కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మీకు దేవుని పేరు తెలుసా?”

“మీకు దేవుని పేరు తెలుసా?”

“మీకు దేవుని పేరు తెలుసా?”

ఆప్రశ్న, మధ్య ఆసియాలోని నైరుతి ప్రాంతంలో నివసించే ఒక స్త్రీలో ఆసక్తిని రేకెత్తించింది. మా సహ పత్రికయైన తేజరిల్లు! (ఆంగ్లం) జనవరి 22, 2004వ సంచిక ముఖపత్ర శీర్షికలో ఆ ప్రశ్న కనిపిస్తుంది. ఆ స్త్రీ ప్రచురణకర్తలకు ఇలా వ్రాసింది: “నేను వెంటనే మీ పత్రికకు ఆకర్షితురాలినయ్యాను, మంచి నైతిక విలువలకు ప్రాముఖ్యతనిచ్చేలా అది నాకు సహాయం చేసింది. నాకు జీవితంపట్ల ఆశావహ దృక్పథం పెరుగుతూ ఉంది. మన దేవుని గురించి, ఈ జ్ఞానం తీసుకువచ్చే శాంతిని గురించి నేను అందరికీ చెబుతున్నాను.”

చాలా ప్రాంతాల్లో, వాస్తవానికి “భూదిగంతముల వరకు” ఉన్న ప్రజలు దైవిక నామమైన యెహోవా గురించి తెలుసుకుంటున్నారు. (అపొస్తలుల కార్యములు 1:8) ఉదాహరణకు, పరిశుద్ధ లేఖనాల టర్కెమెన్‌ అనువాదంలో, టర్కెమెన్‌ భాషలో యెహోవా అనే పేరును సులభంగా కనుగొనవచ్చు. కీర్తనలు 8:1లో ఇలా ఉంది: “యెహోవా మా ప్రభువా, . . . భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది.”

యెహోవా దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి మీరు బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకాన్ని యెహోవాసాక్షుల్లో ఒకరిని అడిగి తీసుకోవచ్చు.