కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లల్ని టీవీకే వదిలేస్తారా?

మీ పిల్లల్ని టీవీకే వదిలేస్తారా?

మీ పిల్లల్ని టీవీకే వదిలేస్తారా?

మీ రోజువారి పనులు చేసుకునేటప్పుడు, పిల్లలు అల్లరిచేయకుండా ఉండేందుకు వీలుగా కొన్నిసార్లు వారిని టీవీ చూడనిస్తుండడం మంచిదని మీకనిపిస్తుండవచ్చు. కానీ అది మీ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపించగలదు?

“టీవీలో ప్రసారమయ్యే భావోద్వేగ కార్యక్రమాల ద్వారా అందే సందేశాలకు చిన్న పిల్లలు కూడా ప్రభావితంకాగలరని” ద న్యూయార్క్‌ టైమ్స్‌ లియజేస్తోంది. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో, ఒక నటి ఆటబొమ్మను చూసి వివిధ రకాలుగా స్పందించిన చిన్నచిన్న టీవీ దృశ్యాలు ఏడాది వయసున్న పిల్లలకు చూపించబడ్డాయి. ఆ నటి బొమ్మను చూసి భయపడినప్పుడు పిల్లలు దాంతో ఆడుకోవడానికి ఇష్టపడలేదు, పైగా వారు భయపడి, అయిష్టతను చూపి, ఏడ్చే అవకాశమే ఎక్కువగా కనబడింది. ఆ నటి బొమ్మను ఇష్టపడినప్పుడునప్పుడు పిల్లలు కూడా దాంతో ఆడుకోవడానికి ఇష్టపడ్డారు” అని టైమ్స్‌ పత్రిక చెబుతోంది.

కాబట్టి, టీవీ ఖచ్చితంగా పిల్లలపై ప్రభావం చూపించగలదు. మరి అది పిల్లలపై చూపించే దీర్ఘకాలిక ప్రభావం మాటేమిటి? జపాన్‌లోని కురాషికీ పట్టణంలోవున్న కవాసాకీ వైద్య కళాశాలలో పిల్లల విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ అయిన డా. నావోకి కటావోకా, చాలా మౌనంగావున్న, ముఖాల్లో ఎలాంటి భావాలూ కనిపించని చాలామంది పిల్లలను గమనించాడు. వాళ్ళందరూ టీవీని లేదా వీడియోలను ఎక్కువసేపు చూసినవారే. రెండేండ్ల పిల్లవాడొకడు సరిగా మాట్లడలేకపోవడమే కాక, ఆ పిల్లవాడికి కేవలం కొన్ని మాటలే తెలుసు. ఆ పిల్లవాడు ఏడాది వయసు ఉన్నప్పటి నుండి, ప్రతీరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వీడియోలు చూసేవాడు. డాక్టర్‌ సలహామేరకు వాళ్ళమ్మ పిల్లవాడికి వీడియోలు చూపించడం మాన్పించి వాడితో ఆడుతూ, మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాతే, ఆ పిల్లవాడు నిదానంగా ఎక్కువ మాటలు నేర్చుకున్నాడు. అవును, తల్లిదండ్రులు పిల్లలతో ఆడుతూపాడుతూ సమయం గడపాలి.

కుటుంబ ఏర్పాటును ఆరంభించిన యెహోవాదేవుడు, చక్కగా కలిసి మాట్లాడే, పనిచేసే ప్రాముఖ్యతను నొక్కిచెప్పాడు. ఆయన చాలాకాలం క్రితం తన ప్రజలకిలా చెప్పాడు: “నీవు నీ కుమారులకు వాటిని (దేవుని మాటలను) అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:7) “నడువవలసి త్రోవను” ఉత్తమ రీతిలో తమ పిల్లలకు తల్లిదండ్రులే తమ మాటలద్వారా, మాదిరిద్వారా ఉపదేశించగలరు గానీ, టీవీ కాదు.​—⁠సామెతలు 22:⁠6.