కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికల నుండి ప్రయోజనం పొందారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

ప్రియమైన వ్యక్తి యెహోవా సేవను విడిచిపెట్టినప్పుడు నిజ క్రైస్తవునికి ఏది సహాయం చేస్తుంది?

మిమ్మల్ని మీరు బలపర్చుకోవడంతోపాటు మిగతా నమ్మకమైన కుటుంబ సభ్యులను కూడా బలపర్చండి. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నమవండి. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి. మీ ప్రియమైన వ్యక్తి తిరిగివస్తారనే నిరీక్షణను ఎన్నటికీ కోల్పోకండి. స్వీయనిందకు పాల్పడకండి. క్రమశిక్షణ విషయంలో దేవుని ఏర్పాటును గౌరవించండి, మీ స్నేహితుల దగ్గర మీ భావాలను వ్యక్తం చేయండి.​—⁠9/1, 18-21 పేజీలు.

‘అంత్యదినాలను’ గుర్తించడానికి లేఖనాలు ఏ రెండు విధాలుగా సహాయం చేస్తాయి?

“ఈ యుగసమాప్తి” సమయంలో సంభవించే సంఘటనల గురించి బైబిలు ముందే తెలియజేస్తోంది. (మత్తయి 24:⁠3, 7, 8; లూకా 21:​11) ‘అంత్యదినాల్లో’ జీవించే ప్రజల వైఖరుల్లో, క్రియల్లో వచ్చే మార్పులను కూడా అది వర్ణిస్తోంది. (2 తిమోతి 3:⁠1-5) గమనార్హమైన విషయమేమిటంటే, ఈ సమయంలో రాజ్యసువార్త ప్రకటించబడాలి.​—⁠9/15, 4-6 పేజీలు.

వాహనం నడుపుతున్న క్రైస్తవుడు చేసిన ఆక్సిడెంట్‌వల్ల ఇతరులెవరైనా మరణిస్తే, సంఘం ఏమిచేయాలి?

ఆ విషయాన్ని పరిశోధిస్తున్న పెద్దలు, ప్రాణహానికి దారితీసిన పరిస్థితులు ఆ వాహనం నడిపిస్తున్న వ్యక్తి అదుపులో లేని కారణాన్నిబట్టి ఆయన రక్తాపరాధికాదని నిర్ధారించవచ్చు. కానీ ఒక వ్యక్తిపై రక్తాపరాధం ఉండి ఆయన పశ్చాత్తాపపడితే, ఆయనకు లేఖనాధారిత గద్దింపు ఇవ్వడమేకాక, సంఘంలో ఆధిక్యతల విషయంలో ఆంక్షలు విధించబడతాయి.​—⁠9/15, 30వ పేజీ.

ఎల్లకాలం జీవించడం వైజ్ఞానిక అభివృద్ధిపై ఎందుకు ఆధారపడిలేదు?

ఆయుష్షును పొడిగించడానికి, జీవకణాల పునర్విభజనను అధికం చేయడానికి లేదా థెరప్యూటిక్‌ క్లోనింగ్‌ ద్వారా రోగులకు మార్పిడి చేయడానికి శరీరంలో ఇమిడిపోగల కాలేయం, మూత్రపిండం లేక గుండె వంటి క్రొత్త అవయవాలు అందించడం లాంటి వైజ్ఞానిక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, కేవలం యేసు విమోచనా క్రయధనం ద్వారానే మానవులు నిత్యజీవాన్ని పొందగలరని బైబిలు వివరిస్తోంది.​—⁠10/1, 3-5 పేజీలు.

యూదుల ఆచారబద్ధమైన స్నానం క్రైస్తవ బాప్తిస్మానికి ముంగుర్తుగా ఉందా?

లేదు. యూదులు పవిత్రపరచుకునే ఆచారాలను తమంతట తామే నిర్వహించుకునేవారు, అయితే బాప్తిస్మమిచ్చు యోహాను ప్రారంభించిన బాప్తిస్మంలో అలా చేయాల్సిన అవసరం లేదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పదేపదే తననుతాను పవిత్రపరచుకోవాలి, కానీ క్రైస్తవ బాప్తిస్మం ఒకసారే ఇవ్వబడుతుంది.​—⁠10/15, 12, 13 పేజీలు.

పరిచర్యా శిక్షణ పాఠశాల అంటే ఏమిటి?

అది అవసరం ఎక్కువగా ఉన్నచోటికి వెళ్ళగల స్థితిలో ఉన్న సంఘంలోని అవివాహిత పెద్దలు, లేదా పరిచర్య సేవకుల కోసం రూపొందించబడిన ఎనిమిది వారాల కోర్సు. వారు బహుశా తాము సహవసించే సంఘానికిగానీ, ఆ దేశంలోని వేరే ప్రాంతానికిగానీ లేక వేరే దేశానికిగానీ నియమించబడవచ్చు.​—⁠11/15, 10, 11 పేజీలు.

1 యోహాను 2:​18; 4:3లలో ప్రస్తావించబడిన క్రీస్తువిరోధి ఎవరిని లేదా దేనిని సూచిస్తుంది?

“క్రీస్తువిరోధి” అనే పదం విస్తృతభావంలో, క్రీస్తును లేక ఆయన ప్రతినిధులను వ్యతిరేకించే లేదా తామే క్రీస్తులమని లేక ఆయన ప్రతినిధులమని తప్పుగా చెప్పుకునే వారందరికీ వర్తిస్తుంది. యేసు, యోహాను చెప్పిన మాటలు, క్రీస్తువిరోధి అనే మాట మతసంబంధ అబద్ధాలను వ్యాప్తిచేసే, దేవుని రాజ్యాన్ని తిరస్కరించే ఒక గుంపును సూచిస్తోంది.​—⁠12/1, 4-6 పేజీలు.