“మేలు చేత కీడును జయించుము”
“మేలు చేత కీడును జయించుము”
“కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.”—రోమీయులు 12:21.
సత్యారాధనను తీవ్రంగా వ్యతిరేకించేవారికి ఎదురొడ్డి స్థిరంగా నిలబడడం సాధ్యమేనా? భక్తిహీన లోకంలోకి మనల్ని తిరిగి ఈడ్చుకొనిపోయేందుకు ప్రయత్నించే శక్తులను ఓడించడం సాధ్యమేనా? సాధ్యం అనేదే ఈ రెండు ప్రశ్నలకు జవాబు! అలాగని మనమెందుకు చెబుతాం? ఎందుకంటే రోమీయులకు వ్రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్పిన దానినిబట్టి మనమలా చెబుతాం. ఆయనిలా వ్రాశాడు: “కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.” (రోమీయులు 12:21) మనం యెహోవాపై నమ్మకముంచి, మనల్ని జయించేందుకు లోకాన్ని అనుమతించకూడదనే దృఢనిశ్చయంతో ఉన్నప్పుడు, దానిలోని దుష్టత్వం మనల్ని జయించలేదు. అంతేకాక, కీడుకు వ్యతిరేకంగా మన ఆధ్యాత్మిక పోరాటాన్ని కొనసాగిస్తే, దానిని మనం జయించవచ్చని “కీడును జయించుము” అనే వాక్యం సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండనివారు, పోరాటాన్ని నిలిపేవారు మాత్రమే ఈ దుష్టలోకం, దాని పరిపాలకుడైన అపవాదియగు సాతానుచేత ఓడించబడతారు.—1 యోహాను 5:19.
2 పౌలు కాలానికి దాదాపు 500 సంవత్సరాల పూర్వం, యెరూషలేములో నివసించిన ఒక దేవుని సేవకుడు, కీడుకు వ్యతిరేకంగా పోరాడడం గురించి పౌలు చెప్పిన మాటలెంత సత్యమో చూపించాడు. దైవజనుడైన నెహెమ్యా భక్తిహీనుల వ్యతిరేకతను ప్రతిఘటించడమే కాక, మేలు చేత కీడును జయించాడు. ఆయన ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు? సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనేందుకు ఆయనకేమి సహాయం చేసింది? ఆయన మాదిరిని మనమెలా అనుకరించవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబిచ్చేందుకు మనం నెహెమ్యా జీవితంలోని కొన్ని సంఘటనలను పరిశీలిద్దాం. *
3 పారసీక రాజైన అర్తహషస్త ఆస్థానంలో నెహెమ్యా పనిచేశాడు. నెహెమ్యా అవిశ్వాసుల మధ్య నివసించినా, ఆ కాలపు “లోక మర్యాదను” అనుసరించలేదు. (రోమీయులు 12:2) యూదాలో అవసరమేర్పడినప్పుడు ఆయన సౌకర్యవంతమైన జీవన విధానాన్ని త్యాగంచేసి, యెరూషలేముకు కష్టమైన ప్రయాణంచేసి, ఆ నగర ప్రాకారాన్ని తిరిగి నిర్మించే బృహత్‌కార్యాన్ని చేపట్టాడు. (రోమీయులు 12:1) నెహెమ్యా యెరూషలేముకు అధిపతిగావున్నా, తోటి ఇశ్రాయేలీయులతో కలిసి రోజంతా “ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు” కష్టపడి పనిచేశాడు. ఫలితంగా, కేవలం రెండు నెలల్లో ఆ ప్రణాళిక పూర్తైంది! (నెహెమ్యా 4:21; 6:15) అది అసాధారణమైన కార్యం, ఎందుకంటే నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇశ్రాయేలీయులు వివిధరకాల వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. నెహెమ్యాను వ్యతిరేకించినవారు ఎవరు, వారి లక్ష్యమేమిటి?
4 యూదా సమీపంలో నివసిస్తున్న సన్బల్లటు, టోబీయా, గెషెము అనే పలుకుబడిగల వ్యక్తులు ఆయనకు ముఖ్య వ్యతిరేకులు. వారు దేవుని ప్రజలకు శత్రువులు కాబట్టి, వారు “ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు [నెహెమ్యా] వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.” (నెహెమ్యా 2:10, 19) నెహెమ్యా శత్రువులు, ఆయన చేపట్టిన నిర్మాణ పథకాలను ఆపేందుకు కంకణం కట్టుకొని దుష్టపన్నాగాలకు సహితం ఒడిగట్టారు. ‘కీడు చేత జయించబడేందుకు’ నెహెమ్యా అనుమతిస్తాడా?
‘మిగుల కోపగించి రౌద్రులయ్యారు’
5 నెహెమ్యా ధైర్యంగా తన ప్రజల్నిలా వేడుకున్నాడు: “యెరూషలేముయొక్క ప్రాకారమును మరల కట్టుదము.” అందుకు వారు “మనము కట్టుటకు పూనుకొందము” అని బదులిచ్చారు. నెహెమ్యా ఇలా చెబుతున్నాడు: “యీ మంచికార్యము చేయుటకై [వారు] బలము తెచ్చుకొనిరి,” అయితే వ్యతిరేకులు “మమ్మును హేళనచేసి మా పని తృణీకరించి—మీరు చేయు పనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి.” నెహెమ్యా వారి హేళనకు, అబద్ధారోపణలకు బెదిరిపోలేదు. ఆయన ఆ వ్యతిరేకులతో ఇలా అన్నాడు: “ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము.” (నెహెమ్యా 2:17-20) ఆ “మంచికార్యము” కొనసాగించేందుకే నెహెమ్యా నిశ్చయించుకున్నాడు.
6 ఆ వ్యతిరేకుల్లో ఒకడైన సన్బల్లటు “మిగుల కోపగించి రౌద్రుడై” మాటలతో విరుచుకుపడ్డాడు. “దుర్బలులైన యీ యూదులు ఏమి చేయుదురు? కాల్చబడిన చెత్తను కుప్పగాపడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా?” అని హేళనచేశాడు. టోబీయా కూడా గొంతుకలిపి, “వారు కట్టినదానిపైకి ఒక నక్క యెగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవును” అని అపహసించాడు. (నెహెమ్యా 4:1-3) నెహెమ్యా ఎలా స్పందించాడు?
7 నెహెమ్యా వారి అపహాస్యాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆయన దేవుని ఆజ్ఞను అనుసరించి, పగతీర్చుకోవడానికి ప్రయత్నించలేదు. (లేవీయకాండము 19:18) బదులుగా, ఆయన ఆ విషయాన్ని యెహోవాకు వదిలేసి ఇలా ప్రార్థించాడు: “మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము; వారి నింద వారి తలలమీదికి వచ్చునట్లుచే[యుము].” (నెహెమ్యా 4:4) “పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే” అని యెహోవా ఇచ్చిన అభయాన్ని నెహెమ్యా నమ్మాడు. (ద్వితీయోపదేశకాండము 32:35) అంతేకాక, నెహెమ్యా ఆయన ప్రజలు ‘గోడ కట్టడం’ మానలేదు. వారు తమ దృష్టి మళ్లించబడకుండా జాగ్రత్తపడ్డారు. నిజానికి, ‘అది సగము ఎత్తు వరకు కట్టబడింది, పనిచేయుటకు జనులకు మనసు కలిగియుండెను.’ (నెహెమ్యా 4:6) సత్యారాధనా వ్యతిరేకులు నిర్మాణ పనిని ఆపుజేయలేకపోయారు. నెహెమ్యా మాదిరిని మనమెలా అనుకరించవచ్చు?
8 నేడు పాఠశాలలో, ఉద్యోగ స్థలంలో లేదా కుటుంబంలో సహితం వ్యతిరేకులు మనల్ని హేళన చేస్తూ, మనపై ఆరోపణలు చేయవచ్చు. అయితే ‘మౌనముగా ఉండుటకు సమయము కలదు’ అనే లేఖన సూత్రాన్ని అన్వయించుకోవడం ద్వారా తరచూ అలాంటి అబద్ధారోపణలను చక్కగా ఎదుర్కోవచ్చు. (ప్రసంగి 3:1, 7) కాబట్టి, నెహెమ్యాలాగే మనం కూడా కరకు మాటలతో పగతీర్చుకోకుండా ఉంటాం. (రోమీయులు 12:17) “నేనే ప్రతిఫలము నిత్తును” అని మనకు అభయమిస్తున్న దేవునిపట్ల విశ్వాసంతో ఆయనకు ప్రార్థన చేస్తాం. (రోమీయులు 12:19; 1 పేతురు 2:19, 20) ఆ విధంగా మనం, నేడు జరిగించాల్సిన ఆధ్యాత్మిక పనిని అంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ శిష్యులనుచేసే పనినుండి మన దృష్టి మళ్లించేందుకు వ్యతిరేకులను అనుమతించం. (మత్తయి 24:14; 28:) వ్యతిరేకతకు భయపడకుండా ప్రకటనాపనిలో భాగం వహించే ప్రతీసారి నెహెమ్యాలాంటి దృఢనిశ్చయాన్నే మనమూ కనబరుస్తాం. 19, 20
‘మిమ్మల్ని చంపుతాం’
9 నెహెమ్యా కాలంలోని సత్యారాధనను వ్యతిరేకించేవారు “యెరూషలేముయొక్క గోడలు కట్టబడెనని” విన్నప్పుడు కత్తులు పట్టుకుని “యెరూషలేము మీదికి యుద్ధమునకు” వెళ్లారు. యూదులకు పరిస్థితి విషమంగా కనిపించింది. ఉత్తరాన సమరయులు, తూర్పున అమ్మోనీయులు, దక్షిణాన అరబీయులు, పశ్చిమాన అష్డోదీయులు ఉన్నారు. యెరూషలేము చుట్టుముట్టబడింది; నిర్మాణకులు చిక్కుకుపోయినట్లు అనిపించింది! వారేమి చేయాలి? ‘మేము మా దేవునికి ప్రార్థించాం’ అని నెహెమ్యా చెబుతున్నాడు. “వారిని చంపి పని ఆటంకపరు[స్తా]మని” ఆ శత్రువులు బెదిరించారు. అప్పుడు నెహెమ్యా, “వారి కత్తులతోను వారి యీటెలతోను వారి విండ్లతోను” పట్టణాన్ని సంరక్షించే పనిని నిర్మాణకులకు అప్పగించాడు. మానవ దృక్కోణం నుండి చూస్తే, కొద్దిమందే ఉన్న ఆ యూదులు భీకరమైన శత్రు దళాల ఎదుట నిలవలేరు, అయితే నెహెమ్యా వారినిలా ప్రోత్సహించాడు: “మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొ[నుడి].”—నెహెమ్యా 4:7-9, 11, 13, 14.
10 ఆ తర్వాత పరిస్థితులు అకస్మాత్తుగా తారుమారయ్యాయి. శత్రువులు తమ దాడిని విరమించుకున్నారు. ఎందుకు? ‘వారి యోచనను దేవుడు వ్యర్థము చేసెనని’ నెహెమ్యా నివేదిస్తున్నాడు. అయితే శత్రువుల నుండి అపాయం ఇంకా పొంచివుందని నెహెమ్యా గ్రహించాడు. అందువల్ల, ఆయన తెలివిగా నిర్మాణకుల పని విధానాన్ని సవరించాడు. అప్పటినుండి “ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి.” ఒకవేళ శత్రువు దాడిచేస్తే నిర్మాణకులను హెచ్చరించేందుకు “బాకా ఊదు” వ్యక్తిని కూడా నెహెమ్యా నియమించాడు. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా నెహెమ్యా ప్రజలకిలా అభయమిచ్చాడు: “మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును.” (నెహెమ్యా 4:15-20) ఆ దాడిని ఎదుర్కొనేలా సిద్ధపడేందుకు ప్రోత్సహించబడిన నిర్మాణకులు నిర్విరామంగా కృషిచేశారు. ఈ వృత్తాంతం నుండి మనమే పాఠాలు నేర్చుకోవచ్చు?
11 కొన్నిసార్లు, నిజ క్రైస్తవులు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటారు. నిజానికి, కొన్ని దేశాల్లో సత్యారాధనను వ్యతిరేకించే క్రూరమైన వ్యక్తులు భీకరమైన శత్రు సైన్యంలా రూపొందుతారు. మానవరీత్యా ఆలోచిస్తే ఆ దేశాల్లోని మన తోటి విశ్వాసులు వారిముందు నిలవలేరు. అయినప్పటికీ, ఆ సాక్షులు ‘దేవుడు తమ పక్షాన యుద్ధం చేస్తాడనే’ నమ్మకంతో ఉన్నారు. అవును, తమ నమ్మకాల నిమిత్తం హింసించబడేవారు తరచూ తమ ప్రార్థనలకు యెహోవా జవాబివ్వడాన్ని, బలమైన శత్రువుల ‘యోచనను వ్యర్థం చేయడాన్ని’ చవిచూశారు. రాజ్య పని నిషేధించబడిన దేశాల్లో సహితం క్రైస్తవులు, సువార్తను ప్రకటించే మార్గాలను కనుగొంటారు. తమ పని విధానాన్ని సవరించుకున్న యెరూషలేములోని నిర్మాణకుల్లాగే, నేడు యెహోవాసాక్షులు దాడికి గురైనప్పుడు తెలివిగా తమ ప్రకటనాపని 2 కొరింథీయులు 10:4) శారీరక హింసకు సంబంధించిన బెదిరింపు సహితం ప్రకటనా కార్యకలాపాలను కొనసాగించకుండా వారిని ఆపుచేయలేదు. (1 పేతురు 4:16) బదులుగా ధైర్యవంతులైన ఆ సహోదర సహోదరీలు ఎడతెగక ‘మేలు చేత కీడును జయిస్తారు.’
విధానాల్ని సవరించుకుంటారు. అయితే వారు శరీరసంబంధ యుద్ధోపకరణాల్ని ఉపయోగించరు. (‘మనము కలిసికొందము రండి’
12 నెహెమ్యా శత్రువులు తమ ముఖాముఖి దాడి విఫలమైందని గ్రహించినప్పుడు, వారు వ్యతిరేకతకు సంబంధించిన మరింత కుయుక్తితో కూడిన పద్ధతులను అవలంబించారు. నిజానికి, వారు మూడు పన్నాగాలు ప్రయత్నించారు. అవేమిటి?
13 మొదటిది, నెహెమ్యా శత్రువులు ఆయనను మోసగించేందుకు ప్రయత్నించారు. ఆయనతో వారిలా అన్నారు: “ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలిసికొందము రండి.” ఓనో యెరూషలేముకు, షోమ్రోనుకు మధ్యవుంది. కాబట్టి విభేదాల్ని పరిష్కరించుకోవడానికి ఆ రెండు నగరాల మధ్య కలుసుకోవాలని ఆ శత్రువులు నెహెమ్యాకు ప్రతిపాదించారు. ‘అది బాగానే అనిపిస్తోంది. పోరాటంకన్నా చర్చలే మేలు’ అని నెహెమ్యా ఆలోచించి ఉండవచ్చు. కానీ నెహెమ్యా ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. అలా తిరస్కరించడానికిగల కారణాన్ని ఆయనిలా వివరించాడు: ‘నాకు ఏదో హాని చేయాలని ఆలోచించారు.’ ఆయన వారి పన్నాగాన్ని పసిగట్టి వారి మోసానికి గురికాలేదు. ఆయన నాలుగుసార్లు తన వ్యతిరేకులతో ఇలా చెప్పాడు: ‘నేను చేయు పని విడిచి మీయొద్దకు వచ్చుటకై నేను దాని నెందుకు ఆపవలెను? నేను రాలేను.’ నెహెమ్యా రాజీపడేలా చేసేందుకు శత్రువులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన నిర్మాణ పనిమీదే తన దృష్టి కేంద్రీకరించాడు.—నెహెమ్యా 6:1-4.
14 రెండవది, నెహెమ్యా అర్తహషస్త రాజుకు వ్యతిరేకంగా ‘తిరుగుబాటు చేయడానికి ఆలోచిస్తున్నాడని’ ఆరోపిస్తూ నెహెమ్యా శత్రువులు అబద్ధపు వదంతులు వ్యాపింపజేసేందుకు పూనుకొన్నారు. మరోసారి నెహెమ్యాకు “మనము యోచన చేసెదము రండని” చెప్పారు. నెహెమ్యా ఆ శత్రువుల ఉద్దేశాన్ని గ్రహించాడు కాబట్టి, ఆ ప్రతిపాదనను మళ్లీ తిరస్కరించాడు. నెహెమ్యా ఇలా వివరిస్తున్నాడు: “ఈ పని చేయలేకుండ మేమశక్తులమగుదుమనుకొని వారందరు మమ్మును బెదరింపజూచిరి.” అయితే ఈసారి నెహెమ్యా తన శత్రువుల ఆరోపణను ఖండిస్తూ ఇలా అన్నాడు: ‘ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారముకాము, వీటిని మీ మనసులో నుండి మీరు కల్పించుకొంటిరి.’ అంతేకాక నెహెమ్యా, సహాయం కోసం యెహోవావైపు తిరిగి “నా చేతులను బలపరచుము” అని ప్రార్థించాడు. యెహోవా సహాయంతో తాను ఈ కుతంత్రాన్ని భంగపరిచి నిర్మాణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లగలనని ఆయన నమ్మాడు.—నెహెమ్యా 6:5-9.
15 మూడవది, నెహెమ్యా దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించేలా చేసేందుకు నెహెమ్యా శత్రువులు ఇశ్రాయేలీయుడైన షెమయా అనే ద్రోహిని ఉపయోగించారు. షెమయా నెహెమ్యాతో ఇలా అన్నాడు: “రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయములోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము.” నెహెమ్యా హత్యచేయబడే ప్రమాదముంది కాబట్టి, ఆయన దేవాలయంలో దాక్కొని తన ప్రాణాలు కాపాడుకోవచ్చని షెమయా అన్నాడు. అయితే నెహెమ్యా యాజకుడు కాదు. దేవాలయంలో దాక్కుంటే ఆయన పాపం చేసినవాడౌతాడు. తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తాడా? నెహెమ్యా ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు: “ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపను.” తనకోసం పన్నిన వలలో నెహెమ్యా ఎందుకు చిక్కుకోలేదు? ఎందుకంటే షెమయా తోటి ఇశ్రాయేలీయుడైనా “దేవుడు అతని పంపలేదని” ఆయనకు తెలుసు. వాస్తవానికి, నిజ ప్రవక్త దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించమని ఎన్నటికీ సలహా ఇవ్వడు. నెహెమ్యా మళ్లీ దుష్ట వ్యతిరేకుల చేత జయించబడేందుకు తననుతాను అనుమతించుకోలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన ఇలా నివేదించగలిగాడు: “ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువది యయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను.”—నెహెమ్యా 6:10-15; సంఖ్యాకాండము 1:51; 18:7.
మత్తయి 6:33; లూకా 9:57-62) వ్యతిరేకులు మనకు వ్యతిరేకంగా అబద్ధ వదంతులు కూడా వ్యాప్తిచేస్తారు. నెహెమ్యా, రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడని ఆరోపించబడినట్లే, కొన్నిదేశాల్లో మనం దేశానికి ప్రమాదకరమైన వారమని ఆరోపించబడుతున్నాం. కొన్ని ఆరోపణలు న్యాయస్థానాల్లో విజయవంతంగా త్రిప్పికొట్టబడ్డాయి. అయితే ఆయా వ్యక్తుల విషయంలో ఫలితమెలా ఉన్నా, యెహోవా తన చిత్తానుసారంగా పరిస్థితులను నిర్దేశిస్తాడని మనం నమ్మకంగా ప్రార్థిస్తాం. (ఫిలిప్పీయులు 1:7) యెహోవా సేవకులమని చెప్పుకునే వారినుండి కూడా వ్యతిరేకత రావచ్చు. తన ప్రాణం కాపాడుకునేందుకు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించేలా నెహెమ్యాను ఒప్పించేందుకు తోటి యూదుడు ప్రయత్నించినట్లే, ఒకప్పుడు సాక్షులుగావున్న మతభ్రష్టులు మనం ఏదోక రీతిలో రాజీపడేలా మనల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చు. దేవుని నియమాలను ఉల్లంఘించడంవల్ల కాదుగానీ వాటిని పాటించడంవల్లనే మన ప్రాణాలు రక్షించబడతాయని మనకు తెలుసు కాబట్టి మనం మతభ్రష్టులను తిరస్కరిస్తాం. (1 యోహాను 4:1) అవును, యెహోవా సహాయంతో మనమెలాంటి కీడునైనా జయించవచ్చు.
16 నెహెమ్యాలాగే మనం కూడా కపట స్నేహితుల, అబద్ధారోపకుల, కపట సహోదరుల రూపంలో వ్యతిరేకులను ఎదుర్కోవచ్చు. రాజీపడేలా చేసేందుకు కొందరు మనల్ని పురికొల్పవచ్చు. యెహోవా సేవలో రవ్వంత ఉత్సాహాన్ని తగ్గించుకుంటే, లోక సంబంధ లక్ష్యాలను చేపట్టవచ్చని మనల్ని ఒప్పించేందుకు వారు ప్రయత్నించవచ్చు. అయితే, మనం మన జీవితాల్లో దేవుని రాజ్యానికే ప్రథమస్థానమిస్తాం కాబట్టి, రాజీపడేందుకు మనం ఒప్పుకోం. (కీడు ఎదురైనా సువార్త ప్రకటించడం
17 క్రీస్తు అభిషిక్త సహోదరుల గురించి దేవుని వాక్యమిలా చెబుతోంది: ‘వారు తామిచ్చిన సాక్ష్యమునుబట్టి వానిని [సాతానును] జయించియున్నారు.’ (ప్రకటన 12:11) కాబట్టి కీడుకు మూలాధారమైన సాతానును జయించడానికి, రాజ్య సందేశాన్ని ప్రకటించడానికి మధ్య నేరుగా సంబంధముంది. అందువల్ల వ్యతిరేకతను రేపడం ద్వారా సాతాను అభిషిక్త శేషంపై, ‘గొప్పసముహంపై’ నిర్దాక్షిణ్యంగా దాడులు చేయడంలో ఆశ్చర్యం లేదు.—ప్రకటన 7:9; 12:17.
18 మనం చూసినట్లుగా, వ్యతిరేకత మౌఖిక దాడులు లేదా శారీరక హింసకు సంబంధించిన బెదిరింపుల రూపంలో లేదా మరింత మోసకరమైన రూపాల్లో రావచ్చు. ఏదేమైనా, అన్నిసమయాల్లో సాతాను లక్ష్యమొకటే, అది ప్రకటనాపనిని ఆపుజేయడమే. కానీ అతడు ఘోరంగా విఫలమౌతాడు, ఎందుకంటే ప్రాచీనకాల నెహెమ్యాను అనుకరిస్తూ దేవుని ప్రజలు ‘మేలు చేత కీడును జయించడానికే’ నిశ్చయించుకున్నారు. ప్రకటనాపని నెరవేర్చబడిందని యెహోవా చెప్పేంతవరకు అవిశ్రాంతంగా సువార్త ప్రకటించడం ద్వారా వారు కీడును జయిస్తారు.—మార్కు 13:10; రోమీయులు 8:31; ఫిలిప్పీయులు 1:27, 28.
[అధస్సూచి]
^ పేరా 4 ఈ సంఘటనల నేపథ్యాన్ని అర్థం చేసుకునేందుకు నెహెమ్యా 1:1-4; 2:1-6, 9-20; 4:1-23; 6:1-15 చదవండి.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
• దేవుని సేవకులు గతంలో ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు, నేటి క్రైస్తవులు ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు?
• నెహెమ్యా శత్రువుల ముఖ్య ఉద్దేశమేమిటి, నేడు దేవుని శత్రువుల ఉద్దేశమేమిటి?
• నేడు మనమెలా మేలు చేత కీడును జయిస్తూ ఉన్నాం?
[అధ్యయన ప్రశ్నలు]
1. మనమెందుకు కీడును జయించవచ్చనే నమ్మకంతో ఉండవచ్చు?
2. నెహెమ్యా జీవితంలోని కొన్ని సంఘటనలను మనమెందుకు పరిశీలిస్తాం?
3. నెహెమ్యా ఎలాంటి పరిస్థితుల్లో నివసించాడు, ఆయన ఏ కార్యం చేశాడు?
4. నెహెమ్యాను వ్యతిరేకించినవారి లక్ష్యమేమిటి?
5, 6. (ఎ) నిర్మాణ పనికి, నెహెమ్యా వ్యతిరేకులు ఎలా స్పందించారు? (బి) ఆ వ్యతిరేకులకు నెహెమ్యా ఎందుకు భయపడలేదు?
7. తన వ్యతిరేకుల ఆరోపణలకు నెహెమ్యా ఏయే విధాలుగా స్పందించాడు?
8. (ఎ) వ్యతిరేకులు మనపై అబద్ధారోపణలు చేసినప్పుడు మనమెలా నెహెమ్యాను అనుకరించవచ్చు? (బి) పగతీర్చుకోకుండా ఉండడం జ్ఞానయుక్తమని చూపించే మీ వ్యకిగత అనుభవాన్ని లేదా మీరు విన్న అనుభవాన్ని వివరించండి.
9. నెహెమ్యా శత్రువులు అకస్మాత్తుగా ఎలాంటి వ్యతిరేకతను తీసుకొచ్చారు, నెహెమ్యా ఎలా స్పందించాడు?
10. (ఎ) నెహెమ్యా శత్రువుల పరిస్థితులు తారుమారవడానికి ఏది కారణమైంది? (బి) నెహెమ్యా ఎలాంటి చర్యలు తీసుకున్నాడు?
11. రాజ్య పని నిషేధించబడిన దేశాల్లో కీడును ఎదుర్కొనేలా నిజ క్రైస్తవులను ఏది బలపరుస్తోంది, వారెలా మేలు చేత కీడును జయిస్తారు?
12, 13. (ఎ) నెహెమ్యా వ్యతిరేకులు ఏ వ్యూహం పన్నారు? (బి) తన వ్యతిరేకులను కలుసుకోవాలనే ఆహ్వానాన్ని నెహెమ్యా ఎందుకు తిరస్కరించాడు?
14. అబద్ధ ఆరోపకుల విషయంలో నెహెమ్యా ఎలా స్పందించాడు?
15. అబద్ధ ప్రవక్త ఏ సలహా ఇచ్చాడు, నెహెమ్యా ఆ సలహాను ఎందుకు అంగీకరించలేదు?
16. (ఎ) కపట స్నేహితులతో, అబద్ధారోపకులతో, కపట సహోదరులతో మనమెలా వ్యవహరించాలి? (బి) ఇంట్లో, పాఠశాలలో లేదా ఉద్యోగ స్థలంలో మీ నమ్మకాల విషయంలో మీరు రాజీపడరని ఎలా చూపిస్తారు?
17, 18. (ఎ) సాతాను అతని ప్రతినిధులు ఏమి చేసేందుకు ప్రయత్నిస్తారు? (బి) మీరేమి చేయాలని నిశ్చయించుకున్నారు, ఎందుకు?
[29వ పేజీలోని బాక్సు/చిత్రం]
నెహెమ్యా పుస్తకంలోని పాఠాలు
దేవుని సేవకులు ఎదుర్కొనేవి
• అపహాస్యం
• బెదిరింపులు
• మోసం
మోసం చేసేవారు
• కపట స్నేహితులు
• అబద్ధారోపకులు
• కపట సహోదరులు
దేవుని సేవకులు కీడును ఇలా జయిస్తారు
• దేవుడు తమకు అప్పగించిన పనికి అంటిపెట్టుకొనివుండడం ద్వారా
[27వ పేజీలోని చిత్రం]
తీవ్ర వ్యతిరేకతవున్నా నెహెమ్యా ఆయన తోటి పనివారు యెరూషలేము గోడను తిరిగి నిర్మించారు
[31వ పేజీలోని చిత్రం]
నిజ క్రైస్తవులు ధైర్యంగా సువార్త ప్రకటిస్తారు