కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

సామెతలు 8:22-31లో జ్ఞానం గురించిన వర్ణన, యేసుక్రీస్తు మానవపూర్వ ఉనికికి వర్తిస్తుందని మనకెలా తెలుసు?

జ్ఞానం గురించిన ప్రేరేపిత వర్ణన సామెతల పుస్తకంలో ఇలా ఉంది: “పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. . . . పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు నేను పుట్టితిని. . . . ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు నేనక్కడ నుంటిని; . . . నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని, . . . నరులను చూచి ఆనందించుచునుంటిని.”

ఈ లేఖనం కేవలం దైవిక జ్ఞానం గురించో లేదా మేధాసంబంధమైన జ్ఞానం గురించో మాట్లాడడం లేదు. ఎందుకు? ఎందుకంటే, ఇక్కడ వర్ణించబడిన జ్ఞానం, యెహోవా కార్యాల్లో ప్రథమమైనదానిగా ‘కలుగజేయబడింది’ లేదా సృష్టించబడింది. యెహోవా ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ జ్ఞానవంతునిగానే ఉన్నాడు. (కీర్తన 90:​1, 2) ఆయన జ్ఞానానికి ఆరంభం లేదు; అది కలుగజేయబడలేదు లేదా సృష్టించబడలేదు. అది ‘పుట్టించబడలేదు.’ అంతేకాక, ఈ జ్ఞానం ఒక వ్యక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడుతున్నట్లు, పనిచేస్తున్నట్లు వర్ణించబడింది.​—⁠సామెతలు 8:1.

చాలాకాలం పూర్వం ఈ జ్ఞానం, సృష్టికర్తయైన యెహోవా ప్రక్కనే “ప్రధానశిల్పిగా” ఉండేదని సామెతల పుస్తకం తెలియజేస్తుంది. ఖచ్చితంగా అది యేసుకే వర్తిస్తుంది. యేసు భూమ్మీదికి రావడానికి చాలాకాలం ముందు, ఆయన యెహోవాతో ఎంత సన్నిహితంగా పనిచేశాడంటే దేవుని వాక్యమిలా తెలియజేస్తుంది: “ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.”​—⁠కొలొస్సయులు 1:17; ప్రకటన 3:14.

దేవుని కుమారుణ్ణి జ్ఞానం అని వర్ణించడం సముచితమే ఎందుకంటే ఆయనే యెహోవా జ్ఞానయుక్తమైన సంకల్పాలను, కట్టడలను తెలియజేశాడు. యేసు తన మానవపూర్వ ఉనికిలో దేవుని వాక్యంగా లేదా ప్రతినిధిగా ఉన్నాడు. (యోహాను 1:⁠1) ఆయన ‘దేవుని శక్తి, దేవుని జ్ఞానము’ అని వర్ణించబడ్డాడు. (1 కొరింథీయులు 1:​24, 30) నరులపట్ల తనకున్న ఆప్యాయత కారణంగా తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించిన దేవుని కుమారుణ్ణి అదెంత చక్కగా వర్ణిస్తుందో కదా!​—⁠యోహాను 3:⁠16.

[31వ పేజీలోని చిత్రం]

“కొండలు పుట్టకమునుపు నేను పుట్టితిని”