కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ధైర్యం —దేవుని సేవకులకు ఎంతో అవసరం

ధైర్యం —దేవుని సేవకులకు ఎంతో అవసరం

ధైర్యం—⁠దేవుని సేవకులకు ఎంతో అవసరం

ధై ర్యం అంటే బలానికి, సాహసానికి, శౌర్యపరాక్రమాలకు మారుపేరు. అది భయానికి, బిడియానికి, పిరికితనానికి పూర్తిగా భిన్నమైంది. (మార్కు 6:​49, 50; 2 తిమోతి 1:⁠7) పూర్వం దేవుని సేవకులకు ఆ లక్షణం ఎంతో అవసరమైంది, ఈ దుష్ట విధానానికి అంతం సమీపించే కాలంలో జీవిస్తుండగా ఆ లక్షణం మనకు కూడా మరింత ప్రాముఖ్యం.

ధైర్యంగా ఉండడాన్ని వ్యక్తం చేయడానికి తరచూ ఉపయోగించబడే హెబ్రీ పదం ఛజాక్‌. ఆ పదానికి ప్రాథమికంగా “ధైర్యంగా ఉండండి” అని అర్థం, “ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతోకూడ ఉండును” అనే 2 దినవృత్తాంతములు 19:⁠11లోని మాటల్లో చూపించబడినట్లుగా అది తరచూ క్రియలతో ముడిపెట్టబడింది. ఛజాక్‌ తరచూ అదే అర్థం వచ్చే అమాట్స్‌ అనే పదంతోపాటు ఉపయోగించబడుతుంది. “దృఢత్వము వహించి ధైర్యముగానుండుడి” (యెహోషువ 10:​25), “మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి” (కీర్తన 31:​24) లాంటి వాక్యాల్లో ఈ రెండు పదాలు కనిపిస్తాయి.

గ్రీకు భాషలో ధైర్యంగా ఉండడమనే మనోస్థితిని వర్ణించడానికి రెండు క్రియాపదాలు ఉపయోగించబడ్డాయి. థారీయో అనే క్రియాపదాన్ని 2 కొరింథీయులు 5:⁠8లోని “ధైర్యము గలిగి” అనే మాటలను వ్యక్తం చేయడానికి, థార్సీయో అనే క్రియాపదాన్ని మత్తయి 9:⁠2లోని “కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవి” అనే మాటలను వ్యక్తం చేయడానికి ఉపయోగించబడ్డాయి. టోల్మావో అనే క్రియాపదం వివిధ రకాలుగా అంటే “తెగింపు” అని, (యూదా 9; మార్కు 12:​34; రోమీయులు 15:​18) “ధైర్యము కలిగినవాడను” అని (2 కొరింథీయులు 11:21) అనువదించబడ్డాయి. ఏదైనా కష్టమైన పనిని చేపట్టినప్పుడు ధైర్యాన్ని, సాహసాన్ని చూపించాల్సిన అవసరతను నొక్కిచెప్పడానికి ఈ క్రియాపదం ఉపయోగించబడింది.

విశ్వాసంతో ఉండాలంటే ధైర్యం అవసరం

సర్వోన్నతునిపట్ల విశ్వాసంతో ఉండడానికి ప్రాచీనకాల దేవుని సేవకులకు ఎల్లప్పుడూ ధైర్యం అవసరమైంది. అందుకే వాగ్దాత్త దేశంలోకి ప్రవేశించబోతుండగా మోషే ఇశ్రాయేలీయులతో “నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుడి” అని చెప్పాడు. ఆయన తన తర్వాత నియమించబడిన యెహోషువకు కూడా అదే ఉపదేశించాడు. (ద్వితీయోపదేశకాండము 31:​5, 7) మోషే చెప్పిన ఆ మాటల్ని ధృవీకరిస్తూ యెహోవా స్వయంగా యెహోషువతో “నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. . . . నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగా” ఉండుము అని చెప్పాడు. (యెహోషువ 1:​6, 7, 9) ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఆ జనాంగం యెహోవా ధర్మశాస్త్రాన్ని విని, నేర్చుకుని, దానికి లోబడాలి. (ద్వితీయోపదేశకాండము 31:​9-12) అదే విధంగా, యెహోషువ నిబ్బరంగా ధైర్యంగా ఉండడానికి దేవుని ధర్మశాస్త్రాన్ని క్రమంగా చదవాలని, దాని ప్రకారం నడుచుకోవాలని ఆజ్ఞాపించబడ్డాడు. “ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు” అని యెహోషువకు చెప్పబడింది. (యెహోషువ 1:⁠8) నేడు దేవుని సేవకులు కూడా ధైర్యంగా, విశ్వాసంగా, జ్ఞానవంతులుగా ఉండడంలో విజయం సాధించాలంటే అలాగే చేయాలి.

ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి సహాయపడేవి

ధైర్యం తెచ్చుకోమనే స్పష్టమైన నియమాలు లేఖనాల్లో అనేకం ఉండడమేకాక, ఒక వ్యక్తి దాన్ని ఎలా కూడగట్టుకోవాలో కూడా చెప్పబడింది. (కీర్తన 31:​24) తోటి ఆరాధకులతో సహవసించడం అత్యంత సహాయకరంగా ఉండవచ్చు. పౌలు కృంగదీసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన క్రైస్తవ సహోదరులను చూసి “దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.” (అపొస్తలుల కార్యములు 28:​15) పరాక్రమవంతుడైన దావీదు, కీర్తన 27:⁠14లో “ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము” అని చెప్పాడు. ధైర్యంగా ఉండడానికి తనకు సహాయం చేసిందేమిటో 27వ కీర్తనలో ఇలా వెల్లడించాడు: తన ప్రాణానికి “రక్షణయునైయున్న” యెహోవాపై ఆధారపడడం (1వ వచనం), పూర్వం యెహోవా తన శత్రువులతో వ్యవహరించిన విధానం (2, 3 వచనాలు), యెహోవా ఆరాధనా ఆలయంపట్ల కృతజ్ఞత (4వ వచనం), యెహోవా అందించే సంరక్షణ, సహాయం, విడుదలపై నమ్మకం (5-10 వచనాలు), దేవుని నీతియుక్త మార్గాలకు సంబంధించిన సూత్రాల గురించి ఎల్లవేళలా బోధించబడడం (11వ వచనం), విశ్వాసం, నిరీక్షణ లాంటి గుణాలను కలిగివుండడం (13, 14 వచనాలు).

క్రైస్తవులకు ధైర్యం ఎందుకు అవసరం?

యెహోవా దేవునితో శత్రుత్వం కలిగివున్న ఈ లోకంలోని వైఖరులతో, చర్యలతో మనం కలుషితమవకుండా, లోకంలోని ద్వేషాన్ని ఎదుర్కొంటూ కూడా ఆయనకు విశ్వసనీయంగా ఉండాలంటే ప్రతీ క్రైస్తవునికి ధైర్యం అవసరం. యేసుక్రీస్తు తన శిష్యులతో, “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.” (యోహాను 16:​33) దేవుని కుమారుడు ఎన్నడూ లోక ప్రభావానికి లొంగిపోలేదు, కానీ ఏ విషయంలోనూ దాన్ని అనుకరించకుండా ఉండడం ద్వారా లోకాన్ని జయించాడు. ఈ లోకం నుండి వేరుగా, నిష్కళంకులుగా ఉండడానికి ధైర్యం అవసరమైనవారికి అజేయునిగా యేసుక్రీస్తు ఉంచిన మహత్తరమైన మాదిరి, పాపరహితమైన జీవనవిధానంవల్ల పొందిన ప్రతిఫలం ఆయనను అనుకరించేందుకు తగిన ధైర్యాన్నిస్తాయి.​—⁠యోహాను 17:​16.

యేసుక్రీస్తు తన అనుచరులకు అప్పగించిన పనిని నెరవేర్చడానికి వారికి ధైర్యం అవసరం. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును” అని, “భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని” ఆయన వారితో చెప్పాడు.​—⁠మత్తయి 24:​14; అపొస్తలుల కార్యములు 1:⁠8.

క్రైస్తవ ప్రచారకులు తమ కృషికి ఎలాంటి ఫలితాలను అపేక్షించాలి? పౌలు విషయంలోనైతే, “అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి.” (అపొస్తలుల కార్యములు 28:​24) దేవుని వాక్యంపై ఆధారపడిన నిజమైన క్రైస్తవ ప్రకటనాపని ఏదోక స్పందనను కలిగించాలి. అది శక్తిమంతమైంది, చైతన్యవంతమైంది, అన్నింటికన్నా ప్రాముఖ్యంగా అది ప్రజలు ఎవరి పక్షం వహిస్తారో తేల్చుకోవాల్సిన వివాదాంశం గురించిన సందేశం. కొందరు రాజ్యసువార్తకు బద్ధశత్రువులుగా మారతారు. (అపొస్తలుల కార్యములు 13:​49-50; 18:​5, 6) మరికొందరు కొంతకాలం దాన్ని విని, ఆ తర్వాత వివిధ కారణాలవల్ల తమ మనసు మార్చుకుంటారు. (యోహాను 6:​65, 66) ఇంకొంతమంది సువార్తను అంగీకరించి దాని విషయంలో చర్యలు తీసుకుంటారు. (అపొస్తలుల కార్యములు 17:​11; లూకా 8:​15) అయితే, వ్యతిరేకులు లేక ఉదాసీనంగా ఉండేవారు చూపించే ప్రతికూల స్పందనను ఎదుర్కోవడానికి సువార్తికులకు ధైర్యం అవసరం.

హింస విషయంలో సరైన మనోవైఖరి

క్రైస్తవునిగా ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఆయన ఖచ్చితంగా హింస ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.” (2 తిమోతి 3:​12) అయినా, నిజ క్రైస్తవులు అన్నివిధాలైన క్రూరమైన హింసను ధైర్యంగా సహించగలుగుతూ, తమను హింసించేవారిపట్ల ద్వేషాన్ని, పగను పెంపొందించుకోకుండా సంతోషంగా ఉండే మనోవైఖరిని కాపాడుకుంటున్నారు. వారు దానివెనకున్న వివాదాంశాలను అంటే హింస వచ్చే మూలాన్ని, అది ఎందుకు అనుమతించబడుతుందనే విషయాల్ని అర్థం చేసుకున్నారు కాబట్టే వారలా సహించగలుగుతున్నారు. అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు వారు కలవరపడి, ఆందోళన చెందే బదులు, హింస ఎదురైనప్పుడు క్రీస్తులాగే తమ యథార్థత పరీక్షించబడుతున్నందుకు వారు సంతోషిస్తారు.​—⁠1 పేతురు 4:​12-14.

ధైర్యంతో జయించేవారు

“ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను” అని యేసు తన శిష్యులతో చెప్పాడు. విశ్వాసంగా ఆయన మాదిరిని అనుసరించి, దేవుని వాక్యమైన బైబిలు ద్వారా, యెహోవా పరిశుద్ధాత్మ నిర్దేశించే సంస్థ ద్వారా అందించబడే సహాయాన్నంతటినీ సద్వినియోగం చేసుకునేవారు కూడా ధైర్యం తెచ్చుకోవచ్చు. వాళ్లకి యెహోవా దేవుడు ఇచ్చిన హామీ హెబ్రీయులు 13వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో ఇలా వ్రాయబడింది: “‘నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను’ అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి​—⁠‘ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?’ అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.”

[31వ పేజీలోని బాక్సు]

2007 “క్రీస్తును అనుసరించండి!” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశం

తేదీలు పట్టణం భాష

1. ఆగ. 31-సెప్టెం. 2 చెన్నై-1 తమిళం

2. ఆగ. 31-సెప్టెం. 2 కొచ్చి-1 మలయాళం

3. ఆగ. 31-సెప్టెం. 2 కొయిక్కోడ్‌ మలయాళం

4. సెప్టెం. 7-9 గాంగ్‌టాక్‌ నేపాలీ

5. సెప్టెం. 21-23 కొచ్చి-2 మలయాళం

6. సెప్టెం. 28-30 చెన్నై-2 తమిళం

7. సెప్టెం. 28-30 కోయంబత్తూరు తమిళం

8. అక్టో. 5-7 దులియాజాన్‌ హిందీ

9. అక్టో. 5-7 మధురై తమిళం

10. అక్టో. 5-7 తిరుచిరాపల్లి తమిళం

11. అక్టో. 13-14 ఐజాల్‌ మిజో

12. అక్టో. 12-14 బెంగుళూరు ఇంగ్లీషు

13. అక్టో. 12-14 జంషెడ్పూర్‌ హిందీ

14. అక్టో. 12-14 మంగుళూరు కన్నడ

15. అక్టో. 12-14 ముంబాయిహిందీ

16. అక్టో. 12-14 విజయవాడ తెలుగు

17. అక్టో. 19-21 బెంగుళూరు తమిళం

18. అక్టో. 19-21 చించ్వడ్‌ హిందీ

19. అక్టో. 19-21 జలంధర్‌ పంజాబీ

20. అక్టో. 19-21 న్యూ ఢిల్లీ హిందీ

21. అక్టో. 19-21 పోర్ట్‌బ్లెయర్‌ హిందీ

22. అక్టో. 19-21 సికింద్రాబాద్‌ తెలుగు

23. అక్టో. 26-28 ఆనంద్‌ గుజరాతీ

24. అక్టో. 26-28 కోల్‌కత బెంగాలీ