కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆమె విశ్వాసం ఇతరుల్ని ప్రోత్సహిస్తుంది

ఆమె విశ్వాసం ఇతరుల్ని ప్రోత్సహిస్తుంది

ఆమె విశ్వాసం ఇతరుల్ని ప్రోత్సహిస్తుంది

డిసెంబరు 1992లో సిల్వియా జన్మించినప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతమైన పాపలాగే కనిపించింది. కానీ, సిల్వియాకు రెండేళ్ళు వచ్చేసరికి ఆమెకు సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌ అనే వ్యాధి ఉందని తేలింది. నివారణేలేని ఆ వ్యాధివల్ల అంతకంతకూ తీవ్రమయ్యే ఊపిరితిత్తుల, జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఆ వ్యాధితో పోరాడడానికి సిల్వియా ప్రతీరోజు 36 మాత్రలు వేసుకుంటుంది, ఇన్‌హేలర్‌లను ఉపయోగిస్తుంది, ఫిజియోథెరపీ చేయించుకుంటుంది. ఆమె ఊపిరితిత్తుల సామర్థ్యం 25 శాతమే కాబట్టి, ఆమె అన్ని సమయాల్లోనూ, చివరికు బయటికు వెళ్తునప్పుడు కూడా తనతోపాటు చిన్న ఆక్సిజన్‌ సిలిండర్‌ను తీసుకెళ్ళాల్సి ఉంటుంది.

“అయితే, సిల్వియా ఈ వ్యాధితో పోరాడే విధానం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. లేఖనాల పరిజ్ఞానం కారణంగా ఆమెకు దృఢమైన విశ్వాసం ఉంది. తాను అనుభవిస్తున్న బాధను, ఇబ్బందిని తట్టుకోవడానికి ఆ విశ్వాసమే ఆమెకు సహాయం చేస్తుంది. రోగగ్రస్థులందరూ బాగుచేయబడే నూతనలోకం గురించిన యెహోవా వాగ్దానాన్ని తనెప్పుడూ గుర్తుచేసుకుంటుంది” అని వాళ్ళ అమ్మ థెరెసా అంటోంది. (ప్రకటన 21:⁠4) కొన్నిసార్లు తన కుటుంబమంతా నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో కూడిన సిల్వియా చిరునవ్వు వారినందరినీ ఉత్తేజపరుస్తుంది. ఆమె తన తల్లిదండ్రులతో, అన్నయ్యతో ఇలా అంటుంది: “నూతనలోక జీవితం మనమిప్పుడు భరించే బాధలను మరచిపోయేలా చేస్తుంది.”

దేవుని వాక్యంలోని సువార్తను సిల్వియా క్రమంగా ఇతరులతో పంచుకుంటుంది, ఆమె మాట్లాడుతున్నప్పుడు వారు ఆమె ముఖంలో సంతోషం, ఆనందం ఉట్టిపడడాన్ని గమనిస్తారు. ఆమె కూటాలకు హాజరయ్యే కానరీ దీవుల్లోని క్రైస్తవ సంఘ సభ్యులు కూడా ఆమె వ్యాఖ్యానాల్ని వినడానికి, కూటాల్లో ఆమె పాల్గొనడాన్ని చూడడానికి ఎంతో ఇష్టపడతారు. ప్రతీ కూటం తర్వాత తన క్రైస్తవ సహోదర సహోదరీలతో మాట్లాడడానికి సిల్వియా రాజ్య మందిరంలోనే మరింత సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంది. అందరితో కలిసిపోయే, ఉల్లాసవంతమైన ఆమె వ్యక్తిత్వమే సంఘంలో అందరూ ఆమెను ప్రేమించేలా చేసింది.

సిల్వియా గురించి వాళ్ళ నాన్న ఆంటోనియో ఇలా అన్నాడు: “సిల్వియా మనందరికీ ఓ ప్రాముఖ్యమైన పాఠాన్ని బోధిస్తోంది, అదేమిటంటే, సమస్యలున్నప్పటికీ జీవితమనేది దేవుడిచ్చిన బహుమానం కాబట్టి, దానిపట్ల మనం కృతజ్ఞత కనపరచాలి.” సిల్వియాలాగే వృద్ధులు యౌవనులు అనే తేడా లేకుండా దేవుని సేవకులందరూ, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనని” సమయం కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నారు.​—⁠యెషయా 33:24.

[31వ పేజీలోని చిత్రం]

తన తల్లి ఆక్సిజన్‌ సిలిండర్‌ను పట్టుకుని ఉండగా సిల్వియా బైబిలు లేఖనం చదువుతోంది