కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“తొమ్మిదేండ్ల బాబువల్లే మీరిచ్చిన సందేశాన్ని విన్నాను”

“తొమ్మిదేండ్ల బాబువల్లే మీరిచ్చిన సందేశాన్ని విన్నాను”

“తొమ్మిదేండ్ల బాబువల్లే మీరిచ్చిన సందేశాన్ని విన్నాను”

దక్షిణ పోలాండ్‌లో నివసిస్తున్న వీస్వావా, యెహోవాసాక్షులు ఎప్పుడు తన ఇంటికొచ్చినా, వారితో మాట్లాడడం తనకిష్టం లేదని మర్యాదగా చెప్పేస్తుంది. ఒక రోజు, తొమ్మిదేళ్ళ సామ్యూల్‌ వాళ్ళమ్మతోకలిసి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఈసారి వీస్వావా సాక్షులు ఇచ్చే బైబిలు సందేశాన్ని వినాలనుకుంది, భూమిపై పరదైసు గురించిన పత్రికను తీసుకుంది.

యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ దగ్గర పడడంవల్ల సామ్యూల్‌ వీస్వావాను ఆ ప్రత్యేక సందర్భానికి ఆహ్వానించాలనుకున్నాడు. ఈ సారి ముద్రిత ఆహ్వానం ఇవ్వడానికి వాళ్ళమ్మతోకలిసి ఆమె దగ్గరకు మళ్లీ వెళ్ళాడు. బాబు మంచిగా తయారై రావడం చూసి, ఇప్పుడే వస్తాననిచెప్పి లోపలికి వెళ్ళి తానుకూడా మంచిగా తయారైవచ్చింది. సామ్యూల్‌ చెప్పింది విని, ఆ అబ్బాయి ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించింది. ఆమె వారినిలా అడిగింది: “నేనొక్కదాన్నే రావాలా లేదా నా భర్తతో రావాలా?” ఆమె ఇంకా ఇలా అంది: “ఒకవేళ నా భర్త రాకపోయినా, నేనొస్తాను. సామ్యూల్‌ గురించైనా వస్తాను.” సామ్యూల్‌కు సంతోషం కలిగించే విధంగా ఆమె తన మాటను నిలబెట్టుకుంది.

జ్ఞాపకార్థ ప్రసంగమప్పుడు, సామ్యూల్‌ వీస్వావా పక్కన కూర్చొని చర్చించబడుతున్న లేఖనాలను ఆమెకు చూపించాడు. అలా చూపించడం ఆమెను ముగ్ధురాలిని చేసింది. ఆమె జ్ఞాపకార్థ ఆచరణను ఆనందించింది, లోతైన విషయాలు సరళంగా బోధించబడుతున్నాయని మెచ్చుకుంది. సంఘంలోనివారి సాదర ఆహ్వానాన్నిబట్టి, వారు చూపించిన ప్రేమనుబట్టి కూడా ఆమె కదిలించబడింది. అప్పటి నుండి, వీస్వావా ఆధ్యాత్మిక విషయాలపట్ల మరింత ఆసక్తిని కనబరచింది, యెహోవా సాక్షులతో క్రమంగా సహవసించడం మొదలుపెట్టింది. ఆమె ఈ మధ్యే ఇలా అంది: “మీరింతకు ముందు మా ఇంటికి వచ్చినప్పుడు నేను విననందుకు నేను సిగ్గుపడుతున్నాను. తొమ్మిదేండ్ల సామ్యూల్‌ వల్లే మీ సందేశాన్ని విన్నానని నేను అంగీకరించవలసిందే.”

పోలాండ్‌లోని సామ్యూల్‌లాగే యెహోవాసాక్షుల్లో చాలామంది యౌవనులు మాటద్వారా, తమ నడవడి, మంచి ప్రవర్తన ద్వారా దేవుణ్ణి స్తుతిస్తారు. మీరు యౌవనులైతే యథార్థవంతులు చక్కని ఆధ్యాత్మిక విలువలపట్ల ఆసక్తి చూపించేలా మీరు కూడా వారికి సహాయం చేయవచ్చు.