కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు

సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు

సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు

“ప్రకృతి మారుతుందని, పూర్వస్థితికి తిరిగి వస్తుందని నేను అనుకుంటున్నాను . . . వెంటనే కాదుగానీ సుదూర భవిష్యత్తులో, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం స్థాపించబడినప్పుడు అది మారుతుంది.”​—⁠జేన్‌ మేరీ పెల్ట్‌, ఫ్రెంచ్‌ పర్యావరణ నిపుణురాలు.

ధరణిపై పర్యావరణ, సామాజిక పరిస్థితులనుబట్టి కలవరపడుతున్న అనేకులు మన గ్రహం ఒక పరదైసుగా మారడాన్ని చూసేందుకు ఎంతో ఇష్టపడతారు. అయితే, 21వ శతాబ్దంలోని ప్రజలు మాత్రమే అలా కోరుకోవడం లేదు. భూమ్మీద పరదైసు పునఃస్థాపించబడుతుందని బైబిలు చాలాకాలం క్రితమే వాగ్దానం చేసింది. “సాత్వికులు . . . భూమిని స్వతంత్రించుకొందురు,” “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అనే యేసు మాటలు లేఖనాల్లో సుపరిచితమైన భాగాలు. (మత్తయి 5:⁠5; 6:⁠9) అయితే, భూపరదైసులో సాత్వికులు నివసిస్తారనే నమ్మకం నేడు అనేకుల్లో కనిపించదు. క్రైస్తవులమని చెప్పుకునే అనేకులు పరదైసుపై నమ్మకాన్ని కోల్పోయారు.

భూపరదైసు గురించిన లేదా పరలోక పరదైసు గురించిన నమ్మకాన్ని ఆఖరికి క్యాథలిక్‌ చర్చీ కూడా ఎందుకు విడిచిపెట్టిందో లా వీ అనే ఫ్రెంచ్‌ వారపత్రిక ఇలా వివరిస్తోంది: “దాదాపు 19 శతాబ్దాలు క్యాథలిక్‌ ఫాదిరీల బోధల్లో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన పరదైసు గురించిన బోధ, నేడు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో, ఆదివారం ప్రసంగాల్లో, వేదాంతశాస్త్ర బోధల్లో, ప్రశ్నోత్తర రూపంలో జరిగే బోధల్లో ప్రస్తావనకే రావడంలేదు.” పరదైసు అనే పదాన్ని “మర్మం, గందరగోళం” అనే “దట్టమైన పొగమంచు” కమ్ముకుని ఉందని చెప్పబడుతోంది. కొందరు బోధకులు ఉద్దేశపూర్వకంగానే దాన్ని ప్రస్తావించరు, ఎందుకంటే అది “భూమ్మీద సంతోషకరమైన జీవితానికి సంబంధించిన విభిన్న నమ్మకాలను మనముందు ఉంచుతుంది.”

ప్రత్యేకంగా మతాలను పరిశోధించే సమాజశాస్త్రజ్ఞుడైన ఫ్రెడ్‌రిక్‌ లాన్వర్‌కు, పరదైసు గురించిన నమ్మకాలు “స్థిరమైన మానసిక అభిప్రాయాలుగా” తయారయ్యాయి. అదేవిధంగా, చరిత్రకారుడు, పరదైసు గురించి ఎన్నో పుస్తకాలు వ్రాసిన జేన్‌ డెల్యూమో కూడా బైబిలు వాగ్దానాల నెరవేర్పు ప్రధానంగా సూచనార్థకమైనదే అని భావిస్తున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “‘పరదైసు గురించి చర్చించడానికి ఇంకేం మిగిలివుంది?’ ఈ ప్రశ్నకు క్రైస్తవ విశ్వాసం ఇంకా ఈ జవాబునే ఇస్తోంది: రక్షకుని పునరుత్థానం మూలంగా మనమందరం ఒకరోజున కలిసికట్టుగా మన నిరీక్షణ నెరవేరడాన్ని కళ్ళారా చూస్తాం.”

భూపరదైసు గురించిన సందేశం నేటికీ వర్తిస్తుందా? భవిష్యత్తులో మన గ్రహానికి ఏమి సంభవించనుంది? భవిష్యత్తు అస్పష్టంగా ఉందా లేక దాన్ని స్పష్టంగా చూసే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు తర్వాతి ఆర్టికల్‌ సమాధానాలిస్తుంది.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

COVER: Emma Lee/​Life File/​Getty Images