కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సరైన సమాధానాల కోసం అన్వేషణ

సరైన సమాధానాల కోసం అన్వేషణ

సరైన సమాధానాల కోసం అన్వేషణ

నా ఆరోగ్యాన్ని నేనెలా కాపాడుకోవచ్చు?

నా కుటుంబ జీవితాన్ని సంతోషభరితం చేసుకోవడానికి నేనేమి చేయవచ్చు?

నా ఉద్యోగాన్ని నిలుపుకోవడానికి నేనేమి చేయవచ్చు?

పై ప్రశ్నల్లో ఏదైనా ఒకదాన్ని మీరెప్పుడైనా అడిగారా? మీరు సమర్థవంతమైన, ఆచరణాత్మకమైన సమాధానాల్ని కనుగొన్నారా? అలాంటి లేక మరితర ప్రాముఖ్యమైన అంశాల గురించి సలహాలనిచ్చే దాదాపు 2,000 పుస్తకాలు ప్రతీ సంవత్సరం ప్రచురించబడుతున్నాయి. కేవలం బ్రిటన్‌లోనే ప్రజలు ప్రతీ ఏడాది, జీవిత సవాళ్లను ఎదుర్కొనేందుకు సలహాలందించే పుస్తకాలపై 80 కోట్ల పౌండ్లు (దాదాపు 150 లక్షల అమెరికన్‌ డాలర్లు) ఖర్చుపెడుతున్నారు. అమెరికాలో స్వయం సహాయక పుస్తకాలపై సంవత్సరానికి సుమారు 600 లక్షల డాలర్ల ఆదాయం వస్తోంది. దైనందిన జీవితంతో వ్యవహరించేందుకు మంచి సలహాల కోసం అన్వేషించేవారు మీరొక్కరే కాదు.

కోకొల్లలుగా ఉన్న అలాంటి పుస్తకాల్లో కనిపించే సలహాల గురించి మాట్లాడుతూ ఒక రచయిత ఇలా అంటున్నాడు: “కొత్త పుస్తకాల్లో చాలామట్టుకు ముందు వ్రాయబడినదాన్నే తిరిగి వ్రాస్తుంటారు.” నిజానికి, ఆ పుస్తకాల్లోని సలహాలన్నీ ప్రపంచంలోని అత్యంత ప్రాచీన పుస్తకాల్లో ఒకదానిలో వ్రాయబడిన దానినుండి పునరుక్తించబడ్డాయి. ఆ పుస్తకం ప్రపంచంలోకెల్లా అత్యంత అధికంగా పంచిపెట్టబడుతున్న పుస్తకం. అది పూర్తిగా లేక దానిలో కొంతభాగం సుమారు 2,400 భాషల్లోకి అనువదించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఆ పుస్తక ప్రతులు మొత్తం 460 కోట్లు ముద్రించబడ్డాయి. ఆ పుస్తకం మరేదో కాదు బైబిలే.

బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:​16) నిజమే, బైబిలు స్వయం సహాయక పుస్తకంగా వ్రాయబడలేదు. దాని ముఖ్యోద్దేశం మానవజాతి విషయంలో దేవుని చిత్తాన్ని బయల్పర్చాలన్నదే. అయినా, బైబిలు మనందరికీ ఎదురయ్యే సమస్యలతో ఎలా వ్యవహరించాలో తెలియజేయడమేకాక, అదిచ్చే నిర్దేశాన్ని అనుసరించేవారు తమకు తాము ప్రయోజనం చేకూర్చుకోవడం నేర్చుకుంటారని వాగ్దానం చేస్తోంది. (యెషయా 48:​17-18) దానిలోని ఉపదేశాన్ని అన్వయించుకున్నప్పుడు, జాతి, సంస్కృతి, విద్యతో నిమిత్తం లేకుండా అందరి జీవితాల్లో అది తప్పకుండా పనిచేస్తుంది. తర్వాతి ఆర్టికల్‌ను చదివి, ఆరోగ్యం విషయంలో, కుటుంబం గురించి, ఉద్యోగం లాంటి విషయాల గురించి బైబిలు చెబుతున్నది ఆచరణాత్మకమైనదో కాదో మీరే ఎందుకు నిర్ధారించుకోకూడదు?