతో కలిసి కూటాలకు హాజరవడం ప్రారంభించారు, తమ పిల్లలు త్వరగా బైబిలు బోధలను అర్థం చేసుకొని, సత్యం విషయంలో మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారని తల్లిదండ్రులు గ్రహించారు. తల్లిదండ్రులు సాధారణంగా సంజ్ఞలు చేయడం నేర్చుకుని తమ పిల్లలతో చక్కగా సంభాషించగలిగేవారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధ్యాత్మికంగా సహాయం చేయగలిగినందువల్ల కుటుంబంలోని బంధాలు బలపర్చబడినట్లు వారు గ్రహించారు. ఎల్సా, ఆమె కూతురు ఈరైడా అనుభవం ఆ విషయాన్ని చక్కగా ఉదాహరిస్తుంది.
సంజ్ఞా భాషా గుంపుతో పనిచేస్తున్న ఒక సాక్షి, ఈరైడా గురించి తెలుసుకొని ఆమెను కలుసుకుంది, ఆమెకు భూమిపై * అనే బ్రోషుర్‌ను ఇచ్చింది. ఈరైడా దానిలోని చిత్రాల ద్వారా తాను నూతనలోకం గురించి తెలుసుకోగలిగిన విషయాలనుబట్టి ఎంతో సంతోషించింది. సాక్షులు ఆ బ్రోషుర్‌ను ఉపయోగించి ఈరైడాతో బైబిలు అధ్యయనం ప్రారంభించారు. ఆ బ్రోషుర్ అధ్యయనం ముగిసిన తర్వాత వారు దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?* అనే బ్రోషుర్‌ను ఉపయోగించి అధ్యయనం ప్రారంభించారు. ఆ సమయంలోనే, అధ్యయనం కోసం సిద్ధపడేందుకు సహాయం చేయమని, బ్రోషుర్‌లోని సమాచారాన్ని తనకు వివరించమని ఈరైడా తన తల్లిని కోరింది.
నిరంతర జీవితమును అనుభవించుము!ఎల్సా ఎదుట రెండు సమస్యలున్నాయి. ఒకటి, ఆమె సాక్షి కాదు కాబట్టి బైబిలు సత్యం ఆమెకు తెలియదు, రెండోది ఆమెకు సంజ్ఞా భాష రాదు. ఆమె తన కూతురితో సంజ్ఞలు ఉపయోగించకూడదని, ఆమె కూతురే మాట్లాడడం నేర్చుకోవాలని ఆమెకు చెప్పబడింది. కాబట్టి, తల్లీ కూతుళ్ళ మధ్య సంభాషణ అంతగా ఉండేది కాదు. సహాయం కోసం ఈరైడా చేసిన విన్నపాన్నిబట్టి కదిలించబడిన ఎల్సా, సంఘంలోని ఒక సాక్షి ఈరైడాతో అధ్యయనం చేయాల్సిందిగా కోరింది. ఆమె ఇలా చెప్పింది: “నా కూతురి కోసం నేనలా కోరాను, ఎందుకంటే ఈరైడా ఏ విషయంలోనూ అంత ఉత్సాహంగా ఉండడాన్ని నేనింతవరకు చూడలేదు.” ఎల్సా తన కూతురుతో కలిసి అధ్యయనాన్ని ప్రారంభించి, సంజ్ఞా భాష నేర్చుకుంది. ఎల్సా తన కూతురుతో ఎక్కువ సమయం వెచ్చించేకొద్దీ వారి ఇంట్లో సంభాషణ మెరుగుపడింది. ఈరైడా తాను ఎంపిక చేసుకునే స్నేహితుల విషయంలో మరింత జాగ్రత్త వహించడం ప్రారంభించి, సంఘంతో సహవసించింది. ఇప్పుడు తల్లీకూతుళ్ళిద్దరూ క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవుతున్నారు. ఎల్సా ఇటీవలే బాప్తిస్మం తీసుకుంది, ఈరైడా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రగతి సాధిస్తోంది. మొదటిసారిగా తాను తన కూతుర్ని అర్థం చేసుకోగలుగుతున్నాననీ, తామిప్పుడు, ఇద్దరికీ అమూల్యమైన అనేక ప్రాముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోగలుగుతున్నామని ఎల్సా చెబుతోంది.
2003 ఏప్రిల్‌లో సంఘంగా మారిన సంజ్ఞా భాషా గుంపు, ఇప్పుడు దాదాపు 50 మంది ప్రచారకులుగల సంఘంగా పెరిగింది, కూటాలకు అంతకన్నా ఎక్కువమంది హాజరవుతున్నారు. మూడింట ఒకవంతుకన్నా ఎక్కువమంది బధిరులు. పనామా నగర ప్రాంతానికి వెలుపలున్న మూడు నగరాల్లో ఇతర సంజ్ఞా భాషా గుంపులు ఏర్పడుతున్నాయి. ఆ భాషా క్షేత్రంలో ఇంకా ఎంతో చేయాల్సివున్నా యథార్థహృదయులైన బధిరులకూ, వారి ప్రేమగల సృష్టికర్తయైన యెహోవా దేవునికీ మధ్య ఉన్న “నిశ్శబ్దాన్ని” చేధించడానికి ప్రాముఖ్యమైన చర్య తీసుకోబడిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
పనామా అంతటా సంభవిస్తున్న పరిణామాలకు అలాంటి ఫలితాలు సాదృశ్యంగా ఉన్నాయి. తాము వివిధ సంస్కృతులు, భాషలు, నేపథ్యాల నుండి వచ్చినా చాలామంది ఏకైక సత్యదేవుని ఆరాధనలో ఐక్యమయ్యారు. చాలామంది “ప్రపంచాన్ని కలిపే వారధిగా” పరిగణించే ఈ దేశంలో, భాషా సంబంధమైన సమస్యలున్నా యెహోవా వాక్య సత్యం విజయవంతంగా ఇతరులకు ప్రకటించబడింది.—ఎఫెసీయులు 4:4.
[అధస్సూచీలు]
^ పేరా 15 యెహోవాసాక్షులు ప్రచురించినది.
^ పేరా 21 యెహోవాసాక్షులు ప్రచురించినది.
[8వ పేజీలోని మ్యాపులు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
కరీబియన్ సముద్రము
పనామా
టొబోబి
పసిఫిక్ మహాసముద్రము
పనామా కాలువ
[8వ పేజీలోని చిత్రం]
అల్లిక పనితో అలంకరించబడిన వస్త్రాలను పట్టుకొని ఉన్న కూనా మహిళలు
[9వ పేజీలోని చిత్రం]
నోబే మహిళకు ప్రకటిస్తున్న మిషనరీ
[10వ పేజీలోని చిత్రం]
ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమానికి హాజరుకావడానికి పడవ ఎక్కుతున్న, నోబేకు చెందిన సాక్షులు
[11వ పేజీలోని చిత్రాలు]
పనామాలో సాంస్కృతిక, భాషాపరమైన భేదాలున్నా బైబిలు సత్యం ప్రకటించబడింది
[12వ పేజీలోని చిత్రం]
సంజ్ఞా భాషలో “కావలికోట” అధ్యయనం
[12వ పేజీలోని చిత్రం]
ఎల్సా, ఆమె కూతురు ఈరైడా అర్థవంతమైన సంభాషణను ఆనందిస్తున్నారు
[8వ పేజీలోని చిత్రసౌజన్యం]
ఓడ మరియు కూనా మహిళలు: © William Floyd Holdman/Index Stock Imagery; పల్లెటూరు: © Timothy O’Keefe/Index Stock Imagery