కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాతావరణ సూచనలు చెప్పడంకన్నా మరింత ప్రాముఖ్యమైన అంశం

వాతావరణ సూచనలు చెప్పడంకన్నా మరింత ప్రాముఖ్యమైన అంశం

వాతావరణ సూచనలు చెప్పడంకన్నా మరింత ప్రాముఖ్యమైన అంశం

దాదాపు అన్ని దేశాల్లో వాతావరణం గురించిన రకరకాల సామెతలు ఉన్నాయి. సాయంకాలపు ఎర్రని ఆకాశం నావికులకెంతో ఇష్టం. ఉదయకాలపు ఎర్రని ఆకాశం నావికులకెంతో కష్టం. ఆ సామెతలో పేర్కొనబడినట్లుగా వాతావరణ పరిస్థితులు ఏర్పడడానికిగల సాంకేతిక కారణాలను నేటి వాతావరణ శాస్త్రజ్ఞులు వివరిస్తున్నారు.

యేసు కాలంలో కూడా ప్రజలు ఆకాశాన్ని పరిశీలించి దాని రూపాన్నిబట్టి వాతావరణ సూచనలు చెప్పేవారు. యేసు కొంతమంది యూదులతో ఇలా అన్నాడు: “సాయంకాలమున మీరు​—⁠ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున​—⁠ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు.” అయితే యేసు వారినుద్దేశించి ఈ అసాధారణమైన మాటలు పలికాడు: “[మీరు] యీ కాలముల సూచనలను వివేచింపలేరు.”​—⁠మత్తయి 16:​2, 3.

ఆ “కాలముల సూచనలు” ఏమిటి? దేవుడు పంపించిన నిజమైన మెస్సీయ యేసే అని తెలియజేసే అనేక సూచనలు వారికి కనిపించాయి. ఆయన చేసిన కార్యాలు, ఆకాశంలోని ఎర్రదనం కనిపించేంత స్పష్టంగా ఉన్నాయి. అయితే, వాతావరణం కన్నా ఖచ్చితంగా ఎంతో ప్రాముఖ్యమైన పరిణామమైన మెస్సీయ రాక గురించి తెలియజేసే సూచనలను యూదులు ఉపేక్షించారు.

నేడు కూడా, అక్షరార్థ ఆకాశపు రంగుకన్నా అతి ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఒక సూచన ఉంది. మెరుగైన లోకం ప్రారంభమయ్యేందుకు వీలుగా ఈ దుష్టలోకం నాశనం చేయబడుతుందని యేసు ప్రవచించాడు. ఈ మార్పు ఎప్పుడు సంభవిస్తుందో సంయుక్తంగా తెలియజేసే అనేక పరిణామాల గురించి ఆయన వివరించాడు. వాటిలో ప్రపంచవ్యాప్తంగా జరిగే యుద్ధాలు, కరవులు ఉన్నాయి. ఈ సూచనలు కనిపించినప్పుడు, దేవుడు జోక్యం చేసుకోబోయే సమయం ఆసన్నమైందని గుర్తించాలని యేసు చెప్పాడు.​—⁠మత్తయి 24:​3-21.

మీరు ఈ “కాలముల సూచనలు” గుర్తిస్తున్నారా?