సుస్థిరమైన విలువలతో లంగరు వేయబడడం
సుస్థిరమైన విలువలతో లంగరు వేయబడడం
మానవ సమాజాలన్నింటిలోనూ కొన్ని నిర్దిష్టమైన నైతిక సూత్రాలుంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా నిజాయితీ, దయ, జాలి, నిస్వార్థత వంటి లక్షణాలు విలువైనవిగా ఎంచబడతాయనీ, వాటిని మనలో చాలామందిమి ఇష్టపడతామనీ మీరు ఒప్పుకోరా?
ఎవరి విలువలు?
మొదటి శతాబ్దంలో సౌలు అని పిలువబడిన విద్యావంతుడైన ఒక వ్యక్తి, నిర్దిష్ట నైతిక సూత్రాలను అనుసరించే యూదా, గ్రీసు, రోము అనే మూడు ప్రధాన సమాజాల మధ్య జీవించాడు. అప్పట్లో సాధారణ ప్రజలు ఆ సమాజాలు స్థాపించిన రోమీయులు 2:14, 15.
సంక్లిష్టమైన ఆచారాలకు, నియమాలకు అనుగుణంగానేకాక తమలోని సహజ నైతిక స్పృహకు అనుగుణంగా నడుచుకునేవారని ఆయన గ్రహించాడు. ఆ నైతిక స్పృహే మన మనస్సాక్షి. సౌలు క్రైస్తవ అపొస్తలుడైన పౌలుగా మారిన తర్వాత ఇలా వ్రాశాడు: “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా [‘సహజసిద్ధంగా,’ పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం] ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను . . . ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.”—అలాగని మనం మంచిచెడులను నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కేవలం మన సహజసిద్ధమైన జ్ఞానంపైనే ఆధారపడితే సరిపోతుందా? అలా ఆధారపడినందువల్ల ఆ యా వ్యక్తులు, గుంపులు ఎదుర్కొన్న వైఫల్యాల ఉదంతాలు చరిత్రలో చాలా ఉన్నాయని మీరు గమనించేవుంటారు. ఈ పరిస్థితి, మనం అనుసరించడానికి శ్రేష్ఠమైన నైతిక విలువల్ని స్థాపించేందుకు ఉన్నత మూలం నుండి నడిపింపు అవసరమని అనేకమంది నమ్మేలా చేసింది. అలాంటి సుస్థిరమైన ప్రమాణాలను స్థాపించేందుకు మన సృష్టికర్త మాత్రమే అత్యుత్తమ స్థానంలో ఉన్నాడని చాలామంది ఒప్పుకుంటారు. ది అన్‌డిస్కవర్డ్ సెల్ఫ్ అనే తన పుస్తకంలో డాక్టర్ కార్ల్ జంగ్ ఇలా వ్యాఖ్యానించాడు: “దేవునిపై నమ్మకం లేని వ్యక్తి తనంతట తానుగా లోకంలో ఎదురయ్యే శారీరక, నైతిక ప్రలోభాలను ఎదిరించలేడు.”
ఆయన చివరకు తేల్చిచెప్పింది ఒక ప్రాచీన ప్రవక్త వ్రాసిన ఈ మాటలతో పొందికగా ఉంది: ‘తమ మార్గము నేర్పర్చుకోవడం నరులవశములో లేదు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.’ (యిర్మీయా 10:23) మన సృష్టికర్త ఇలా అంటున్నాడు: ‘నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.’—యెషయా 48:17.
నమ్మదగిన విలువలకు ఆధారపడదగిన మూలం
పైన ఉల్లేఖించబడిన మాటలను, ప్రపంచంలో అత్యధికంగా పంచిపెట్టబడుతున్న, నైతిక విలువలకు మూలమైన పరిశుద్ధ లేఖనాలలో చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రైస్తవులు కానివారు, మతాసక్తి లేనివారు కూడా అంతర్దృష్టి కోసం, జ్ఞానం కోసం లేఖనాలను ఆశ్రయించారు. జర్మనీకి చెందిన యోహాన్ వుల్ఫ్‌గాంగ్ వాన్ గోయెత్ అనే కవి ఇలా వ్రాశాడు: “[బైబిలంటే] నాకు మక్కువ, గౌరవం ఉండేవి, ఎందుకంటే దాదాపు నా నైతిక విలువలన్నింటినీ నేను దాని ఆధారంగానే ఏర్పర్చుకున్నాను.” హిందూ నాయకుడైన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ ఇలా అన్నాడని చెప్పబడుతోంది: “కొండమీది ప్రసంగంలో మీకివ్వబడిన ఊటల నీటిని [బైబిల్లోని యేసుక్రీస్తు బోధల్లో కొంత భాగాన్ని] మీరన్నివిధాలా పూర్తిగా సేవించాలి . . . ఎందుకంటే ఆ ప్రసంగంలోని బోధ మనలో ప్రతీఒక్కరినీ ఉద్దేశించి చెప్పబడింది.”
మొదట్లో పేర్కొనబడిన అపొస్తలుడైన పౌలు, సుస్థిరమైన విలువల్ని అందించడంలో పరిశుద్ధ లేఖనాలు పోషిస్తున్న ప్రాముఖ్యమైన పాత్రను నొక్కిచెబుతూ ఇలా వ్రాశాడు: ‘దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకు ప్రయోజనకరమై యున్నది.’ (2 తిమోతి 3:16-17) లేఖనాలు నిజంగా ప్రయోజనకరమైనవేనా?
మీరే ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకోకూడదు? తర్వాతి పేజీలో ఇవ్వబడిన సూత్రాలను పరిశీలించండి. అవి వృద్ధిచేసే ప్రయోజనకరమైన విలువల్ని గమనించండి. మీ జీవితాలను, ఇతరులతో మీ సంబంధాలను మెరుగుపరిచే శక్తి ఆ బోధల్లోని సూత్రాలకు ఎలావుందో ధ్యానించండి.
మీరు ప్రయోజనం పొందుతారా?
పరిశుద్ధ లేఖనాల్లో కనిపించే ఆచరణాత్మక సూత్రాల్లో పేర్కొనబడినవి మచ్చుకు కొన్ని మాత్రమే. వాటితోపాటు, మన జీవితాలపై హానికరమైన ప్రభావాన్ని చూపించగల దుష్టాలోచనలకు, మాటలకు, క్రియలకు సంబంధించిన హెచ్చరికలు కూడా దేవుని వాక్యంలో అనేకం ఉన్నాయి.—సామెతలు 6:16-19.
అవును ప్రజలు శ్రేష్ఠమైన నైతిక ప్రమాణాలను వృద్ధి చేసుకునేందుకు అవసరమైన, మానవ సమాజంలో ఎంతగానో లోపించిన ఉపదేశాన్ని బైబిల్లోని బోధలు ఇస్తున్నాయి. ఆ బోధలను అంగీకరించి, అన్వయించుకునేవారు తమ జీవితాల్లో గమనార్హమైన మార్పులు చేసుకుంటారు. వారి ఆలోచనా విధానం మెరుగౌతుంది. (ఎఫెసీయులు 4:23, 24) వారి ఉద్దేశాలు మెరుగౌతాయి. బైబిల్లో వివరించబడిన దేవుని విలువల గురించి నేర్చుకోవడం, అనేకమంది తమ హృదయాల్లోనుండి జాతి వివక్షను, దురభిమానాన్ని, ద్వేషాన్ని తొలగించుకోవడానికి సహాయం చేసింది. (హెబ్రీయులు 4:12) లేఖనాలు, అవి ప్రోత్సహించే విలువలు అనేకమంది దౌర్జన్యాన్ని, చెడు అలవాట్లను మానుకుని, మంచి మనుషులుగా మారేందుకు సహాయం చేశాయి.
అవును బైబిల్లోని విలువలు, తమలో పాతుకుపోయిన వ్యసనాలను, ఇతరుల జీవితాల పతనానికి కారణమైన అలవాట్లను లక్షలాదిమంది మానుకునేలా వారికి సహాయం చేశాయి. (1 కొరింథీయులు 6:9-11) బైబిలు బోధలు అలాంటి వ్యక్తులను మారుస్తున్నాయి, అవి వారి అలవాట్లనే కాదు వారి హృదయాల్ని, వారి ఆశయాల్ని, వారి కుటుంబాల్ని కూడా మారుస్తున్నాయి. ఒకప్రక్క లోకం ఎంత దిగజారిపోతున్నా, మరోప్రక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమను మెరుగుపర్చుకుంటూనే ఉన్నారు. అది ఎల్లకాలం కొనసాగుతూనే ఉంటుంది. “గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.”—యెషయా 40:8.
అయితే “మన దేవుని వాక్యము” నుండి మీరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతారా? మీ ప్రయోజనార్థం మీరు బైబిలు విలువల్ని ఎలా అన్వయించుకోవచ్చో చూపించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు. అలాంటి విలువలకు అనుగుణంగా జీవించడం ద్వారా మీరు ఇప్పుడు దేవుని ఆమోదాన్ని పొందడమేకాక స్థిరమైన దైవిక సూత్రాలతో నిర్దేశించబడే నిత్యజీవితాన్ని కూడా పొందగల్గుతారు.
[6, 7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
సుస్థిరమైన సూత్రాలు
బంగారు సూత్రం. “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది.”—మత్తయి 7:12.
పొరుగువారిని ప్రేమించండి. “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.” (మత్తయి 22:39) “ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.”—రోమీయులు 13:10.
ఇతరులను గౌరవించి, ఘనపర్చండి. “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.”—రోమీయులు 12:10.
సమాధానంగా ఉండండి. “యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడి.” (మార్కు 9:50) “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.” (రోమీయులు 12:18) “సమాధానము . . . కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.”—రోమీయులు 14:19.
క్షమించేవారిగా ఉండండి. “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.” (మత్తయి 6:12) “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై . . . ఒకరినొకరు క్షమించుడి.”—ఎఫెసీయులు 4:32.
యథార్థంగా, నమ్మకంగా ఉండండి. “(నీ సొంత భార్యకు ఒక్కదానికి మాత్రమే, నిన్ను నీవు అప్పగించుకో. . . . ) నీ సొంత భార్యతో సంతోషించు. నీవు యువకుడుగా ఉన్నప్పుడు నీవు పెళ్లాడిన స్త్రీతో అనుభవించు. . . . ఆమె ప్రేమ నిన్ను పూర్తిగా తృప్తిపరచనివ్వు. ఆమె ప్రేమ నిన్ను బంధించి వేస్తుంది. మరొకని భార్య నిన్ను అదే విధానంలో బంధించనీయకు. మరొకని ప్రేమ నీకు అవసరం లేదు.” (సామెతలు 5:15-20, ఈజీ-టు-రీడ్-వర్షన్) “మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.” (లూకా 16:10) “గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.”—1 కొరింథీయులు 4:2.
నిజాయితీగా ఉండండి. “తప్పు త్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?” (మీకా 6:11) “మేమన్ని విషయములలోను యోగ్యముగా [‘నిజాయితీగా,’ NW] ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాము.”—హెబ్రీయులు 13:18.
సత్యమే పలకండి, నీతిమంతులుగా ఉండండి. “కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి.” (ఆమోసు 5:15) “ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.” (జెకర్యా 8:16) “మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.”—ఎఫెసీయులు 4:25.
కష్టపడి పనిచేసేవారిగా ఉండండి. “తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.” (సామెతలు 22:29) ‘సోమరులై ఉండక, కష్టపడి పనిచేయండి.’ (రోమీయులు 12:11, పవిత్ర గ్రంథము, క్యాతలిక్ అనువాదము) “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.”—కొలొస్సయులు 3:23.
మృదు స్వభావులుగా, దయ జాలిగలవారిగా ఉండండి. “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.”—కొలొస్సయులు 3:12.
కీడును మేలుతో జయించండి. “మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి.” (మత్తయి 5:44) “కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.”—రోమీయులు 12:21.
దేవునికి శ్రేష్ఠమైనది ఇవ్వండి. “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన [యెహోవాను] ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ.”—మత్తయి 22:37, 38.
[చిత్రాలు]
బైబిలు విలువల్ని అనుసరించడం వివాహాలు విజయవంతమవడానికి, సంతోషభరితమైన కుటుంబ బాంధవ్యాలను, సంతుష్టినిచ్చే స్నేహాలను ఆనందించడానికి మనకు సహాయం చేయగలదు