కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పూర్తి మార్పు తెచ్చిన ఒక సందర్శనం

పూర్తి మార్పు తెచ్చిన ఒక సందర్శనం

పూర్తి మార్పు తెచ్చిన ఒక సందర్శనం

“దే వుడు నా దగ్గరికి పంపిన ఇద్దరు ‘దేవదూతల’ గురించి మా కుటుంబంతో చెప్పకుండా ఉండలేకపోయాను.” యెహోవాసాక్షులైన ఇద్దరు యౌవన స్త్రీలు సందర్శించిన ఒక వ్యక్తి, పై విధంగా వ్రాశాడు. వారు సందర్శించిన కొన్ని వారాల క్రితం ఆయన తన 45 ఏళ్ళ భార్యను మరణంలో కోల్పోయాడు. ఆయన ఎంతగానో కృంగిపోయాడు. ఆయనకున్న ఎదిగిన పిల్లలు ఆయనను ఓదార్చారు, అయితే వారు దూరంగా నివసించేవారు. ఆయనను కలవడానికి పొరుగువారు లేదా స్నేహితులెవ్వరూ రాలేదు.

ఆ యౌవన స్త్రీలు ఆయనను సందర్శించినప్పుడు, “నేను దేవునికి ప్రార్థించడం మానేశాను” అని వారికి చెప్పాడు. అయితే, వారు ఆయనపట్ల సానుభూతి చూపించి, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? అనే బైబిలు ఆధారిత చిన్న కరపత్రాన్ని ఆయనకిచ్చి వెళ్లారు. ఆయన దాన్ని అదే సాయంత్రం చదివి, దాన్నుండి ఓదార్పు పొందాడు.

కొన్ని రోజుల తర్వాత, ఆ ఇద్దరు క్రైస్తవ స్త్రీలు ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. ముందు కలిసినప్పుడు ఆయన ఎంతో విచారంగా ఉండడాన్ని వారు గుర్తుతెచ్చుకుని, ఆయనను పరామర్శించడానికి వచ్చారు. ఆ తర్వాత ఆయన ఇలా వ్రాశాడు: “నేను ఎంతో ఆశ్చర్యపోయాను, ఆ ఇద్దరు అపరిచితులు నాపై శ్రద్ధ చూపించారు, నా సంక్షేమం గురించి ఆలోచించారు.” వారు ఆయనకు బైబిల్లోంచి చూపించిన విషయాలనుండి ప్రోత్సాహాన్ని పొందాడు. ఆ స్త్రీలు మళ్లీ వస్తామని చెప్పారు. ఆ వ్యక్తి సంతోషించి, యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి తాను పంపించిన ఉత్తరంలో పైన పేర్కొన్న వ్యాఖ్యానాలను వ్రాయడానికి కదిలించబడ్డాడు.

తన అబ్బాయి ఉంటున్న ఇంటికి దగ్గర్లో ఉన్న ప్రాంతానికి తరలివెళ్లేముందు ఆయన యెహోవాసాక్షుల క్రైస్తవ కూటానికి హాజరయ్యాడు, ఆ ఇద్దరు యౌవన స్త్రీలలో ఒకరి కుటుంబంతో కలిసి భోజనం కూడా చేశాడు. ఆయనిలా వ్రాశాడు: “నేనీ ప్రాంతాన్ని వదిలి వెళ్తున్నాను కానీ ఆ ఇద్దరు యువతులకూ, మీ చర్చికీ నా హృదయంలో ఎప్పటికీ స్థానం ఉంటుంది, నా ప్రార్థనల్లో వారినెప్పుడూ గుర్తుచేసుకుంటాను. అవును, నేనిప్పుడు ప్రార్థిస్తున్నాను, చాలా ఎక్కువగా ప్రార్థిస్తున్నాను. నేను పూర్తిగా మారిపోయాను. నాలో ఆ మార్పు రావడానికి ఈ యౌవనులు ఎంతగానో దోహదపడ్డారు, అందుకు వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను.”