కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

పట్టుదల చూపించిన అతిథేయి గురించి యేసు చెప్పిన ఉపమానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (లూకా 11:​5-10)

ఈ ఉపమానం, మనం ప్రార్థిస్తున్నప్పుడు మన వైఖరి ఎలావుండాలో చూపిస్తోంది. మనం ప్రత్యేకంగా దేవుని పరిశుద్ధాత్మ కోసం పట్టుదలతో అడగాలి లేదా అడుగుతూ ఉండాలి. (లూకా 11:​11-13)​—⁠12/15, 20-2 పేజీలు.

విధవరాలు, న్యాయాధిపతి గురించిన యేసు ఉపమానం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (లూకా 18:​1-8)

అది ప్రార్థించాల్సిన అవసరతను నొక్కిచెబుతోంది. ఆ న్యాయాధిపతిలా కాక యెహోవా నీతిమంతుడు, మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు. అంతేకాక, ఉపమానంలోని విధవరాలికున్న విశ్వాసమే మనకుండాలి.​—⁠12/15, 26-8 పేజీలు.

అపొస్తలుడైన పౌలు కొరింథులోని క్రైస్తవులకు “హృదయాలను విశాలపరచుకొనుడి” అని ఎందుకు చెప్పాడు? (2 కొరింథీయులు 6:​11-13)

కొరింథులోని కొందరు తమ తోటి విశ్వాసులను విలువైనవారిగా పరిగణించలేదని, వారితో సంకుచితంగా, ఉదారతలేనివారిగా ప్రవర్తించేవారని అనిపిస్తోంది. తోటి విశ్వాసులను ఎంతో విలువైనవారిగా పరిగణించడానికి మనం కృషిచేయాలి, క్రొత్త స్నేహితులను సంపాదించుకోవడానికి కూడా కృషి చేయాలి.​—⁠1/1, 9-11 పేజీలు.

ప్రకటన 7:3లో ప్రస్తావించబడిన ముద్రించబడడం అంటే ఏమిటి?

దేవుడు క్రైస్తవులను పరిశుద్ధాత్మతో అభిషేకించినప్పుడు వారు మొదటిగా ముద్రించబడ్డారు. కానీ ఆ అభిషిక్తులు విశ్వసనీయతను సంపూర్ణంగా ప్రదర్శించారని నిర్ధారించబడినప్పుడు జరిగే చివరి ముద్రణా ప్రక్రియను ప్రకటన 7:3 సూచిస్తోంది.​—⁠1/1, 30-1 పేజీలు.

సమూయేలు గురించిన బైబిలు వృత్తాంతం నుండి తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?

సమూయేలు తల్లిదండ్రులు ఆయనకు దేవుని వాక్యాన్ని బోధించినట్లే వారు కూడా తమ పిల్లలకు బోధించాలి. అంతేకాక, యెహోవాను సేవించడాన్ని తమ జీవితలక్ష్యంగా చేసుకోమని వారు తమ పిల్లలను ప్రోత్సహించాలి.​—⁠1/15, 16వ పేజీ.

యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడంలో సంతోషిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?

మనం “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు,” ఆయన భక్తిహీనులందరినీ నాశనం చేసినప్పుడు కలిగే ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నాం. (2 పేతురు 3:​7, 11) దుష్టత్వాన్నంతటినీ అంతం చేయాలని యెహోవా ఎంతో కోరుకుంటున్నా తన నామానికి మహిమ కలిగే విధంగా క్రైస్తవులను రక్షించాలనే ఉద్దేశంతో ఆయన వేచివున్నాడు. ఎప్పుడు చర్యతీసుకోవాలో యెహోవాకు తెలుసనే నమ్మకంతో మనం ఉండాలి, ఈలోగా మనం ఉత్సాహంగా ఆయనను స్తుతించాలి. (కీర్తన 71:​14, 15)​—⁠3/1, 17-18 పేజీలు.

నోవహు ఓడలోకి ప్రతి పవిత్ర జంతువులోనుండి ఏడింటిని తీసుకువెళ్లాడా లేక ఏడు జతల్ని తీసుకువెళ్లాడా?

ప్రతి పవిత్ర జంతువులన్నిటిలోనుండి “పోతులు ఏడును పెంటులు ఏడును, [‘ప్రతి జాతి పోతును పెంటియు ఏడును,’ NW]” తీసుకువెళ్ళమని నోవహుకు చెప్పబడింది. (ఆదికాండము 7:​1, 2) “ఏడును” అనే పదానికి హీబ్రూ భాషలో అక్షరార్థంగా “ఏడు ఏడు” అనే అర్థం ఉంది. అలా ఉన్నంతమాత్రాన వేరే బైబిళ్ళలో ఉన్నట్లు అది ఏడు జతలను సూచించడంలేదు. నోవహు ప్రతి జాతిలోనుండి ఏడు, అంటే మూడు జతలతోపాటు అదనంగా మరొకదాన్ని తీసుకెళ్ళాడు. దానిని బలివ్వగలిగే విధంగా తీసుకెళ్ళి ఉండవచ్చు. (ఆదికాండము 8:​20)​—⁠3/15, 31వ పేజీ.

నాయకత్వం వహించే పెద్దల ప్రవర్తనా ఫలాన్ని క్రైస్తవులు ఎందుకు ‘తలంచుకోవాలి’?

పెద్దల నమ్మకమైన ప్రవర్తనా ఫలాన్ని మనం “తలంచుకొనుచు” లేదా జాగ్రత్తగా గమనిస్తూ వారి విశ్వాస మాదిరులను అనుసరించాలని అపొస్తలుడైన పౌలు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. (హెబ్రీయులు 13:⁠7) పెద్దలకు లోబడాలని దేవుని వాక్యం మనకు నిర్దేశిస్తోంది కాబట్టే మనమలా చేస్తాం. అంతేకాక, వారికి రాజ్య సంబంధ విషయాలపట్ల, మన సంక్షేమంపట్ల ఎంతో శ్రద్ధవుందని కూడా ఒప్పించబడ్డాం.​—⁠4/1, 28వ పేజీ.