గ్రంథపుచుట్ట నుండి కోడెక్స్ బైబిలు పుస్తక రూపంలోకి ఎలా వచ్చింది?
గ్రంథపుచుట్ట నుండి కోడెక్స్ బైబిలు పుస్తక రూపంలోకి ఎలా వచ్చింది?
అనేక శతాబ్దాలుగా ప్రజలు సమాచారాన్ని అనేక విధాలుగా భద్రపరిచారు. గతంలో రచయితలు తమ మాటలను స్మారకచిహ్నాలమీద, రాతి లేక చెక్క పలకలమీద, చర్మప్రతాలమీద, ఇతర వస్తువులమీద నమోదుచేసేవారు. మొదటి శతాబ్దానికల్లా మధ్య ప్రాచ్యంలో, గ్రంథపుచుట్ట రూపంలో ఉన్న లిఖిత వాక్యం ఆమోదించబడి, అధికార గుర్తింపుపొందింది. ఆ తర్వాత కోడెక్స్ వచ్చింది, అది క్రమంగా గ్రంథపుచుట్టల స్థానాన్ని ఆక్రమించింది, రాయబడిన విషయాలను భద్రపరచడానికి అన్నిచోట్లా దానిని ఉపయోగించడం మొదలుపెట్టారు. బైబిలును పంచిపెట్టడానికి కూడా అది ఎంతగానో తోడ్పడింది. కోడెక్స్ అంటే ఏమిటి, అది వాడుకలోకి ఎలా వచ్చింది?
మనం నేడు చూస్తున్న పుస్తకాలు గతంలో కోడెక్స్ రూపంలో ఉండేవి. పత్రాలను మడతపెట్టి, ఒకచోట చేర్చి ఆ పత్రాలు మడతపెట్టబడినచోట కుట్టి కోడెక్స్‌లు తయారుచేసేవారు. కోడెక్స్‌లో పేజీకి ఇరువైపులా రాయబడేది, దానికి అట్ట కూడా ఉండేది. ప్రాచీన కోడెక్స్‌లు నేడు మనం ఉపయోగిస్తున్న పుస్తకాల్లా కనిపించేవి కావు, అయితే కనిపెట్టబడిన ఇతర అనేక వస్తువుల్లాగే వాటిని ఉపయోగించినవారి అవసరాలు, అభీష్టాలకు అనుగుణంగా అవి రూపొందించబడి, మార్పులు చేయబడ్డాయి.
చెక్క, మైనం మరియు చర్మపత్రాలు
ప్రారంభంలో కోడెక్స్‌లు మైనంపూత పూయబడిన చెక్క పలకలతో తయారుచేయబడేవి. సా.శ. 79లో వెసూవియస్ పర్వతం పేలినప్పుడు పాంపేయీ నగరంతోపాటు నాశనమైన హర్కులేనియమ్ పట్టణంలో మైనం పూతపూయబడిన లిఖిత పాలిప్టిక్స్ లేక ఒకదానిమీద మరొకటి పేర్చబడి పొడవుగా ఉన్న వైపు హింజీలు వేయబడ్డ పలకలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత, మలచడానికి వీలవని పలకల స్థానంలో మలచడానికి వీలయ్యే వస్తువులతో తయారుచేయబడిన పత్రాలు క్రమంగా వాడుకలోకి వచ్చాయి. కోడెక్స్‌ల్లోని పుటలకు చర్మపత్రాలను ఉపయోగించడం వాడుకలోకి వచ్చిన తర్వాత లాటిన్‌లో ఈ కోడెక్స్‌లు లేక పుస్తకాలు మెంబ్రేనై, లేక చర్మపత్ర గ్రంథాలు అని పిలవబడ్డాయి.
మనకాలంవరకు భద్రంగా ఉన్న కొన్ని కోడెక్స్‌లు పపైరస్‌తో చేయబడ్డాయి. ఈజిప్టులోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న వేడి వాతావరణంలో భద్రంగా ఉన్న అతి ప్రాచీన క్రైస్తవ కోడెక్స్‌లు పపైరస్‌తో చేయబడినవే. *
గ్రంథపుచుట్టా లేక కోడెక్సా?
సా.శ. మొదటి శతాబ్దాంతం వరకైనా క్రైస్తవులు ఎక్కువగా చుట్టలను లేక గ్రంథపుచుట్టలను ఉపయోగించినట్లు లూకా 4:16-20) ఒక్క సాహిత్యానికే ఒకటి కన్నా ఎక్కువ గ్రంథపుచుట్టలు అవసరమయ్యేవి కాబట్టి వాటిని ఉపయోగించడం మరింత ఇబ్బందికరంగా ఉండేది. రెండవ శతాబ్దం నుండి క్రైస్తవులు లేఖనాలను కోడెక్స్ రూపంలో నకలుచేయడానికి ఇష్టపడినట్లు కనిపిస్తున్నా గ్రంథపుచుట్టను వాడడం ఎన్నో శతాబ్దాల వరకు కొనసాగింది. అయినా, క్రైస్తవులు కోడెక్స్‌ను ఉపయోగించడంవల్లనే దానికి అన్నిచోట్లా ప్రజాదరణ లభించిందని నిపుణులు భావిస్తున్నారు.
కనిపిస్తుంది. సా.శ. మొదటి శతాబ్దాంతం నుండి మూడవ శతాబ్దం వరకు కోడెక్స్‌ను సమర్థించేవారికీ, గ్రంథపుచుట్టను సమర్థించేవారికీ మధ్య సంఘర్షణ జరిగింది. గ్రంథపుచుట్ట ఉపయోగించడానికి అలవాటుపడ్డ సాంప్రదాయవాదులు ఎంతోకాలంగా వాడుకలో ఉన్న అభ్యాసాలను, సాంప్రదాయాలను వదులుకోవడానికి సమ్మతించలేదు. అయితే గ్రంథపుచుట్టను చదవాలంటే ఏమేమి చేయాల్సివుంటుందో పరిశీలించండి. సాధారణంగా నిర్దిష్ట సంఖ్యలో ఉన్న పపైరస్ లేక చర్మపత్రాల పుటలను ఒకదానితో మరొకదానిని అతికించి పొడవైన పత్రంగా తయారుచేసేవారు, ఆ తర్వాత దానిని చుట్టినప్పుడు అది గ్రంథపుచుట్టగా తయారౌతుంది. గ్రంథపుచుట్ట ముఖపత్రంపై మూలపాఠం వివిధ కాలమ్స్‌లో రాయబడుతుంది. పాఠకుడు తనకు కావాల్సిన భాగాన్ని విప్పి గ్రంథపుచుట్టను చదువుతాడు. ఆయన దానిని చదివిన తర్వాత మళ్లీ చుట్టేస్తాడు. (కోడెక్స్‌వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి, దానిలో ఎన్నో విషయాలను నమోదుచేయవచ్చు, అది సౌకర్యవంతంగా ఉంటుంది, దానిని సులభంగా మోసుకెళ్లవచ్చు. తొలికాలాల్లో కొంతమంది ఆ ప్రయోజనాలను గమనించినా, చాలామంది గ్రంథపుచుట్టల వాడుకను మానేసేందుకు సంకోచించారు. అయితే, అనేక శతాబ్దాలపాటు, క్రమంగా కోడెక్స్ ప్రాముఖ్యత పెరిగేందుకు అనేక విషయాలు దోహదపడ్డాయి.
గ్రంథపుచుట్టతో పోలిస్తే కోడెక్స్‌కయ్యే ఖర్చు ఎంతో తక్కువ. దానిలో పేజీకి ఇరువైపుల రాయవచ్చు, ఒకే సంపుటిలో అనేక పుస్తకాలను బైండ్ చేయవచ్చు. కోడెక్స్‌లో నిర్దిష్ట భాగాలను సులభంగా కనుగొనవచ్చు. క్రైస్తవ మతానికి చెందినవారు, న్యాయవాది వృత్తికి చెందినవారు వాటిని ఎక్కువగా ఉపయోగించడానికి అదే ముఖ్య కారణమని కొంతమంది భావిస్తున్నారు. సంక్షిప్త మూలపాఠాలు లేక ఉపయోగించడానికి సులభంగా ఉండే ఉదాహరించబడిన బైబిలు లేఖనాల పట్టిక, సువార్త పనిలో క్రైస్తవులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేవి. అంతేకాక, కోడెక్స్‌కు సాధారణంగా చెక్కతో తయారుచేయబడిన అట్ట ఉండేది, అందుకే అది గ్రంథపుచుట్ట కన్నా ఎక్కువకాలం మన్నేది.
కోడెక్స్‌లు వ్యక్తిగత పఠనానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. మూడవ శతాబ్దాంతానికి సువార్త పుస్తకాలు ఉన్న చిన్న సైజు కోడెక్స్‌లు క్రైస్తవులని చెప్పుకున్నవారి మధ్య వ్యాప్తిలో ఉండేవి. అప్పటినుండి కోడెక్స్ రూపంలో పూర్తి బైబిలు లేక బైబిల్లోని భాగాలు వందల కోట్ల కాపీలు ముద్రించబడ్డాయి.
నేడు అనేక ఉపకరణాలు అందుబాటులో ఉన్న కారణంగా, బైబిల్లోని దైవిక జ్ఞానాన్ని త్వరగా, సులభంగా పొందడానికి వీలౌతుంది. దానిని కంప్యూటర్‌లో, ఆడియో రికార్డింగ్‌లో, ముద్రిత పేజీల్లో కనుగొనవచ్చు. మీరు బైబిలును ఏ రూపంలో ఇష్టపడినా, దేవుని వాక్యంపట్ల ప్రేమను పెంచుకోండి, ప్రతిదినం దానిని ధ్యానించండి.—కీర్తన 119:97, 167.
[అధస్సూచి]
^ పేరా 6 కావలికోట (ఆంగ్లం), ఆగస్టు 15, 1962 సంచికలోని 501-5 పేజీల్లో ఉన్న “ది ఎర్లీ క్రిస్టియన్ కోడెక్స్” అనే ఆర్టికల్‌ను చూడండి.
[15వ పేజీలోని చిత్రాలు]
బైబిలు పంచిపెట్టబడడానికి కోడెక్స్ ఎంతగానో దోహదపడింది