కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

నోవహు పవిత్ర జంతువుల్లో ఎన్నింటిని ఓడలోకి తీసుకువెళ్లాడు​—⁠ప్రతి జాతిలో ఏడింటినా లేక ఏడు జతలనా?

నోవహు ఓడ నిర్మించడం పూర్తిచేసిన తర్వాత యెహోవా ఆయనతో ఇలా అన్నాడు: “ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును, [‘ప్రతి జాతి పోతును పెంటియు ఏడును,’ NW] పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును తీసుకెళ్లుము” అని చెప్పాడు. (ఆదికాండము 7:​1, 2) ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌, పవిత్ర గ్రంథం​—⁠వ్యాఖ్యాన సహితం వంటి అనువాదాలతోపాటు పరిశుద్ధ గ్రంథము కూడా ఆ ఆదిమ హెబ్రీ పదాన్ని ఏడు జతలు అన్నట్లు అనువదించాయి.

హీబ్రూ భాషలో “ఏడు” అనేది, అక్షరార్థంగా ఏడు ఏడు అని వ్రాయబడింది. (ఆదికాండము 7:⁠2) అయితే, హీబ్రూ భాషలో ఆ అంకె రెండుసార్లు ఇవ్వబడినంత మాత్రాన ఆ రెండు అంకెలను కలపాలని అర్థం కాదు. ఉదాహరణకు, 2 సమూయేలు 21:⁠20 (ఈజీ-టు-రీడ్‌-వర్షన్‌)లో ఒక “మహాకాయుడు,” “కాళ్లకు, చేతులకు ఒక్కొక్క దానికి ఆరేసి వ్రేళ్ల చొప్పున మొత్తము ఇరవై నాలుగు” వ్రేళ్లు ఉన్నట్లు వర్ణించబడ్డాడు. హీబ్రూలో “ఆరు” అనే అంకె రెండుసార్లు ఉంది. అంతమాత్రాన, ఆ భారీకాయుని ఒక్కో చేతికి ఆరు జతల (లేక 12) వ్రేళ్లు, ఒక్కో కాలికి ఆరు జతల వ్రేళ్లు ఉన్నాయని అర్థం కాదు. హీబ్రూ భాషలోని వ్యాకరణ నియమాల ప్రకారం అతని కాళ్లకు, చేతులకు ఎన్నేసి వ్రేళ్లున్నాయో సూచించడానికి మాత్రమే అలా ఆరు అనే సంఖ్య రెండుసార్లు ఉపయోగించబడింది.

కాబట్టి, ఆదికాండము 7:​8, 15లో “రెండు” అనే అంకెను రెండుసార్లు వ్రాసినంత మాత్రాన అది రెండు జతలు లేక నాలుగు ఎలా కాదో అలాగే ఆదికాండము 7:​2లో కనిపించే ఏడు ఏడు అనే అంకెల అర్థం ఏడు జంటలు లేక 14 అని కాదు. ప్రతీ వచనంలో అంకెను రెండుసార్లు వ్రాయడం, స్థూలంగా ఎన్నేసి ఉన్నాయో సూచించడానికే కానీ ఆ అంకెల కూడికను సూచించడానికి కాదు. కాబట్టి, పవిత్ర జంతువుల్లో “ఏడును,” అపవిత్ర జంతువుల్లో “రెండును” ఓడలోకి తీసుకెళ్లబడ్డాయి.

కానీ ఆదికాండము 7:⁠2లో “ఏడు” అనే అంకె తర్వాత కనిపించే “పోతును పెంటియు” అనే పదబంధానికి అర్థమేమిటి? అలా ఉండడంవల్లే కొందరు, నోవహు పవిత్ర జంతువుల్లోని ప్రతి జాతిలోనుండి ఏడు జతలను తీసుకువెళ్లాలని ఆదేశించబడ్డాడని అనుకున్నారు. అయితే, పవిత్ర జంతువులు కేవలం జాతిపునరుత్పత్తి కోసమే రక్షించబడలేదు. ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత, “నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను” అని ఆదికాండము 8:⁠20 మనకు చెబుతోంది. ప్రతి జాతిలో ఏడవ జంతువు ఉండడం వల్ల నోవహు దానిని దహనబలిగా అర్పించడానికి ఉపయోగించగా, మిగతా మూడు జతలు జాతి పునరుత్పత్తి కోసం మిగల్చబడ్డాయి.