జ్ఞాపకముంచుకోవలసిన సంఘటన!
జ్ఞాపకముంచుకోవలసిన సంఘటన!
సోమవారం, ఏప్రిల్ 2
అది సా.శ. 33వ సంవత్సరం, నీసాను 14వ తేదీ. యేసు తన అపొస్తలులతో పులియని రొట్టెను, ద్రాక్షారసాన్ని పంచుకుంటున్నాడు. ఆయన వారికి ఏ ఆదేశమిచ్చాడు? “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.”—లూకా 22:19.
కాబట్టి, ఆయన ఆ రాత్రి ఇచ్చిన ఆదేశం ప్రకారమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు సంవత్సరానికొకసారి యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సమకూడతారు. ఈ సంవత్సరం నీసాను 14 సోవువారం, ఏప్రిల్ 2న సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమౌతుంది. ఆ సాయంత్రం జరిగే జ్ఞాపకార్థ కూటానికి మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. ఆ కూటం జరిగే ఖచ్చితమైన సమయం, స్థలం కోసం స్థానికంగా ఉన్న యెహోవాసాక్షులను దయచేసి అడగండి.