కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికల నుండి ప్రయోజనం పొందారా?

అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

నేడు ఇంత కీడు ఉండడానికి కొన్ని కారణాలు ఏమిటి?

కీడు తలపెట్టడానికిగల ఒక కారణం, మానవులు చెడువైపు మొగ్గుచూపడమే. (ఆదికాండము 8:​21) మరో కారణం, చాలామందికి దేవుని చిత్తం గురించిన ప్రామాణిక జ్ఞానం లేకపోవడం. అంతేగాక, కీడుకు మూలకారకుడైన సాతాను ఇంకా మానవుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు.​—⁠1/1, 4-6 పేజీలు.

సమయోచితమైన దయగల మాటవల్ల ఎటువంటి సానుకూల ప్రభావాలుంటాయి? (సామెతలు 12:25)

సముచితమైన ప్రశంస దాన్ని పొందేవారిలో మనోధైర్యాన్ని పెంపొందిస్తుంది, వారిని ప్రోత్సహిస్తుంది, పురికొల్పుతుంది, తాము అవసరమైనవారమనే భావాన్ని వారిలో కలిగిస్తుంది. అంతేగాక, ప్రశంసించాలనే కోరిక మనం ఇతరుల్లో మంచిని చూసేలా చేస్తుంది.​—⁠1/1, 16-17 పేజీలు.

నిబంధనా మందసంలో ఏమి ఉన్నాయి?

అందులో ధర్మశాస్త్ర సంబంధమైన రెండు రాతి పలకలు, కొంత మన్నా ఉండేవి. కోరహు తిరుగుబాటు చేసిన తర్వాత, ఆ జనాంగానికి ఒక సూచనగా లేదా సాక్ష్యంగా ఉండాలనే ఉద్దేశంతో అహరోను చేతికఱ్ఱ మందసములో పెట్టబడింది. (హెబ్రీయులు 9:4) సొలొమోను నిర్మించిన దేవాలయపు ప్రతిష్ఠాపన జరిగేముందు మందసములోనుండి చేతికఱ్ఱ, మన్నా తీసివేయబడి ఉండవచ్చు.​—⁠1/15, 31వ పేజీ.

నెహెమ్యా కాలంలో యూదులు దేవాలయానికి కట్టెల అర్పణ ఎందుకు తీసుకురావలసి వచ్చింది?

మోషే ధర్మశాస్త్రంలో కట్టెల అర్పణ పేర్కొనబడలేదు. కానీ నెహెమ్యా కాలంలో బలిపీఠం మీద బలులను దహించడానికి పెద్ద మొత్తంలో కట్టెలు అవసరమయ్యేవి.​—⁠2/1, 11వ పేజీ.

మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌ అంటే ఏమిటి?

అది లాటిన్‌ భాషలో వ్రాయబడిన వ్రాతప్రతిలో భాగం. దాదాపు రెండవ శతాబ్దం చివరి భాగంలో అందులోని మూలపాఠం ప్రాథమికంగా గ్రీకు భాషలో కూర్చబడింది. దానిలో అధికారికమైనవిగా దృష్టించబడే క్రైస్తవ గ్రీకు లేఖన పుస్తకాల అత్యంత ప్రాచీన పట్టిక మాత్రమేకాక, ఆ పుస్తకాల గురించిన, వాటి రచయితల గురించిన వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి.​—⁠2/15, 13-14 పేజీలు.

పారసీక రాణియైన వష్తి, రాజు సన్నిధికి రావడానికి ఎందుకు పదేపదే తిరస్కరించింది? (ఎస్తేరు 1:10-12)

బైబిలు ఆమె ఉద్దేశం గురించి పేర్కొనడంలేదు. త్రాగిన మత్తులో ఉన్న రాజు అతిథుల ముందు తనను తాను కించపరచుకోవడం ఇష్టంలేక రాణి విధేయత చూపించడానికి తిరస్కరించిందని కొందరు విద్వాంసులు సూచిస్తున్నారు. లేక బాహ్య సౌందర్యంగల ఈ రాణికి నిజంగానే విధేయత లేకపోవచ్చు. ఆమె అలా ప్రవర్తించడం ద్వారా పారసీక సామ్రాజ్యంలో ఉన్న భార్యలందరికీ చెడు మాదిరినుంచింది.​—⁠3/1, 9వ పేజీ.

విమోచన క్రయధనం ఎలా విముక్తి కలిగిస్తుంది?

యేసు బలి, వారసత్వంగా వచ్చిన పాపం నుండి, పాపంవల్ల కలిగే మరణకరమైన ప్రభావాల నుండి మనల్ని విముక్తుల్ని చేయగలదు. (రోమీయులు 6:23) ఈ బలి కలవరపెట్టే మనస్సాక్షి నుండి నిజక్రైస్తవులకు ఉపశమనం కలిగిస్తుంది. విమోచన క్రయధనంపట్ల విశ్వాసాన్ని ప్రదర్శించడం ద్వారా దేవుని ఎదుట మనకున్న స్థానం గురించిన భయం నుండి విముక్తి పొందవచ్చు. (1 యోహాను 2:1)​—⁠3/15, 8వ పేజీ.

మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనే ధర్మశాస్త్ర సంబంధమైన నిషేధం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (నిర్గమకాండము 23:19)

మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టడం, వర్షం కురవడానికి చేసే అన్యుల ఆచారంకావచ్చని కొందరు భావిస్తున్నారు. (లేవీయకాండము 20:23) మేకపిల్లను పోషించి అది ఎదిగేందుకు సహాయం చేయడానికి దేవుడు దాని తల్లిపాలను ఏర్పాటుచేశాడు. మేకపిల్లను ఆ పాలలో ఉడకబెట్టడమనేది, దేవుడు స్థాపించిన తల్లీబిల్లల సంబంధంపట్ల తిరస్కార భావాన్ని ప్రదర్శించినట్లవుతుంది. దానికి విరుద్ధంగా ఇవ్వబడిన ఆజ్ఞ దేవుని మహా వాత్సల్యాన్ని చూపిస్తుంది.​—⁠4/1, 31వ పేజీ.