యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడంలో సంతోషించడం
యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడంలో సంతోషించడం
మీరెప్పుడైనా పచ్చి కాయలు తిన్నారా? వాటి రుచి మీకు ఖచ్చితంగా నచ్చి ఉండదు. పండ్లు పరిపక్వమవడానికి సమయం పడుతుంది, దాని కోసం వేచివుండడం నిజంగా ప్రయోజనకరమే. మరితర సందర్భాల్లో కూడా వేచివుండడం విలువైనదిగా ఉంటుంది. “నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణకొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది” అని బైబిలు చెబుతోంది. (విలాపవాక్యములు 3:26; తీతు 2:13) క్రైస్తవులు యెహోవా కోసం ఏయే విధాలుగా కనిపెట్టుకొని ఉండాలి? ఆయన కోసం కనిపెట్టుకొని ఉండడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందగలం?
దేవుని కోసం కనిపెట్టుకొని ఉండడంలో ఏమి ఇమిడివుంది?
క్రైస్తవులముగా మనం “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు” ఉన్నాము. ఆయన “భక్తిహీనుల తీర్పు” తీర్చినప్పుడు కలిగే ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నాం. (2 పేతురు 3:7, 11) కీడు అంతటినీ అంతం చేయాలని యెహోవా కూడా కోరుకుంటున్నాడు, అయితే తన నామానికి మహిమ కలిగేవిధంగా క్రైస్తవులను రక్షించాలనే ఉద్దేశంతో ఆయన వేచివున్నాడు. ‘దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకు ఇచ్ఛయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించెను. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల తన మహిమైశ్వర్యము కనుపరిచెను’ అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 9:22-23) నోవహు దినములలోలాగే, నేడు తన ప్రజల్ని రక్షించేందుకు సరైన సమయమేదో యెహోవాకు తెలుసు. (1 పేతురు 3:19-20) కాబట్టి, దేవుని కోసం కనిపెట్టుకొని ఉండడంలో ఆయన చర్య తీసుకునే సమయం కోసం కనిపెట్టుకొని ఉండడం ఇమిడివుంది.
మనం యెహోవా దినం కోసం కనిపెట్టుకొని ఉండగా, మనచుట్టూ ఉన్న లోకంలోని నైతిక ప్రమాణాలు అంతకంతకూ దిగజారిపోతుండడం చూసి కొన్నిసార్లు నిరుత్సాహపడుతుండవచ్చు. అలాంటి సందర్భాల్లో, దేవుని ప్రవక్తయైన మీకా వ్రాసిన ఈ మాటలను గుర్తుంచుకోవడం మంచిది: “భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు . . . అయినను యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును.” (మీకా 7:2, 7) మనం ఏ విధంగా ‘కనిపెట్టుకొని ఉండాలి’? తరచూ కనిపెట్టుకొని ఉండడం సహనాన్ని పరీక్షించేదిగా ఉంటుంది కాబట్టి దేవుని కోసం కనిపెట్టుకొని ఉండడంలో మనమెలా సంతోషాన్ని పొందవచ్చు?
కనిపెట్టుకొని ఉంటూనే సంతోషంగా ఉండడం
మనం యెహోవా నుండి సరైన వైఖరిని నేర్చుకోవచ్చు. ‘సంతోషంగా ఉండే దేవుడు’ తన వైఖరిని ఎన్నడూ మార్చుకోలేదు. (1 తిమోతి 1:8, NW) ఆయన వేచివుంటూనే సంతోషంగా కూడా ఉంటాడు ఎందుకంటే, మానవుల్ని సృష్టించినప్పుడు వారెలాంటి పరిపూర్ణత కలిగివుండాలని ఆయన ఉద్దేశించాడో, తనను ప్రేమించేవారిని అలాంటి పరిపూర్ణతకు తీసుకురావాలనే తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయనింకా పనిచేస్తూనే ఉన్నాడు. (రోమీయులు 5:12; 6:23) ఆయన తాను చేస్తున్న పని మూలంగా లక్షలాదిమంది సత్యారాధనవైపు ఆకర్షించబడడం లాంటి మంచి ఫలితాలను చూస్తున్నాడు. యేసు ఇలా అన్నాడు: “నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను.” (యోహాను 5:17) సంతోషంగా ఉండాలంటే ఇతరుల కోసం పనులు చేయడం ప్రాముఖ్యం. (అపొస్తలుల కార్యములు 20:35) అదే విధంగా, నిజ క్రైస్తవులు ఖాళీగా కనిపెట్టుకొని ఉండరు. బదులుగా, మానవజాతి కోసం దేవుని సంకల్పాన్ని ఇతరులు తెలుసుకొనేలా సహాయం చేయడంలో కొనసాగుతారు.
విశ్వాసులైన ప్రజలు దేవుడు చర్య తీసుకునే సమయం కోసం కనిపెట్టుకొని ఉంటూ ఆయనను స్తుతించడంలో కీర్తన 71:14, 15) అసహనంగా వేచివుండే బదులు దావీదు యెహోవాను స్తుతించడంలో, సత్యారాధన విషయంలో ఇతరులను బలపర్చడంలో నిమగ్నమై ఉన్నాడు, కాబట్టి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.—కీర్తన 71:23.
ఎల్లప్పుడూ ఆనందాన్ని పొందారు. కీర్తనకర్తయైన దావీదును ఉదాహరణగా తీసుకోండి. సౌలు రాజు ఆయనను హింసించాడు, ఆప్తమిత్రుడు ఆయనకు నమ్మకద్రోహం చేశాడు, ఆయన కుమారుడే ఆయనను మోసం చేశాడు. ఈ సందర్భాలన్నిటిలోనూ యెహోవా నిర్ణయించిన సమయంలో తనకు వచ్చే ఉపశమనం కోసం కనిపెట్టుకొని ఉండడంలో దావీదు సంతోషంగా ఉండగలిగేవాడా? బహుశా దావీదే వ్రాసిన 71వ కీర్తన ఇలా చెబుతోంది: “నేను ఎల్లప్పుడు నిరీక్షింతును, నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును.” (యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడం, ఆలస్యంగా వచ్చే బస్సు కోసం వేచివుండడం కలిగించే అసహనాన్ని కలిగించదు. అది తల్లిదండ్రులు తాము గర్వించేలా తమ పిల్లవాడు ఎదిగేందుకు సంతోషంగా వేచివుండడం లాంటిది. తాము కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి వారు ఆ సంవత్సరాలన్నీ పిల్లవానికి శిక్షణనిస్తూ, ఉపదేశిస్తూ, క్రమశిక్షణలో పెడుతూ, క్రియాశీలంగా గడుపుతారు. అదే విధంగా, యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండే మనం ఇతరులు దేవునికి సన్నిహితమయ్యేందుకు సహాయం చేయడంలో సంతోషాన్ని పొందుతాం. మనం కూడా దేవుని ఆమోదాన్ని పొంది, చివరకు రక్షించబడాలని కోరుకుంటాం.
నిరీక్షణను కోల్పోకండి
యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడం అంటే నిరీక్షణను కోల్పోకుండా ఆయనను ప్రేమించడంలో, సేవించడంలో కొనసాగడం. అది సవాలుతో కూడుకున్నదే. నేడు అనేకమంది దేవుని సేవకులు, దేవుని వాగ్దానాలపై విశ్వాసంతో జీవించేవారిని ఎగతాళి చేసే ప్రజలున్న సమాజాల్లో జీవిస్తున్నారు. అయితే, 70 సంవత్సరాలు బబులోనులో పరవాసం ఉన్నప్పుడు తమ నిరీక్షణను కోల్పోని విశ్వాసులైన ఇశ్రాయేలీయుల ఉదాహరణను పరిశీలించండి. అలా ఉండడానికి వారికేది సహాయం చేసింది? కీర్తనలు చదవడం వారిని బలపర్చింది అనడంలో సందేహం లేదు. బహుశా అప్పటికే వ్రాయబడిన ప్రోత్సాహకరమైన ఒక కీర్తనలోని మాటలిలా ఉన్నాయి: “ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను. కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము.”—కీర్తన 130:5-7.
బబులోను చివరకు నాశనమైనప్పుడు, కీర్తనలను చదువుతూ, వాటి గురించి మాట్లాడడం ద్వారా తమ నిరీక్షణను కోల్పోని యూదులు ఆశీర్వదించబడ్డారు. వేలాదిమంది యూదులు వెంటనే యెరూషలేముకు ప్రయాణమై వెళ్లారు. ఆ సమయం గురించి ఇలా వ్రాయబడింది: “సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలోనుండి రప్పించినప్పుడు . . . మన నోటి నిండ నవ్వుండెను.” (కీర్తన 126:1-2) ఆ యూదులు ఆశ వదులుకోలేదు కానీ తమ విశ్వాసాన్ని బలపర్చుకుంటూనే ఉన్నారు. వారు యెహోవాకు స్తుతిగీతాలు పాడడాన్ని ఎన్నడూ మానలేదు.
అదే విధంగా, “యుగసమాప్తి” సమయంలో దేవుని కోసం కనిపెట్టుకొని జీవించే నిజ క్రైస్తవులు తమ విశ్వాసాన్ని సజీవంగా ఉంచుకోవడానికి అవిరళ కృషి చేస్తుంటారు. వారు దేవుని వాక్యాన్ని చదువుతూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు, యెహోవా రాజ్య సువార్త ప్రకటించడం ద్వారా ఆయనను స్తుతిస్తూ ఉంటారు.—మత్తయి 24:3, 14.
గద్దింపునుండి ప్రయోజనం పొందడానికి కనిపెట్టుకొని ఉండడం
“నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణకొరకు ఓపికతో కనిపెట్టుట విలాపవాక్యములు 3:26) యెహోవా యెరూషలేము నాశనం చేయబడడానికి అనుమతించడం ద్వారా వారిని గద్దించిన విధానాన్నిబట్టి దేవుని ప్రజలు ఫిర్యాదు చేయకుండా ఉండడం మంచిదని యిర్మీయా చెబుతున్నాడు. బదులుగా వారు తమ అవిధేయత గురించి, తమ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం గురించి ధ్యానించడం ద్వారా ఆ అనుభవం నుండి ప్రయోజనం పొందాలి.—విలాపవాక్యములు 3:40, 42.
మంచిది” అని దేవుని ప్రవక్తయైన యిర్మీయా వ్రాశాడు. (యెహోవా మనల్ని గద్దించడం వల్ల మనకు ప్రయోజనాలు చేకూరే విధానాన్ని, పండు పరిపక్వమయ్యే విధానంతో పోల్చవచ్చు. దేవుడిచ్చే గద్దింపు గురించి బైబిలు ఇలా చెబుతోంది: “దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.” (హెబ్రీయులు 12:11) పండు పరిపక్వమవడానికి ఎలాగైతే సమయం అవసరమో, అలాగే మనం దేవుడిచ్చే శిక్షణకు అనుగుణంగా మన వైఖరులను మార్చుకోవడానికి కూడా సమయం అవసరం. ఉదాహరణకు, మన చెడు ప్రవర్తనవల్ల ఒకవేళ మనం సంఘంలో ఏదైనా ఆధిక్యతను కోల్పోవాల్సివస్తే దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలనే మన సుముఖత మనం నిరుత్సాహపడి, మంచి చేయడం మానేయకుండా మనకు సహాయం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దావీదు వ్రాసిన ఈ ప్రేరేపిత మాటలు ప్రోత్సాహకరంగా ఉంటాయి: “[దేవుని] కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.” (కీర్తన 30:5) మనం కనిపెట్టుకొని ఉండే వైఖరిని అలవర్చుకుని దేవుని వాక్యం నుండి, ఆయన సంస్థ నుండి వచ్చే ఉపదేశాన్ని అన్వయించుకుంటే, మనకు “సంతోషము కలుగు” సమయం తప్పక వస్తుంది.
పరిణతి చెందడానికి సమయం పడుతుంది
మీరు యౌవనస్థులైతే లేక ఇటీవల బాప్తిస్మం తీసుకున్నవారైతే, క్రైస్తవ సంఘంలో కొన్ని బాధ్యతలు చేపట్టడానికి మీరు ఉత్సాహపడుతుండవచ్చు. అయితే అలాంటి బాధ్యతలు నిర్వర్తించడానికి అవసరమైన ఆధ్యాత్మిక పరిణతిని సాధించడానికి సమయం పడుతుంది. కాబట్టి, మీ తొలి సంవత్సరాలను ఆధ్యాత్మిక వ్యక్తిగా ఎదిగేందుకు సద్వినియోగం చేసుకోండి. ఉదాహరణకు, బైబిలును పూర్తిగా చదవడానికి, క్రైస్తవ లక్షణాలను పెంపొందించుకోవడానికి, శిష్యులను చేసే నైపుణ్యాలను నేర్చుకోవడానికి యౌవన దశ మంచి సమయం. (ప్రసంగి 12:1) మీరు వినయంతో కనిపెట్టుకొని ఉండే వైఖరిని ప్రదర్శిస్తే, యెహోవా మీకు అదనపు బాధ్యతలు అప్పగించే సమయం తప్పక వస్తుంది.
శిష్యులను చేసే పనికి కూడా ఓర్పు అవసరం. దేవుడు విత్తనాన్ని మొలకెత్తించే వరకు ఎలాగైతే రైతు నీళ్లు పోయాల్సి ఉంటుందో, శిష్యులను చేసే పనిలో కూడా అదే చేయాల్సిన అవసరం ఉంది. (1 కొరింథీయులు 3:7; యాకోబు 5:7) ఇతరుల హృదయాల్లో యెహోవాపట్ల విశ్వాసాన్ని, కృతజ్ఞతను పెంపొందించడానికి నెలలు లేక సంవత్సరాలు ఓర్పుగా బైబిలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడంలో పట్టుదలగా ఉండడం అంటే విద్యార్థులు తాము నేర్చుకునేవాటి గురించి మొదట్లో అంతగా స్పందించకపోయినా పట్టుదలతో కొనసాగడం ఇమిడివుంది. వారు కొంత కృతజ్ఞత చూపించినా, వారు యెహోవా ఆత్మకు స్పందిస్తున్నారనేందుకు సూచనగా ఉంటుంది. మీరు ఓర్పుగా ఉంటే, యెహోవా మీ విద్యార్థిని క్రీస్తు శిష్యునిగా మార్చడాన్ని చూసే ఆనందం మీదౌతుంది.—మత్తయి 28:20.
కనిపెట్టుకొని ఉండడం ద్వారా ప్రేమను వ్యక్తం చేయడం
కనిపెట్టుకొని ఉండడం ప్రేమను, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. దానికి ఉదాహరణగా, దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత ఎడారి ప్రాంతంలో నివసిస్తున్న ఒక వృద్ధ సహోదరి ఏమి చేసిందో గమనించండి. వాళ్ల ఊరిలో తానూ, మరో ఆధ్యాత్మిక సహోదరి మాత్రమే యెహోవాసాక్షులు. తమ తోటి క్రైస్తవులు తమను సందర్శించే రోజు కోసం వారు ఎంత ఆతురతగా ఎదురుచూస్తారో మీరు ఊహించగలరా? ఒకసారి ప్రాంతీయ పైవిచారణకర్త వారిని మొదటిసారి సందర్శించడానికి వెళ్తూ దారితప్పిపోయాడు. ఆయన వెళ్ళిన మార్గాన్నే తిరిగి వెనక్కివచ్చి మళ్లీ దారి వెతుక్కుంటూ ఆ ఊరు చేరుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది. అర్ధరాత్రి దాటి చాలాసేపైన తర్వాతగానీ ఆయనకు ఊరు కనిపించలేదు. ఆ ప్రాంతంలో కరెంటు లేదు కాబట్టి దూరాన కాస్త వెలుగు కనిపించడంతో ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన చివరకు ఆ ఊరు చేరుకుని, అక్కడ ఆ వృద్ధ సహోదరి పైకెత్తి పట్టుకున్న దీపంనుండి వస్తున్న ఆ వెలుగును చూసి ఎంతగానో సంతోషించాడు! ఆయన వస్తాడని ఆమె నమ్మింది కాబట్టి ఆయన కోసం వేచివుంది.
మనం కూడా అదే విధమైన ఓర్పుతో యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడంలో సంతోషంగా ఉంటాం. ఆయన తన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడని మనం నమ్ముతాం. అంతేకాక, ఆ పైవిచారణకర్తలా మన కోసం ప్రేమతో వేచివుండే వారిపట్ల మనం కృతజ్ఞత కలిగివుంటాం. కాబట్టి, దేవుడు తన కోసం కనిపెట్టుకొని ఉండేవారిని బట్టి సంతోషించడంలో ఆశ్చర్యమేమీ లేదు. “తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు” అని బైబిలు చెబుతోంది.—కీర్తన 147:11.
[18వ పేజీలోని చిత్రం]
దేవుని స్తుతించడంలో నిమగ్నమైవున్న ప్రజలు యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడంలో సంతోషిస్తారు