కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

న్యాయమూర్తికి బోధించడం సాధ్యమా?

న్యాయమూర్తికి బోధించడం సాధ్యమా?

న్యాయమూర్తికి బోధించడం సాధ్యమా?

క్రొయేషియాలోని స్లాడ్యానా అనే ఒక యెహోవాసాక్షి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కేసు విషయంలో కోర్టులో హాజరవాలి. ఆమె న్యాయమూర్తి దగ్గరకు ముందుగానే వెళ్ళింది. అయితే, ఆ కేసులోని అవతలి పార్టీకిచెందినవాళ్ళు రావడం కాస్త ఆలస్యమైంది. జడ్జీకి సాక్ష్యమివ్వాలని స్లాడ్యానా ఉత్సాహపడింది, అందుకే ఆమె అక్కడున్న వారందరూ వేచిచూస్తున్న సమయంలో, ఆయనతో మాట్లాడేందుకు ధైర్యాన్ని కూడగట్టుకుంది.

“సార్‌, త్వరలోనే ఈ భూమ్మీద జడ్జీలు గానీ, కోర్టులు గానీ ఉండవని మీకు తెలుసా” అని అడిగింది. ఆమె మన కాలంలోని జడ్జీల గురించే మాట్లాడుతోంది.

దానికి ఆశ్చర్యపోయిన ఆ జడ్జీ, ఒక్కమాట కూడా మాట్లాడలేక, ఆమెవైపు చూస్తుండిపోయాడు. ఆ తర్వాత కేసు విచారణ మొదలైంది. కేసు విచారణ ముగిసి, సంబంధిత దస్తావేజుపై సంతకం చేయడానికి స్లాడ్యానా నిలబడివున్నప్పుడు, జడ్జీ ఆమెవైపు వంగి మెల్లగా ఇలా అడిగాడు: “నువ్వు నాకు చెప్పినట్టు, త్వరలోనే ఈ భూమ్మీద జడ్జీలు గానీ, కోర్టులు గానీ ఉండవని నీకు నిజంగా తెలుసా?”

“అవును సార్‌, నాకావిషయం ఖచ్చితంగా తెలుసు!” అని స్లాడ్యానా జవాబిచ్చింది.

“ఏ రుజువునుబట్టి నువ్వలా చెబుతున్నావు” అని జడ్జీ అడిగాడు.

“బైబిల్లోనే దానికి రుజువు ఉంది” అని స్లాడ్యానా జవాబిచ్చింది.

నేను ఆ రుజువును చూడాలనుకుంటున్నానని ఆ జడ్జీ చెప్పాడు కానీ ఆయన దగ్గర బైబిలు లేదు. కాబట్టి స్లాడ్యానా ఆయనకు ఒక బైబిలును తెచ్చిస్తానని చెప్పింది. యెహోవాసాక్షులు ఆ జడ్జీని సందర్శించి, ఆయనకు ఒక బైబిలును ఇచ్చి, ప్రతీవారం బైబిలు అధ్యయనం చేయమని ఆయనను ప్రోత్సహించారు. ఆ జడ్జీ బైబిలు అధ్యయనానికి ఒప్పుకుని కొద్దికాలంలోనే యెహోవాసాక్షి అయ్యాడు.

ప్రవచనార్థకంగా కీర్తన 2:⁠10 ఇలా చెబుతోంది: “రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా [‘న్యాయమూర్తులారా,’ NW] బోధనొందుడి.” అలాంటి వారు యెహోవా ప్రేమపూర్వక నిర్దేశాన్ని వినయంగా అంగీకరించడం ఎంత ఆనందాన్నిస్తుందో కదా!

[32వ పేజీలోని చిత్రం]

జడ్జీతో స్లాడ్యానా