పిల్లల్లో ఒకరు సత్యాన్ని వ్యతిరేకించినప్పుడు స్థిరంగా ఉండడం
పిల్లల్లో ఒకరు సత్యాన్ని వ్యతిరేకించినప్పుడు స్థిరంగా ఉండడం
జాయ్ అని మనం పిలిచే ఒక క్రైస్తవ స్త్రీ, తన కుమారుడు యెహోవా దేవుణ్ణి ప్రేమించేలా పెంచడానికి కృషి చేసింది. అయితే అతడు యుక్త వయసుకు రాగానే సత్యాన్ని వ్యతిరేకించి, ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. “ముందెప్పుడు నా మనసు అంత తీవ్రంగా గాయపడలేదు. నేను వంచించబడినట్లు భావించాను, నా మనసు విరిగిపోయింది, చాలా ఆశాభంగం కలిగింది. నిరాశా నిస్పృహలతో నేను కృంగిపోయాను” అని జాయ్ చెబుతోంది.
బహుశా మీరు కూడా మీ పిల్లలు దేవుణ్ణి ప్రేమించేలా, ఆయన సేవ చేసేలా పెంచడానికి ప్రయత్నించి ఉండవచ్చు, వారిలో ఒకరో అంతకన్నా ఎక్కువమందో యెహోవా మార్గాలనుండి తొలగిపోవడాన్ని మీరు చూసి ఉంటారు. అలాంటి తీవ్ర నిరుత్సాహాన్ని మీరు ఎలా తట్టుకోవచ్చు? యెహోవాకు మీరు చేసే సేవలో స్థిరంగా ఉండడానికి మీకేది సహాయం చేస్తుంది?
యెహోవా కుమారులు తిరుగుబాటు చేసినప్పుడు
మొదటిగా, మీరెలా భావిస్తున్నారో యెహోవాకు ఖచ్చితంగా తెలుసనే విషయాన్ని అర్థం చేసుకోండి. యెషయా 49:15లో మనమిలా చదువుతాం: “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.” అవును, తల్లిదండ్రులకుండే భావాలే యెహోవాకూ ఉన్నాయి. తన ఆత్మ కుమారులందరూ తనను స్తుతిస్తూ, ఆరాధిస్తున్నప్పుడు ఆయనెంత సంతోషించి ఉంటాడో ఊహించండి. పితరుడైన యోబుకు “సుడిగాలిలోనుండి” జవాబిస్తూ యెహోవా తన ఐక్య ఆత్మ కుటుంబంలోని సంతోష ఘడియలను గుర్తుచేసుకుంటూ ఇలా అన్నాడు: “నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? . . . ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?”—యోబు 38:1, 4, 7.
కొంతకాలానికి, సత్యదేవుడు తన పరిపూర్ణ ఆత్మ కుమారుల్లో ఒకరు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సాతానుగా మారడం చూశాడు, ఆ పదానికి “వ్యతిరేకి” అని అర్థం. తన మొదటి మానవ కుమారుడైన ఆదాము, ఆయన పరిపూర్ణ భార్యయైన హవ్వ, ఆ తిరుగుబాటులో చేరడం కూడా యెహోవా చూశాడు. (ఆదికాండము 3:1-6; ప్రకటన 12:9) ఆ తర్వాత, ఇతర దేవదూతలు ‘తమ నివాసస్థలమును విడిచి’, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.—యూదా 6.
యెహోవా తన పరిపూర్ణ కుమారుల్లో కొందరు తిరుగుబాటు చేసినప్పుడు ఎలా ప్రతిస్పందించాడో లేఖనాలు మనకు చెప్పడం లేదు. అయితే, బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా ఆదికాండము 6:5, 6) యెహోవా ఎన్నుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటు కూడా ఆయనను ‘దుఃఖపర్చింది’, ఆయనకు ‘సంతాపం కలిగించింది.’—కీర్తన 78:40, 41.
చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.” (తిరుగుబాటుచేసే పిల్లల ప్రవర్తన మూలంగా దుఃఖించే, బాధపడే తల్లిదండ్రులపట్ల యెహోవాకు తదనుభూతి ఉందనడంలో సందేహం లేదు. అలాంటి తల్లిదండ్రులు తమ పరిస్థితితో వ్యవహరించడానికి సహాయపడే నమ్మదగిన సలహాను, ప్రోత్సాహాన్ని ఆయన తన వాక్యమైన బైబిలులో ఇచ్చాడు. తమ్మునుతాము తగ్గించుకుని, తమ చింతలన్నీ తనమీద వేయమని, అపవాదియైన సాతానును ఎదిరించమని దేవుడు వారికి ఉద్బోధిస్తున్నాడు. మీ పిల్లవాడు సత్యాన్ని వ్యతిరేకించినప్పుడు మీరు స్థిరంగా ఉండడానికి, ఇక్కడ ఇవ్వబడిన సలహా ఎలా సహాయపడుతుందో మనం చూద్దాం.
మీ చింతను యెహోవామీద వేయండి
తమ పిల్లలు తమకు తాము హానిచేసుకునే ప్రమాదంలో ఉన్నారనే లేదా ఇతరులచే హానికి గురవుతారనే ఆలోచనకన్నా ఎక్కువగా మరేదీ తల్లిదండ్రులను బాధపెట్టదని యెహోవాకు తెలుసు. ఇలాంటి బాధను, ఇతర బాధలను ఎదుర్కొనే ఒక మార్గాన్ని అపొస్తలుడైన పేతురు చెబుతున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.” (1 పేతురు 5:7) ఈ ఆహ్వానం, హామీ ప్రత్యేకంగా సత్యాన్ని వ్యతిరేకించే పిల్లవాని తల్లిదండ్రులకు ఎందుకు సంగతమైనది?
మీ అబ్బాయి చిన్న వయసులో ఉన్నప్పుడు, అతడు ప్రమాదాలకు గురవకుండా కాపాడడానికి మీరెన్నో జాగ్రత్తలు తీసుకున్నారు, మీ ప్రేమపూర్వక నిర్దేశానికి అతడు తప్పక ప్రతిస్పందించి ఉంటాడు. అయితే అతడు పెరిగి పెద్దవాడవుతుండగా, అతనిపై మీ అధికార ప్రభావం తగ్గివుండవచ్చు, కానీ మీ పిల్లవాడిని ప్రమాదం నుండి కాపాడాలనే మీ బలమైన కోరిక మాత్రం తగ్గలేదు. వాస్తవానికి, అదింకా ఎక్కువై ఉండవచ్చు.
ఫలితంగా, మీ పిల్లవాడు సత్యాన్ని వ్యతిరేకించి ఆధ్యాత్మిక, భావోద్రేక లేదా శారీరక హానికి గురైనప్పుడు దానికి మీరే బాధ్యులని మీరనుకోవచ్చు. ముందు ప్రస్తావించబడిన జాయ్ అలాగే అనుకుంది. ఆమె ఇలా అంటోంది: “ప్రతిరోజు వైఫల్య భావాలతో యాతన అనుభవిస్తూ నేను పదే పదే గతం గురించి ఆలోచిస్తుండేదాన్ని.” ప్రాముఖ్యంగా అలాంటి సందర్భాల్లోనే ‘మీ చింత యావత్తు తనమీద వేయమని’ యెహోవా మిమ్మల్ని కోరుతున్నాడు. మీరొకవేళ అలా చేస్తే, ఆయన మీకు సహాయం చేస్తాడు. కీర్తనకర్త ఇలా చెబుతున్నాడు: “నీ భారము యెహోవామీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను కీర్తన 55:22) జాయ్ అలాంటి ఓదార్పునే పొందింది. ఆమె ఇలా వివరిస్తోంది: “నేను నా బాధంతటి గురించి యెహోవాకు స్పష్టంగా చెప్పాను. నా భావాలన్నీ ఆయనముందు కుమ్మరించాను, అది నాకు ఎంతో ఉపశమనాన్నిచ్చింది.”
ఆయన ఎన్నడును కదలనీయడు.” (అపరిపూర్ణ తల్లిదండ్రులుగా, మీరు మీ పిల్లలను పెంచుతున్నప్పుడు కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు. అయితే మీరు వాటి గురించే ఎందుకు ఆలోచించాలి? యెహోవా అలా ఆలోచించడు, ఎందుకంటే ప్రేరేపిత కీర్తనకర్త ఇలా పాడాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్తన 130:3) తల్లిదండ్రులుగా మీరు ఏ పొరపాటూ చేయకపోయినా మీ పిల్లవాడు సత్యాన్ని వ్యతిరేకించి ఉండేవాడు. కాబట్టి ప్రార్థనలో మీ భావాలను యెహోవాకు తెలియజేయండి, ఆయన మీకు తట్టుకొనే శక్తినిస్తాడు. అయితే మీరు యెహోవాను సేవించడంలో స్థిరంగా ఉండి, సాతాను దాడికి గురవకుండా ఉండాలంటే మీరు ఇంకా ఎక్కువే చేయాలి.
దీనమనస్కులై ఉండండి
పేతురు ఇలా వ్రాశాడు: “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.” (1 పేతురు 5:6) మీ పిల్లవాడు సత్యాన్ని వ్యతిరేకించినప్పుడు దీనమనసు ఎందుకు అవసరం? సత్యాన్ని వ్యతిరేకించే పిల్లవాడు ఉండడం మీకు అవమానాన్ని, బాధను కలిగించడమే కాక బహుశా మీకు కొంత అవమానకరంగా కూడా అనిపించవచ్చు. ముఖ్యంగా అతడు క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడాల్సి వచ్చినప్పుడు మీ పిల్లవాడు చేసిన పనులవల్ల మీ కుటుంబ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని మీరు బాధపడుతుండవచ్చు. స్వయంకృతాపరాధ భావాలు, అవమానం మీరు క్రైస్తవ కూటాలకు హాజరవకుండా మిమ్మల్ని నిరుత్సాహపర్చవచ్చు.
అలాంటి పరిస్థితితో వ్యవహరించేటప్పుడు, మీరు ఆచరణాత్మక జ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సామెతలు 18:1 ఇలా హెచ్చరిస్తోంది: “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.” బాధ ఉన్నప్పటికీ క్రమంగా క్రైస్తవ కూటాలకు హాజరవడంద్వారా, ఉపదేశానికి, ప్రోత్సాహానికి ముఖ్యమైన ఆధారంగావున్న మూలం నుండి మీరు ప్రయోజనం పొందగలుగుతారు. జాయ్ ఇలా ఒప్పుకుంటోంది: “మొదట్లో, నేను ఎవరితోనూ కలవడానికి ఇష్టపడలేదు. కానీ నా ఆధ్యాత్మిక క్రమం యొక్క ప్రాముఖ్యతను నేను గుర్తుచేసుకున్నాను. అంతేగాక, ఒకవేళ నేను ఇంటివద్దే ఉంటే నా సమస్యల గురించే ఆలోచిస్తూ ఉండేదాన్ని. ప్రోత్సాహకరమైన ఆధ్యాత్మిక విషయాలపై అవధానం నిలిపేందుకు కూటాలు నాకు సహాయం చేశాయి. నన్ను నేను వేరుగా ఉంచుకోనందుకు, నా సహోదర, సహోదరీల ప్రేమపూర్వక మద్దతు నుండి ప్రయోజనం పొందకుండా ఉండనందుకు నేనెంతో కృతజ్ఞురాలిని.”—హెబ్రీయులు 10:24, 25.
కుటుంబంలోని ప్రతీ ఒక్కరు తమ క్రైస్తవ బాధ్యత అనే ‘తన బరువు తానే భరించుకోవాలి’ అని కూడా గుర్తుంచుకోండి. (గలతీయులు 6:5) తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమించాలని, వారికి శిక్షణనివ్వాలని యెహోవా కోరుతున్నాడు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ, వారిని గౌరవించాలని కూడా ఆయన కోరుతున్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచడానికి శాయశక్తులా కృషి చేస్తే వారు దేవుని ఎదుట మంచి స్థానాన్ని కలిగివుంటారు. (ఎఫెసీయులు 6:1-4) పిల్లవాడు తల్లిదండ్రుల ప్రేమపూర్వక శిక్షణకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే అది ఆ పిల్లవాడి మంచిపేరునే పాడుచేస్తుంది. “బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును” అని సామెతలు 20:11 చెబుతోంది. సాతాను తిరుగుబాటు, వాస్తవాలు తెలిసిన వారి మధ్య యెహోవా మంచిపేరును పాడుచేయలేదు.
అపవాదిని ఎదిరించండి
“నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అని పేతురు హెచ్చరిస్తున్నాడు. (1 పేతురు 5:8) సింహంలా, అపవాది తరచూ యౌవనస్థులమీద, అనుభవం లేనివారిమీద దాడి చేస్తాడు. ప్రాచీనకాలంలో ఇశ్రాయేలులో సింహాలు తిరిగేవి, అవి సాధు జంతువులకు ప్రమాదకరంగా ఉండేవి. ఒకవేళ గొఱ్ఱెపిల్ల మందకు దూరంగా వెళ్ళిపోతే అది సులువుగా దాడికి గురికావచ్చు. సహజంగానే తల్లిగొఱ్ఱె తన పిల్లను రక్షించుకోవడానికి తన ప్రాణాలను ప్రమాదంలో వేసుకోవచ్చు. అయితే, గొర్రె ఎంత బలంగా ఉన్నా, అది సింహాన్ని ప్రతిఘటించలేదు. అందుకే, మందను కాపాడడానికి ధైర్యస్థులైన కాపరులు అవసరం.—1 సమూయేలు 17:34, 35.
యెహోవా తన సాదృశ్యమైన గొర్రెలను “గర్జించు సింహము” నుండి రక్షించుకోవడానికి “ప్రధాన కాపరి” అయిన యేసుక్రీస్తు నాయకత్వం క్రింద మందను కాపాడడానికి ఆధ్యాత్మిక కాపరులను ఏర్పాటు చేశాడు. (1 పేతురు 5:4) అలాంటి నియమిత పెద్దలను పేతురు ఇలా హెచ్చరిస్తున్నాడు: “బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.” (1 పేతురు 5:1, 2) తల్లిదండ్రులుగా మీ సహకారంతో ఈ కాపరులు ఒక యౌనస్థుడు ఆధ్యాత్మికంగా తన మార్గాన్ని సరిదిద్దుకోవడానికి సహాయం చేయవచ్చు.
క్రైస్తవ కాపరులు సత్యాన్ని వ్యతిరేకిస్తున్న మీ పిల్లవాడికి ఉపదేశం ఇవ్వాల్సివస్తే, మీరు ఆ క్రమశిక్షణ నుండి మీ పిల్లవాడిని కాపాడాలనుకోవచ్చు. అయితే మీరలా చేయడం గంభీరమైన తప్పు. ఆధ్యాత్మిక కాపరులను కాదు, “[అపవాదిని] ఎదిరించుడి” అని పేతురు చెబుతున్నాడు.—1 పేతురు 5:9.
క్రమశిక్షణ తీవ్రంగా ఉన్నప్పుడు
ఒకవేళ మీ పిల్లవాడు పశ్చాత్తాపపడడానికి ఇష్టపడక, బాప్తిస్మం పొందిన క్రైస్తవుడైతే సంఘంనుండి బహిష్కరించబడడమనే తీవ్రమైన క్రమశిక్షణను పొందవచ్చు. అప్పటినుండి మీరు అతనితో ఎంతవరకు సన్నిహితంగా ఉండాలనే విషయం అతని వయసుపై, ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ పిల్లవాడు చిన్నవాడిగావుండి, మీతోపాటు ఇంట్లో ఉంటుంటే సహజంగానే మీరు ఆయన భౌతికావసరాలను తీర్చడం కొనసాగిస్తారు. అతనికి నైతిక తర్ఫీదు, క్రమశిక్షణ అవసరం, వాటిని అందజేయడం మీ బాధ్యత. (సామెతలు 1:8-18; 6:20-22; 29:17) అతను పాల్గొనేలా అతనితో బైబిలు అధ్యయనం చేయాలని మీరు కోరుకోవచ్చు. మీరు అతని అవధానాన్ని వివిధ లేఖనాలవైపు, అలాగే ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేస్తున్న ప్రచురణలవైపు కూడా మళ్ళించవచ్చు. (మత్తయి 24:45) మీతోపాటు మీ పిల్లవాడిని కూడా క్రైస్తవ కూటాలకు తీసుకెళ్ళి, మీ పక్కన కూర్చోబెట్టుకోవచ్చు. ఇదంతా అతడు లేఖనాధారిత హెచ్చరికను లక్ష్యపెడతాడనే నమ్మకంతో చేయవచ్చు.
ఒకవేళ బహిష్కరించబడిన వ్యక్తి పెద్దవాడై, వేరే ఇంట్లో నివసిస్తుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. అపొస్తలుడైన పౌలు ప్రాచీన కొరింథులోని క్రైస్తవులకు ఇలా ఆదేశించాడు: “ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్న యెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదు.” (1 కొరింథీయులు 5:11) అవసరమైన కుటుంబ విషయాల గురించి శ్రద్ధ తీసుకునేటప్పుడు బహిష్కరించబడిన వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడవచ్చు, అయితే క్రైస్తవ తల్లిదండ్రులు ఎక్కువ సన్నిహితంగా సహవసించకుండా జాగ్రత్తపడాలి.
తప్పు చేసిన పిల్లవాడిని క్రైస్తవ కాపరులు క్రమశిక్షణలో పెట్టినప్పుడు, వారి బైబిలు ఆధారిత చర్యను మీరు తిరస్కరించడం లేదా తక్కువ చేయడానికి ప్రయత్నించడం జ్ఞానయుక్తం కాదు. సత్యాన్ని వ్యతిరేకిస్తున్న మీ కుమారుని పక్షం వహించడం అపవాది నుండి అతనికి ఏమాత్రం నిజమైన కాపుదలను ఇవ్వదు. నిజానికి, మీరు మీ ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడవేసుకుంటున్నారు. మరోవైపు, కాపరులు చేసే ప్రయత్నాలకు మద్దతునివ్వడం ద్వారా, మీరు ‘విశ్వాసమందు స్థిరంగా’ ఉండగలుగుతారు, మీ పిల్లవానికి చక్కని సహాయాన్ని అందించగలుగుతారు.—1 పేతురు 5:9.
యెహోవా మిమ్మల్ని బలపరుస్తాడు
ఒకవేళ మీ పిల్లలో ఒకరు సత్యాన్ని వ్యతిరేకిస్తే, అలా జరిగింది మీ ఒక్కరి విషయంలోనే కాదని గుర్తుంచుకోండి. ఇతర క్రైస్తవ తల్లిదండ్రులకు కూడా అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. మనమెలాంటి పరీక్షలను ఎదుర్కొంటున్నా యెహోవా మనలను బలపరచగలడు.—కీర్తన 68:19.
ప్రార్థనలో యెహోవా మీద ఆధారపడండి. క్రైస్తవ సంఘంతో క్రమంగా సహవసించండి. నియమిత కాపరులిచ్చే క్రమశిక్షణను సమర్థించండి. అలా చేయడంద్వారా, మీరు స్థిరంగా ఉండగలుగుతారు. మీ మంచి మాదిరి, తన వద్దకు తిరిగి రమ్మని యెహోవా ఇచ్చే ప్రేమపూర్వక ఆహ్వానానికి స్పందించేలా మీ పిల్లవానికి సహాయం చేయగలదు.—మలాకీ 3:6, 7.
[18వ పేజీలోని చిత్రాలు]
ప్రార్థన నుండి, క్రైస్తవ సంఘం నుండి బలాన్ని పొందండి