కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు విద్య విశ్వాసాన్ని బలపరుస్తుంది

బైబిలు విద్య విశ్వాసాన్ని బలపరుస్తుంది

బైబిలు విద్య విశ్వాసాన్ని బలపరుస్తుంది

“మన సృష్టికర్త ఆలోచనలను పరిశీలించి, ఆయనలాంటి దృక్కోణాన్ని అలవర్చుకోవడానికి గత ఐదు నెలలు వెచ్చించడం ఎంత అమూల్యమైన ఆధిక్యతో కదా!” అని వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 122వ తరగతి స్నాతకోత్సవంలో ఆ తరగతి ప్రతినిధి ఒకరు అన్నాడు. ఆ తరగతికి చెందిన 56 మంది సభ్యులు, 2007 మార్చి 10వ తేదీని ఎంతోకాలం గుర్తుంచుకుంటారు, తాము నియామకం పొందిన 26 దేశాల్లో వారు త్వరలోనే మిషనరీ సేవను ప్రారంభించనున్నారు.

పరిపాలక సభ సభ్యుడు, థియడోర్‌ జారట్స్‌, స్నాతకోత్సవానికి వచ్చిన 6,205 మందిని సాదరంగా ఆహ్వానించిన తర్వాత ఇలా అన్నాడు: “ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవడంవల్ల మీరు ఆధ్యాత్మికంగా బలపర్చబడతారని, మీ విశ్వాసం దృఢపర్చబడుతుందనే నమ్మకం మాకుంది.” ఆయన నలుగురు ప్రసంగీకులను ఒకరి తర్వాత మరొకరిని పరిచయం చేశాడు, విద్యార్థులు తమ మిషనరీ నియామకాల్లో విజయవంతం కావడానికి సహాయం చేసేందుకు వారు సమయోచితమైన బైబిలు ఆధారిత ప్రోత్సాహాన్ని, ఉపదేశాన్ని ఇచ్చారు.

ఇతరుల విశ్వాసాన్ని బలపర్చేందుకు ప్రోత్సాహకరమైన మాటలు

అమెరికా బ్రాంచి కమిటీ సభ్యుడైన లియోన్‌ వీవర్‌, ‘మేలు చేస్తూ ఉండండి’ అనే అంశంమీద మాట్లాడాడు. విద్యార్థులు విశ్వాసాన్ని బలపర్చే బైబిలు విద్యను బోధిస్తూ సగటున ప్రతీ ఒక్కరూ 13 ఏళ్ల పూర్తికాల సేవ చేశారని ఆయన వారికి గుర్తుచేశాడు. ఆయనిలా అన్నాడు: “ఈ పనిలో ప్రజల జీవితాలను కాపాడడం ఇమిడివుంది కాబట్టి ఇది మేలైన పని, అంతకన్నా ప్రాముఖ్యంగా మన పరలోక తండ్రి అయిన యెహోవాను ఘనపరుస్తుంది కాబట్టి అది మేలైన పని.” ‘ఆత్మనుబట్టి విత్తడంలో’ కొనసాగమని ‘మేలుచేయడంలో విసుకక’ ఉండమని ఆ తర్వాత సహోదరుడు వీవర్‌ విద్యార్థులను ప్రోత్సహించాడు.​—⁠గలతీయులు 6:​8, 9.

పరిపాలక సభ సభ్యుడైన డేవిడ్‌ స్ప్లేన్‌, “ఆరంభంలోనే మంచి అభిప్రాయాన్ని కలిగించడానికి కృషిచేయండి” అనే అంశంమీద ఇచ్చిన ప్రసంగంలో ఆచరణాత్మక జ్ఞాపికలను ఇచ్చాడు. ఈ క్రింది అంశాలను చేయడం ద్వారా తమ నియామకాలను చక్కగా ప్రారంభించమని ఆయన క్రొత్త మిషనరీలను ప్రోత్సహించాడు: “ఆశావహ దృక్పథాన్ని కాపాడుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చిరునవ్వు చిందించండి. విమర్శనాత్మకంగా మాట్లాడకండి. వినయాన్ని కనబరిచి, స్థానిక సహోదరులను గౌరవించండి.” ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “అక్కడికి వెళ్లినవెంటనే మంచి అభిప్రాయం కలిగించండి, అలా, ప్రజలకు మీరు ‘సువర్తమానము ప్రకటిస్తుండగా’ మీ సుందరమైన పాదాలను యెహోవా ఆశీర్వదించునుగాక.”​—⁠యెషయా 52:⁠7.

గిలియడ్‌ ఉపదేశకుడైన లారెన్స్‌ బొవెన్‌, “ఖచ్చితమైన స్వాస్థ్యము” అనే అంశంమీద ప్రసంగించాడు. యెహోవా ప్రవచనాత్మక వాక్యం నెరవేరుతుందనే పూర్తి నమ్మకంతోనే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గిలియడ్‌ పాఠశాల స్థాపించబడిందని విద్యార్థులకు ఆయన గుర్తుచేశాడు. (హెబ్రీయులు 11:⁠1; ప్రకటన 17:⁠8) అప్పటినుండి గిలియడ్‌ పాఠశాల, తమ విశ్వాసాన్ని బలపర్చుకునే అవకాశాన్ని విద్యార్థులకు ఇచ్చింది. పట్టభద్రులు తమ నియామకాలకు వెళ్లి ఉత్సాహంగా సత్యాన్ని ప్రకటించేలా బలమైన విశ్వాసం వారిని ప్రోత్సహిస్తుంది.

మార్క్‌ న్యూమర్‌ అనే మరో గిలియడ్‌ ఉపదేశకుడు, “మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకరు గుర్తుకొస్తున్నారు” అనే ఆసక్తి రేకెత్తించే అంశంమీద మాట్లాడాడు. తన నియామకంలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని కనబరచిన ఎలీషా ప్రవక్త ఉదాహరణను ఆయన వివరించాడు. సహోదరుడు న్యూమర్‌, 1 రాజులు 19:​21 వచనం ఆధారంగా ఇలా చెప్పాడు: “ఎలీషా తన జీవితంలో మార్పులు చేసుకోవడానికి, వ్యక్తిగత ప్రయోజనాలను ప్రక్కన పెట్టి యెహోవా సంకల్పాన్ని ప్రకటించడానికి ఇష్టపడ్డాడు.” పట్టభద్రులు అలాంటి స్వభావాన్నే ప్రదర్శించినందుకు మెచ్చుకొని, తమ క్రొత్త నియామకాల్లో కూడా దానిని కనబరుస్తూ ఉండమని ఆయన వారిని ప్రోత్సహించాడు.

విశ్వాసం ఉంటే ధైర్యంగా మాట్లాడతారు

భావి మిషనరీలు శిక్షణ కాలంలో తమ విశ్వాసాన్ని బలపర్చుకోవడమే కాక ఇతరులకు సువార్త ప్రకటించడానికి వారాంతాలను కూడా వినియోగించుకున్నారు. దీనివల్ల, వాలెస్‌ లివరెన్స్‌ అనే మరో గిలియడ్‌ ఉపదేశకుడు నిర్వహించిన కార్యక్రమ భాగంలో వారు చక్కని అనుభవాలను పంచుకున్నారు, వాటిని పునర్నటించారు. “మేము విశ్వసిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం” అనే అంశంమీద ఆయన ఇచ్చిన ప్రసంగం, 2 కొరింథీయులు 4:​15 వచనాల్లోని అపొస్తలుడైన పౌలు మాటలను గుర్తు చేసింది.

ఆ ప్రసంగం తర్వాత బెతెల్‌ కుటుంబ సభ్యులైన డానియల్‌ బార్న్‌జ్‌, ఛార్ల్స్‌ ఉడీ ప్రస్తుతం మిషనరీలుగా సేవచేస్తున్నవారిని, గతంలో మిషనరీలుగా సేవచేసినవారిని ఇంటర్వ్యూ చేశారు. తనకు నమ్మకంగా సేవచేసేవారిపట్ల యెహోవాకున్న శ్రద్ధ గురించి, ఆయనిచ్చే ఆశీర్వాదాల గురించి వారి అనుభవాలు తెలియజేశాయి. (సామెతలు 10:​22; 1 పేతురు 5:⁠7) ఒక మిషనరీ ఇలా అన్నాడు: “గిలియడ్‌లో మాకు లభించిన విద్య ద్వారా నేనూ నా భార్య యెహోవా కనబరిచిన శ్రద్ధను నిజంగా చవిచూశాం. అది నిజంగా మా విశ్వాసాన్ని బలపరిచింది. మిషనరీలతోపాటు దేవుని సేవకులందరూ పరీక్షలను, సమస్యలను, చింతను ఎదుర్కోనున్నారు కాబట్టి విశ్వాసం ప్రాముఖ్యం.”

విశ్వాసాన్ని బలపర్చే బైబిలు విద్యను బోధిస్తూ ఉండండి

స్నాతకోత్సవ కార్యక్రమానికి సరైన ముగింపుగా, పరిపాలక సభ సభ్యుడైన సామ్యూల్‌ హెర్డ్‌ “మీ సహోదరులను బలపరుస్తూ ఉండండి” అనే అంశంమీద సభికులతో మాట్లాడాడు. విద్యార్థులు అభ్యసించిన విద్యకున్న ఉద్దేశమేమిటి? “మీరు నియామకం పొందే క్రొత్త క్షేత్రంలో యెహోవాను స్తుతిస్తూ ఇతరులకు ఆయన సత్యాలను బోధించడానికీ, మీ సహోదరులను బలపర్చడానికీ మీ నాలుకను ఎలా ఉపయోగించాలో బోధించడమే దాని ఉద్దేశం” అని సహోదరుడు హెర్డ్‌ చెప్పాడు. అయితే నాలుక, క్షేమాభివృద్ధి కలుగజేయనివాటిని కూడా పురికొల్పగలదని ఆయన విద్యార్థులకు గుర్తుచేశాడు. (సామెతలు 18:​21; యాకోబు 3:​8-10) తమ నాలుకను ఉపయోగించే విషయంలో యేసు మాదిరిని అనుసరించమని ఆయన విద్యార్థులను ప్రోత్సహించాడు. ఒక సందర్భంలో యేసు చెప్పినది విన్న తర్వాత ఆయన శిష్యులు ఇలా స్పందించారు: “ఆయన . . . లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?” (లూకా 24:​32) సహోదరుడు హెర్డ్‌ ఇలా అన్నాడు: “మీ మాటలు క్షేమాభివృద్ధికరంగా ఉంటే అవి మీ నియామకంలోని మీ సహోదర సహోదరీలను ప్రోత్సహిస్తాయి.”

ఆ ప్రసంగం తర్వాత, పట్టభద్రులు తమ డిప్లొమాలను పొందారు. ఆ తర్వాత, పాఠశాల సభ్యుల కృతజ్ఞతను వ్యక్తంచేసిన పత్రం చదవబడింది. దానిలో ఇలా ఉంది: “మిషనరీలుగా మా నియామకాలను నమ్మకంగా నిర్వర్తించడానికి మేము నేర్చుకున్నవాటిని ఉపయోగించాల్సిన బాధ్యత మాపై ఎంతో ఉందని భావిస్తున్నాం. భూదిగంతముల వరకు వెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి, మా ప్రయత్నాలు మన గొప్ప ఉపదేశకుడైన యెహోవా దేవుణ్ణి అధికంగా స్తుతించాలని ప్రార్థిస్తున్నాం.” సభికులు కరతాళ ధ్వనులతో హృదయపూర్వకంగా ప్రతిస్పందించారు. అవును, స్నాతకోత్సవ కార్యక్రమం హాజరైనవారందరి విశ్వాసాన్ని బలపర్చింది.

[17వ పేజీలోని బ్లర్బ్‌]

“మీ మాటలు క్షేమాభివృద్ధికరంగా ఉంటే అవి మీ నియామకంలోని మీ సహోదర సహోదరీలను ప్రోత్సహిస్తాయి”

[15వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంకాలు

ప్రాతినిధ్యం వహించిన దేశాలు: 9

నియమించబడిన దేశాలు: 26

విద్యార్థులు: 56

సగటు వయసు: 33.4

సత్యంలో ఉన్న సగటు సంవత్సరాలు: 16.8

పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 13

[16వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 122వ తరగతి పట్టభద్రులు

ఈ క్రింద ఇవ్వబడిన లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి, పేర్లు ప్రతి వరుసలో ఎడమ వైపు నుండి కుడి వైపుకు పేర్కొనబడ్డాయి.

(1) హోవిట్‌, ఆర్‌.; స్మిత్‌, పి.; మార్టినెజ్‌, ఎ.; పోట్సోబాన్‌, ఎస్‌.; కెటామురా, వై.; లాడ్‌, సి. (2) ఫెడ్లర్‌, ఐ.; బెస్లీ, కె.; మ్యాట్కోవిచ్‌, సి.; బెల్‌, డి.; లిపాన్కట్‌, డబ్ల్యూ. (3) సైట్స్‌, డబ్ల్యూ.; ఆనాసన్‌, ఎ.; టవ్స్‌, ఎల్‌.; ఫుసానో, జి.; రోథ్రిగిస్‌, సి.; యూ, జె. (4) సొబొమెహిన్‌, యమ్‌.; థామస్‌, ఎల్‌.; గ్యాసన్‌, ఎస్‌.; డోబా, వి.; బెర్టో, ఎ.; విన్‌, సి.; డొబ్రావాల్స్కి, ఎమ్‌. (5) యూ, జె.; డౌబా, జె.; మిక్సర్‌, హెచ్‌.; న్యూటన్‌, ఎమ్‌.; రోథ్రిగిస్‌, ఎఫ్‌.; మిక్సర్‌, ఎన్‌. (6) లాడ్‌, ఎమ్‌.; లిపాన్కట్‌, కె.; మార్టినెజ్‌, ఆర్‌.; హాబ్‌, ఎ.; స్కామ్ప్‌, ఆర్‌.; పోట్సోబాన్‌, ఎల్‌.; టవ్స్‌, ఎస్‌. (7) హోవిట్‌, ఎస్‌.; కెటామురా, యు.; న్యూటన్‌, డి.; హాబ్‌, జె.; సైట్స్‌, జె.; థామస్‌, డి. (8) సొబొమెహిన్‌, ఎల్‌.; మ్యాట్కోవిచ్‌, జె.; ఫుసానో, బి.; విన్‌, జె.; స్కామ్స్‌, జె.; ఆనాసన్‌, డి.; డొబ్రావాల్స్కి, జె. (9) ఫెడ్లర్‌, పి.; బెల్‌, ఇ.; బెస్లీ, బి.; స్మిత్‌, బి.; బెర్టో, పి.; గ్యాసన్‌, ఎమ్‌.