సమూయేలు సత్యారాధనను ప్రోత్సహించాడు
సమూయేలు సత్యారాధనను ప్రోత్సహించాడు
సమూయేలు ప్రవక్త మానవ రాజు కావాలని అడిగిన తోటి ఆరాధకులను గద్దించడమేకాక, వారిని దేవునికి విధేయులవమని ప్రోత్సహించాడు. ప్రవక్తగా తనకున్న అధికారాన్ని రుజువుచేసుకోవడానికి తుఫాను రూపంలో సూచన ఇవ్వమని ఆయన యెహోవాను అడిగాడు. ఇశ్రాయేలు దేశంలో, సంవత్సరంలోని గోధుమకోత సమయంలో భారీ వర్షాలు పడడం అరుదు. అయినా, దేవుడు ఉరుములతోకూడిన వర్షాన్ని కురిపించాడు. ఫలితంగా, ప్రజలు యెహోవాకు, ఆయన ప్రతినిధి అయిన సమూయేలుకు భయపడ్డారు.—1 సమూయేలు 12:11-19.
ప్రవక్తయైన సమూయేలు రచయిత కూడా. ఆయన వ్రాసిన వాటిలో దాదాపు 330 సంవత్సరాల ఉత్తేజకరమైన సంఘటనలతో కూడిన చారిత్రక వృత్తాంతాలు, ఇశ్రాయేలు న్యాయాధిపతుల అసాధారణ కార్యాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, జీవించినవారిలోకెల్లా అత్యంత బలవంతుడైన సమ్సోను జీవితచరిత్ర, కావ్యాలకు సంగీత రూపకాలకేగాక, రంగస్థల నాటకాలకు, సినిమాలకు ప్రేరణగా మారింది. (న్యాయాధిపతులు, 13-16 అధ్యాయాలు) విధవరాండ్రు, పేదవారు అయిన రూతు, ఆమె అత్త నయోమి గురించి కూడా సమూయేలు వ్రాశాడు. సంతోషకరమైన ముగింపుగల ఈ వాస్తవ వృత్తాంతం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది.—రూతు, 1-4 అధ్యాయాలు.
సమూయేలు వ్రాసినవాటి నుండి, ఆయన జీవితం నుండి మనమే పాఠాలు నేర్చుకోవచ్చు? ఆయన సత్యారాధనను ఎలా ప్రోత్సహించాడు?
ఆయన బాల్యం
సమూయేలు తండ్రియైన ఎల్కానా యెహోవా ఆరాధకుడు, ప్రేమగల భర్త. ఎల్కానా భార్య హన్నా ఆధ్యాత్మిక బలంగల స్త్రీ. గొడ్రాలైన హన్నా షిలోహులో ఉన్న యెహోవా మందిరంలో ప్రమాణం చేస్తూ తీవ్ర వేదనతో ఇలా ప్రార్థించింది: “సైన్యముల కధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినము లన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతును.” (1 సమూయేలు 1:1-11) అంటే ఆ బాలుడు యెహోవా సేవకు అంకితం చేయబడతాడని అర్థం.
హన్నా మౌనంగా ప్రార్థించింది. ‘ఆమె పెదవులుమాత్రము కదలుతున్నాయని’ ఆ వృత్తాంతం చెబుతోంది. ప్రధానయాజకుడైన ఏలీ ఆమె తాగిన మత్తులో ఉందని అపార్థం చేసుకొని ఆమెను మందలించాడు. అయితే, హన్నా గౌరవపూర్వకంగానే తన పరిస్థితిని ఏలీకి వివరించింది, అప్పుడు ఏలీ ఇలా అన్నాడు: “క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక.” నిజంగానే యెహోవా ఆమె విన్నపాన్ని విన్నాడు, ఎందుకంటే ఆ వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని—నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.”—1 సమూయేలు 1:12-20.
సమూయేలు ‘యెహోవా యొక్క శిక్షలోను బోధలోను’ పెరిగాడు. (ఎఫెసీయులు 6:4) సమూయేలు పాలు విడిచిన వెంటనే హన్నా షిలోహులోని దేవుని మందిరానికి ఆయనను తీసుకొచ్చి ప్రధానయాజకుడైన ఏలీకి అప్పగించింది. ఆయన సంరక్షణలో బాలుడైన సమూయేలు “యెహోవాకు పరిచర్యచేయుచుండెను.” హన్నాకు కలిగిన గొప్ప ఆనందాన్ని ఆమె కృతజ్ఞతాపూర్వకంగా పలికిన మాటల్లో స్ఫూర్తిదాయకంగా వ్యక్తంచేసింది, ఆ మాటల్ని సమూయేలు ఆ తర్వాత స్వయంగా నమోదుచేశాడు.—1 సమూయేలు 2:1-11.
మీరు తల్లిదండ్రులైతే, యెహోవా సేవలో కొనసాగడాన్ని జీవితలక్ష్యంగా పెట్టుకోమని మీరు మీ పిల్లలను ప్రోత్సహిస్తున్నారా? తన శక్తిని సరైనరీతిలో ఉపయోగించాలనుకునే వ్యక్తికి సత్యారాధనను ప్రోత్సహించడంకన్నా శ్రేష్ఠమైన మార్గం మరొకటి లేదు.
సమూయేలు దేవాలయ సేవకు చక్కగా అలవాటుపడ్డాడు. ఆయన “యెహోవా సన్నిధిని . . . ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.” ఇతరులు తనను ఇష్టపడేలా చేసిన దైవిక లక్షణాలను ఆయన కనబర్చాడు.—1 సమూయేలు 2:21, 26.
అయితే “యెహోవాను ఎరుగని,” ఏలీ కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసుల గురించి అలా చెప్పలేము. వారు లైంగిక దుర్నీతికి పాల్పడేవారు, అర్పణకై ప్రజలు దేవాలయానికి 1 సమూయేలు 2:12, 15-17, 22-25, 27, 30-34) మరొక తీర్పు సందేశాన్ని చెప్పడానికి యెహోవా సమూయేలును ఉపయోగించుకున్నాడు.
తీసుకొచ్చిన వాటిలో శ్రేష్ఠమైనవి తమకోసం ఉంచుకునేవారు. ఏలీపైకి రాబోయే శిక్ష గురించి ప్రకటించడానికి దేవుడు అప్పటికే ఒక ప్రవక్తను పంపించాడు, ఆ శిక్షలో భాగంగా ఆయన ఇద్దరు కుమారులు మరణిస్తారు. (సమూయేలు ప్రవక్తగా పనిచేయడం
దేవుడు సమూయేలుకు ఇలా చెప్పాడు: “[ఏలీ] తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.” అదంత సులభంగా చెప్పగల విషయమేమీ కాదు, ఏదీ దాచకుండా దేవుని సందేశమంతా తనకు చెప్పమని ఏలీ సమూయేలును పట్టుబట్టాడు. దానితో సమూయేలు యెహోవా చెప్పినదంతా వివరించాడు. అలా చెప్పడానికి ఎంతో ధైర్యం అవసరం!—1 సమూయేలు 3:10-18.
సమూయేలు పెద్దవాడయ్యాక ఆయన దేవుని ప్రవక్త అని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకున్నారు. (1 సమూయేలు 3:19, 20) సమూయేలు ప్రకటించిన తీర్పు, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఘోర పరాజయాన్ని పొందడంతో మొదలైంది. యుద్ధంలో హొఫ్నీ, ఫీనెహాసులు మరణించారు, యెహోవా నిబంధనా మందసాన్ని ఫిలిష్తీయులు స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుల మరణం గురించి, అలాగే మందసం పట్టుబడడం గురించి వినిన ఏలీ వెనుకకు పడడంతో మెడ విరిగి మరణించాడు.—1 సమూయేలు 4:1-18.
ఇరవై సంవత్సరాల తర్వాత, సమూయేలు అబద్ధారాధనను విడిచిపెట్టమని ఇశ్రాయేలీయులకు ఉద్బోధించాడు. దానికి ప్రతిస్పందనగా వారు తమ విగ్రహాలను తీసివేసి, ఉపవాసముండి, చేసిన పాపాలను ఒప్పుకున్నారు. సమూయేలు వారి తరఫున ప్రార్థించి, దహనబలిని అర్పించాడు. దాని ఫలితం? ఫిలిష్తీయులు దాడి చేసినప్పుడు దేవుడు వారిని తారుమారు చేశాడు, ఇశ్రాయేలీయులు శత్రువులమీద ఎదురుదాడి చేసి వారిని ఓడించారు. యెహోవా ఆశీర్వాదంతో ఇశ్రాయేలీయుల పరిస్థితి చెప్పుకోదగినంతగా మెరుగయ్యింది, వారు ఫిలిష్తీయులు స్వాధీనం చేసుకున్న తమ ప్రాంతాలను తిరిగి సంపాదించుకున్నారు.—1 సమూయేలు 7:3-14.
సమూయేలు సత్యారాధనను ప్రోత్సహించాడు. ఉదాహరణకు, ఆయన యుద్ధంలో దొరికిన దోపుడు సొమ్ములో కొంత ఆలయ గుడారానికి ఉపయోగించేలా చూశాడు. పస్కా వేడుకలను ఏర్పాటు చేయడంలో, లేవీ గోత్రానికి చెందిన ద్వారపాలకుల పనిని నిర్ణయించడంలో సహాయాన్నందించాడు. (1 దినవృత్తాంతములు 9:22; 26:27, 28; 2 దినవృత్తాంతములు 35:18) సమూయేలు ప్రతీ సంవత్సరం న్యాయం తీర్చడానికి, రామాలో ఉన్న తన ఇంటి నుండి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళేవాడు. నిష్పక్షపాతిగా, నిజాయితీపరునిగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రజలు సమూయేలును గౌరవించేవారు కాబట్టే ఆయన వారికి ఆధ్యాత్మికంగా సహాయం చేయగలిగాడు. (1 సమూయేలు 7:15-17; 9:6-14; 12:2-5) ఆయన మాదిరిని అనుసరించేలా ఆయన నిజాయితీ, ఆధ్యాత్మికత అనేకులను పురికొల్పాయనడంలో సందేహంలేదు. సమూయేలు ప్రవర్తన మీ మీద అలాంటి ప్రభావాన్నే చూపిస్తోందా?
ఇశ్రాయేలీయులు రాజు కావాలని అడగడం
సమూయేలు తన వృద్ధాప్యంలో, తన కుమారులైన యోవేలును, అబీయాను న్యాయాధిపతులుగా నియమించాడు. వారు ‘అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసిరి.’ వారి ప్రవర్తన ఇశ్రాయేలీయులలోని పెద్దలు రాజు కావాలని అడిగేందుకు నడిపించింది. (1 సమూయేలు 8:1-5) అలా అడగడం సమూయేలుకు ఏమాత్రం నచ్చలేదు. అయితే ఆయన దీని గురించి ప్రార్థించినప్పుడు, యెహోవా ఇలా చెప్పాడు: “వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు.” (1 సమూయేలు 8:6, 7) దేవుడు వారిష్టపడినట్లే చేయమని, రాచరిక పరిపాలన క్రింద వారు కొన్ని స్వేచ్ఛలను కోల్పోతారని వారిని హెచ్చరించమని సమూయేలుకు చెప్పాడు. ప్రజలు మొండిపట్టు పట్టినప్పుడు, యెహోవా, సమూయేలు సౌలును రాజుగా అభిషేకించే ఏర్పాటు చేశాడు.—1 సమూయేలు 8:6-22; 9:15-17; 10:1.
1 సమూయేలు 10:17-24; 11:11-15) సమూయేలు ఇశ్రాయేలీయుల చరిత్రను సమీక్షించి, యెహోవాకు విధేయులవమని రాజును, ప్రజలను హెచ్చరించాడు. దేవుడు సమూయేలు చేసిన ప్రార్థనకు సమాధానంగా, పైన పేర్కొన్న అకాల తుఫాను రప్పించాడు. ఆ తుఫాను, ప్రజలు యెహోవాను తిరస్కరించడంలో తాము చేసిన తప్పును ఒప్పుకొనేలా చేసింది. తమ గురించి ప్రార్థించమని వారు సమూయేలును అడిగినప్పుడు, ఆయన ఇలా సమాధానమిచ్చాడు: “మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.” యెహోవాపట్ల, ఆయన ప్రజలపట్ల యథార్థమైన ప్రేమ చూపించడంలో ఎంత చక్కని మాదిరో కదా! (1 సమూయేలు 12:6-24) దైవపరిపాలనా ఏర్పాట్లకు మద్దతునివ్వడానికి, తోటి విశ్వాసుల తరఫున ప్రార్థన చేయడానికి మీరు కూడా అలాగే ఇష్టపడుతున్నారా?
సమూయేలు తనకు ఇష్టం లేకపోయినా ఈ ఏర్పాటుకు మద్దతునిచ్చాడు. ఇశ్రాయేలీయులు అమ్మోనీయులమీద విజయం సాధించిన తర్వాత, సౌలు రాజ్యాధికారాన్ని స్థిరపరచడానికి ఆయన ప్రజలందరినీ గిల్గాలులో సమకూర్చాడు. (ఇశ్రాయేలును పరిపాలించిన మొదటి ఇద్దరు మానవ రాజులు
సౌలు దేవుని ఆమోదాన్ని పొందిన వినయస్థుడైన వ్యక్తి. (1 సమూయేలు 9:21; 11:6) కానీ కొంతకాలానికి ఆయన దేవుని నిర్దేశాలను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. ఉదాహరణకు, సౌలు తనకు ఆజ్ఞాపించబడినట్లుగా వేచివుండేబదులు, అసహనంతో బలి అర్పించినందుకు సమూయేలు ఆయనను గద్దించాడు. (1 సమూయేలు 13:10-14) సౌలు అవిధేయతాపూర్వకంగా అమాలేకీయుల రాజైన అగగును చంపకుండా విడిచిపెట్టినప్పుడు, సమూయేలు అతనితో ఇలా అన్నాడు: “నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు.” సమూయేలే అగగును చంపి, సౌలును బట్టి దుఃఖించాడు.—1 సమూయేలు 15:1-35.
చివరికి యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు?” ఆ తర్వాత, యెహోవా యెష్షయి కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించడానికి సమూయేలును బేత్లెహేముకు పంపాడు. యెహోవా అందరిలో చిన్నవాడైన దావీదును అభిషేకించమని చెప్పేంతవరకు సమూయేలు యెష్షయి కుమారులలో ఒక్కొక్కరిని పరిశీలించాడు. ఆ రోజు సమూయేలు ఈ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు: “మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; . . . మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”—1 సమూయేలు 16:1-13.
సౌలు అవిధేయత సమూయేలుకు బాధ కలిగించింది కాబట్టి, సౌలు దావీదును చంపేంతగా ద్వేషాన్ని పెంచుకున్నప్పుడు ఆయనకు ఇంకెంత బాధ కలిగి ఉంటుందో కదా! అలాంటి బాధలున్నప్పటికీ, సమూయేలు తన వృద్ధాప్యంలో కూడా చురుగ్గా ఉంటూ యెహోవా సేవలో తాను చేయగలిగినదంతా చేశాడు.—1 సమూయేలు 19:18-20.
సమూయేలు వారసత్వం
సమూయేలు చనిపోయినప్పుడు, అనేకుల జీవితాలను ప్రభావితం చేసిన వినయస్థుడు, ధైర్యవంతుడు అయిన ఈ ప్రవక్త గురించి ఇశ్రాయేలీయులు ఎంతో దుఃఖించారు. (1 సమూయేలు 25:1) సమూయేలు అపరిపూర్ణుడు, సరైన ముగింపుకు రావడంలో కొన్నిసార్లు పొరపాట్లు చేశాడు. అయితే సమూయేలు తనకు పరిమితులున్నప్పటికీ యెహోవాపట్ల సంపూర్ణ భక్తిని కలిగివున్నాడు, ఇతరులు అలాగే చేసేందుకు సహాయం చేయడంలో ఆయన అలుపెరుగక కృషి చేశాడు.
సమూయేలు జీవించిన కాలంనుండి ఇప్పటివరకు ఎన్నో మార్పులు జరిగాయి, కానీ ఆయన జీవిత చరిత్ర మనకు విలువైన పాఠాలను నేర్పిస్తుంది! అన్నింటికన్నా ముఖ్యంగా, సమూయేలు యెహోవా సత్యారాధనను అనుసరించి, దాన్ని ప్రోత్సహించాడు. మీరూ అలాగే చేస్తున్నారా?
[16వ పేజీలోని బాక్సు]
సమూయేలు జీవితం గురించి లోతుగా ఆలోచించండి
• సమూయేలు తల్లిదండ్రులు ఆయనకు దేవుని వాక్యాన్ని బోధించినట్టుగానే, మీ పిల్లలను ‘యెహోవా శిక్షలోను బోధలోను పెంచండి.’—ఎఫెసీయులు 6:4.
• సమూయేలులాగే యెహోవాను సేవించడాన్ని తమ జీవితలక్ష్యంగా పెట్టుకోమని మీ పిల్లలను ప్రోత్సహించండి.
• సమూయేలు ప్రదర్శించిన దైవిక లక్షణాలు ఇతరులు ఆయనను ఇష్టపడేలా చేశాయి, ఆ విధంగా ఆయన మనకు మంచి మాదిరిని ఉంచాడు.
• సమూయేలు సత్యారాధనను ప్రోత్సహించడానికి తాను చేయగలిగినదంతా చేశాడు, మనమూ అలాగే చేయాలి.
[15వ పేజీలోని చిత్రం]
సమూయేలు సత్యారాధనను ప్రోత్సహించి, ఇష్టపూర్వకంగా ఆధ్యాత్మిక సహాయాన్నందించాడు