కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నా ఉన్నత పాఠశాల విద్యకు ఉత్తమ ముగింపు”

“నా ఉన్నత పాఠశాల విద్యకు ఉత్తమ ముగింపు”

“నా ఉన్నత పాఠశాల విద్యకు ఉత్తమ ముగింపు”

స్పెయిన్‌లోని ఒక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఇలా వ్రాశాడు: “వంద సంవత్సరాలకన్నా ఎక్కువకాలంగా, యెహోవాసాక్షులు నిజమైన ఏకీభావాన్ని, నిష్కళంకమైన నిజాయితీని, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు.” అలాంటి వ్యాఖ్యానం చేయడానికి, నాస్తికుడనని చెప్పుకొనే ఈ ఉపాధ్యాయుణ్ణి ఏది పురికొల్పింది?

ఆయన అలా వ్యాఖ్యానించడానికిగల కారణమేమిటంటే, ఉన్నత పాఠశాల విద్యార్థిని, యెహోవాసాక్షి అయిన నోమీ తన పాఠశాల విద్య చివరి పరీక్షలో భాగంగా ఒక వ్యాసం వ్రాయడానికి నియమించబడింది. ఆమె, “నాజీ పాలన క్రింద ఊదారంగు త్రికోణాలు” అనే అంశాన్ని వివరించడానికి ఎంపిక చేసుకుంది.

ఆమె ఆ అంశాన్నే ఎందుకు ఎంపిక చేసుకుంది? నోమీ ఇలా వివరిస్తోంది: “నేను వ్రాసిన వ్యాసాన్ని ఒక ఉపాధ్యాయుడు చదువుతాడు కాబట్టి, ఆయనకు సాక్ష్యమివ్వడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని అనుకున్నాను. నాజీ జర్మనీలోని యెహోవాసాక్షులు తమ యథార్థతను కాపాడుకున్న చరిత్ర నా హృదయాన్ని స్పృశించింది. అది ఇతరులను కూడా ముగ్ధులను చేస్తుందని నేను నమ్మాను.”

నోమీ వ్రాసిన వ్యాసం తాను ఊహించినదానికన్నా చాలా ఎక్కువమందిపై ప్రభావం చూపించింది. ఆమె తాను వ్రాసిన వ్యాసానికి, 2002 అక్టోబరు 5న జరిగిన సామాజిక, విజ్ఞానశాస్త్రాలపై పరిశోధన అనే జాతీయ పోటీలో బహుమానం అందుకుంది. ఆ పోటీకి సంబంధించిన అవార్డులను, ప్రముఖ స్పానిష్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన 20 మంది ప్రొఫెసర్లతో రూపొందించబడిన న్యాయనిర్ణేతల బృందం నిర్ణయించింది.

స్పానిష్‌ విద్యాశాఖామంత్రి అయిన పీలర్‌ డి కాస్టిలో చేతుల మీదుగా నోమీ అవార్డును అందుకుంది. ఆమె ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యెహోవాసాక్షులు నాజీ దాడి సమయంలో స్థిరంగా నిలబడ్డారు (ఆంగ్లం) అనే వీడియో క్యాసెట్‌ను ఆ మంత్రికి ఇచ్చింది. మంత్రి దాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరించాడు.

నోమీ స్వంత పట్టణమైన మాన్‌రీసాలో స్థానిక వార్తాపత్రిక ఆమె విద్యలో సాధించినదాన్ని నొక్కిచెబుతూ, ఆమె వ్రాసిన వ్యాసంలోని సారాంశాన్ని సమీక్షించింది. అంతేకాకుండా, ఆమె పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉన్నత పాఠశాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకొనే కార్యక్రమంలో ఆమె వ్రాసిన వ్యాసాన్ని చేర్చడానికి ఒక ప్రతి కావాలని కోరాడు.

నోమీ ఇలా అంటోంది: “ఇది నా ఉన్నత పాఠశాల విద్యకు ఉత్తమ ముగింపు. నా నివేదికకు ఉపోద్ఘాతంగా హోర్హే టామస్‌ కాలెట్‌ వ్రాసిన ఈ మాటలను చదివినప్పుడు నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను:

“‘నేను నాస్తికుడను, అయినప్పటికీ తన ఆరాధకులలో యథార్థంగా “పొరుగువారిని ప్రేమించాలనే” ప్రేరణ కలిగించే సర్వోన్నతుడు ఉన్నాడని నేను పూర్తిగా ఒప్పించబడ్డాను.’”