కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానంలో పొందిన విజయం

యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానంలో పొందిన విజయం

యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానంలో పొందిన విజయం

ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ఉన్న యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానం 2007, జనవరి 11న, రష్యాలోని యెహోవాసాక్షులు, రష్యన్‌ ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా పెట్టిన కేసులో యెహోవాసాక్షుల పక్షాన ఏకగ్రీవ తీర్పునిచ్చింది. యెహోవాసాక్షుల మత స్వాతంత్ర్యాన్ని, న్యాయమైన విచారణ పొందేందుకు వారికున్న హక్కును ఆ తీర్పు సమర్థించింది. వారు ఆ కేసు ఎందుకు పెట్టాల్సివచ్చిందో మనం పరిశీలిద్దాం.

రష్యాలోని చెల్యాబన్స్క్‌ నగరంలో ఉన్న యెహోవాసాక్షుల సంఘంలో బధిరులు ఎక్కువగా ఉన్నారు. వారు తమ కూటాలు జరుపుకునేందుకు వృత్తి విద్యా కళాశాల నుండి ఒక స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు. వారి కూటాన్ని 2000, ఏప్రిల్‌ 16 ఆదివారం ప్రాంతీయ మానవ హక్కుల సంఘ ఛైర్మన్‌ లేదా కమీషనరుతోపాటు, ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు, మఫ్టీలో ఉన్న మరో పోలీసు అధికారి కలిసి అడ్డుకున్నారు. ప్రత్యేకంగా కమీషనరుకు వారిపట్ల ఉన్న పక్షపాతాన్నిబట్టి, సాక్షులు చట్టపరమైన ఏ ఆధారాలు లేకుండా కూటాలను నిర్వహిస్తున్నారని అబద్ధారోపణలు చేస్తూ వారు ఆ కూటాన్ని ఆపేశారు. ఆ ఆడిటోరియమ్‌ను 2000, మే 1 నుండి సాక్షులకు అద్దెకు ఇవ్వడం మానేశారు.

యెహోవాసాక్షులు చెల్యాబన్స్క్‌ న్యాయవాదికి ఫిర్యాదు చేశారు, కానీ దానివల్ల ఎలాంటి ఫలితం లేకపోయింది. రష్యా రాజ్యాంగం, కన్వెన్షన్‌ ఫర్‌ ద ప్రొటెక్షన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ ఫండమెంటల్‌ ఫ్రీడమ్స్‌, మత స్వాతంత్ర్యానికి, సమకూడే స్వాతంత్ర్యానికి హామీనిస్తున్నాయి. కాబట్టి సాక్షులు ముందుగా జిల్లా న్యాయస్థానంలో పౌరసంబంధమైన ఫిర్యాదు చేసి, ఆ తర్వాత ప్రాంతీయ న్యాయస్థానంలో అప్పీల్‌ చేశారు. అంతేగాక, గతంలో 1999, జూలై 30న సుప్రీంకోర్టు మరో కేసులో ఇలా తీర్పునిచ్చింది: “మనస్సాక్షికి సంబంధించిన స్వాతంత్ర్యానికి, మతపరమైన కార్యక్రమాల కోసం సమకూడే స్వాతంత్ర్యానికి సంబంధించిన రష్యా చట్ట ప్రకారం, ‘ఎలాంటి ఆటంకం లేకుండా’ అనే పదబంధానికున్న అర్థమేమిటంటే, మతసంబంధ కార్యక్రమాలను [వాటి కోసం ఏర్పాటు చేయబడిన స్థలాల్లో] జరుపుకునేందుకు అనుమతి లేదా అధికారుల ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.” (బ్రాకెట్లు వారివి.) గతంలో ఇలాంటి తీర్పు ఇవ్వబడినా, జిల్లా, ప్రాంతీయ కోర్టుల్లో పెట్టుకున్న ఫిర్యాదులు కొట్టివేయబడ్డాయి.

ఆ కేసు 2001, డిసెంబరు 17న యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానంలో ప్రవేశపెట్టబడింది. దాని విచారణ 2004, సెప్టెంబరు 9న జరిగింది. కోర్టు ఇచ్చిన ఆఖరి తీర్పులోని కొన్ని అంశాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

“ప్రభుత్వ అధికారులు 2000, ఏప్రిల్‌ 16న దరఖాస్తుదారుల మతసంబంధ సమావేశం పూర్తవకముందే అడ్డుపడడం ద్వారా వారి మత స్వాతంత్ర్యపు హక్కు విషయంలో జోక్యం చేసుకోవడాన్ని కోర్టు గుర్తించింది.”

“కూటాలు జరుపుకోవడానికి న్యాయబద్ధంగా అద్దెకు తీసుకున్న స్థలంలో మతసంబంధ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చట్టబద్ధమైన ఆధారం లేదని స్పష్టంగా తెలుస్తోంది.”

“మతసంబంధ సమావేశాలకు అధికారులనుండి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన లేదా నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇలాంటి కేసులకు సంబంధించి గతంలో రష్యా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును [కోర్టు] పరిగణలోకి తీసుకుంటుంది.”

“కాబట్టి, కమీషనరు, ఆమె సహచరులు 2000, ఏప్రిల్‌ 16న దరఖాస్తుదారుల మతసంబంధ కూటానికి భంగం కలిగించడం ద్వారా, యూరోపియన్‌ కన్వెన్షన్‌ యొక్క 9వ నిబంధనను [మత స్వాతంత్ర్యాన్ని] ఉల్లంఘించారు.”

“జిల్లా, ప్రాంతీయ కోర్టులు ఇరుపక్షాల వాదనను న్యాయంగా, నిష్పక్షపాతంగా విచారణ చేసే . . . తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యారని కోర్టు గుర్తించింది. . . . యూరోపియన్‌ కన్వెన్షన్‌ యొక్క 6వ నిబంధన [ఇరుపక్షాలు న్యాయమైన విచారణ పొందే హక్కు] ఉల్లంఘించబడింది.”

యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానంలో తమకు విజయాన్ని అనుగ్రహించినందుకు యెహోవాసాక్షులు దేవునిపట్ల కృతజ్ఞతతో ఉన్నారు. (కీర్తన 98:⁠1) కోర్టు తీసుకున్న నిర్ణయం ఎంత విస్తృతంగా ప్రభావం చూపిస్తుంది? దీని గురించి ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ రిలీజియన్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ అధ్యక్షుడైన జోసెఫ్‌ కె. గ్రిబాస్కీ ఇలా అన్నాడు: “ఆ నిర్ణయం, యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానం క్రిందున్న రాష్ట్రాలన్నింటిలో మతపరమైన హక్కుల విషయంలో ప్రభావం చూపిస్తుంది కాబట్టి, ఇది యూరప్‌ అంతటా మత స్వాతంత్ర్యాన్ని ప్రభావితం చేసే మరో గమనార్హమైన ప్రాముఖ్యమైన నిర్ణయం.”