కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘బలహీన ఘటానికి’ ఉన్న విలువ

‘బలహీన ఘటానికి’ ఉన్న విలువ

‘బలహీన ఘటానికి’ ఉన్న విలువ

“అటువలెనే పురుషులారా . . . యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి . . . జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు. (1 పేతురు 3:7) ఈ లేఖనంలో స్త్రీని “బలహీనమైన ఘటమని” పేర్కొనడం, స్త్రీలను ఏ విధంగానైనా చులకన చేస్తోందా? ప్రేరేపించబడిన ఆ రచయిత నిజానికి ఏమి చెప్పాలనుకున్నాడో మనం పరిశీలిద్దాం.

“సన్మానించు” అనే గ్రీకు నామవాచకానికి “వెల, విలువ, . . . గౌరవం” అనే అర్థాలున్నాయి. కాబట్టి, క్రైస్తవ భర్త తన భార్యతో ఆప్యాయంగా వ్యవహరించాలి. ఆమె సున్నితమైన, అమూల్యమైన పాత్ర కాబట్టి, ఆమెపట్ల తగిన శ్రద్ధతో వ్యవహరించాలి. అలా చేయడం ఆమెను చులకన చేసినట్లు కాదు. ఉదాహరణకు, టిఫనీ లోటస్‌ దీపాన్నే తీసుకోండి. నయన మనోహరమైన ఆ దీపాన్ని చాలా నాజూకైనదిగా పరిగణించవచ్చు. అంత నాజూకుగా ఉండడం దాని విలువను ఏమైనా తగ్గిస్తోందా? ఎంతమాత్రం లేదు! అసలైన టిఫనీ లోటస్‌ దీపం 1997లో జరిగిన ఒక వేలంపాటలో 28 లక్షల డాలర్లకు (కోటి 26 లక్షల రూపాయిలకు) అమ్ముడుపోయింది! అది నాజుకుగా ఉండడంవల్ల దాని విలువ పెరిగిందేకానీ తగ్గలేదు.

అదేవిధంగా, స్త్రీని బలహీన ఘటమని సన్మానించడం, ఆమెకున్న విలువను ఏమాత్రం తగ్గించదు లేదా ఆమెను చులకన చేయదు. ఒక భర్త తన భార్యతో “జ్ఞానము చొప్పున” కాపురం చేయడమంటే, ఆమె శక్తిసామర్థ్యాలను, పరిమితులను, ఇష్టాయిష్టాలను, దృక్కోణాలను, భావాలను పరిగణలోకి తీసుకోవడమని అర్థం. భార్యపట్ల శ్రద్ధ ఉన్న భర్త, తమమధ్య ఉండే వ్యక్తిత్వ భేదాలను గుర్తించి, వాటిని గౌరవిస్తాడు. “[తన] ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు” ఆయన ఆమెపట్ల తగిన శ్రద్ధ చూపిస్తాడు. (1 పేతురు 3:7) భార్యకున్న సున్నితమైన సుగుణాలను గౌరవించని భర్త, దేవునితో తన సంబంధాన్ని పూర్తిగా పాడుచేసుకునే అవకాశం ఉంది. దేవుని వాక్యం స్త్రీలను చులకన చేయడంలేదన్నది స్పష్టం. బదులుగా అది వారిని ఘనపరిచి, గౌరవిస్తుంది.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Christie’s Images Limited 1997