డానియల్ అతని సమావేశ బ్యాడ్జి
డానియల్ అతని సమావేశ బ్యాడ్జి
చిన్నపిల్లలు బహిరంగంగా దేవుణ్ణి స్తుతించడాన్ని గమనించి, కోపంతో మండిపడిన స్వనీతిపరులైన మత నాయకులను యేసు మందలించాడు. యేసు వారిని సరిగానే ఇలా అడిగాడు: “బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా?”—మత్తయి 21:15, 16.
చిన్నపిల్లలు యెహోవాను నేడు కూడా స్తుతిస్తున్నారనడానికి జర్మనీలోని రష్యా భాషా సంఘంతో సహవసిస్తున్న ఆరేళ్ళ డానియల్ నిదర్శనంగా ఉన్నాడు. డానియల్ వాళ్ళ అమ్మ, అక్కతో డ్యూస్బర్గ్‌లో జరిగిన యెహోవాసాక్షుల సమావేశానికి హాజరయ్యాడు. వారు అంత పెద్ద సమావేశానికి హాజరవడం అదే మొదటిసారి. అక్కడున్న హోటల్, అంతమంది శ్రోతలు, మూడు రోజులూ సభ్యతగా కూర్చోవడం, బాప్తిస్మంతోపాటు నాటకం ఇలా వారికి అన్నీ కొత్తగా అనిపించాయి. ఆ మూడు రోజులు డానియల్ ఎలా మసలుకున్నాడు? ఆయన చాలా చక్కగా ప్రవర్తించాడు.
సమావేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత, మరుసటి రోజు సోమవారం డానియెల్ స్కూలుకి వెళ్ళడానికి పెందలాడే లేచాడు. కానీ దేనిని ఇంకా తన కోటుపై అలాగే ఉంచుకున్నాడు? తనను సమావేశ ప్రతినిధిగా గుర్తించే బ్యాడ్జిని! “సమావేశం అయిపోయింది. ఈ రోజు నువ్వా ఆ బ్యాడ్జిని తీసేయవచ్చని” తల్లి వివరించింది. కానీ డానియల్ ఇలా చెప్పాడు: “నేనెక్కడికి వెళ్ళానో, ఏమి నేర్చుకున్నానో అందరూ చూడాలని అలాగే ఉంచుకున్నాను.” ఆ రోజంతా స్కూల్లో ఎంతో గర్వంగా తన బ్యాడ్జితో తిరిగాడు. వాళ్ళ టీచరు దాని గురించి అడిగినప్పుడు, ఆమెకు సమావేశ కార్యక్రమం గురించి వివరించాడు.
అలా చేయడం ద్వారా, శతాబ్దాలుగా యెహోవాను స్తుతిస్తున్న ఎన్నో వేలమంది పిల్లల మాదిరినే డానియల్ కూడా అనుకరించాడు.