కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఇశ్రాయేలీయుల్లోని పురుషులందరూ పొంగని రొట్టెల పండుగకు హాజరవుతున్నప్పుడు కోతపని అధికారికంగా ప్రారంభమయ్యేది కాబట్టి, ఆలయానికి తీసుకురాబడే యవలకోతలోని ప్రథమఫలాన్ని ఎవరు కోసేవారు?

మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించింది: “ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెల పండుగలోను వారములపండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.” (ద్వితీయోపదేశకాండము 16:​16) రాజైన సొలొమోను కాలం నుండి ఆ పండుగను యెరూషలేములోని ఆలయంలో చేయాలని దేవుడు నిర్ణయించాడు.

ఆ మూడు పండుగల్లో మొదటిది వసంతకాల ప్రారంభంలో జరిగేది. అది పొంగని రొట్టెల పండుగ అని పిలువబడేది, నీసాను 14న పస్కా ఆచరణ ఆచరించబడిన మరుసటి రోజున ఆ పండుగ మొదలై నీసాను 21 వరకు ఏడు రోజులపాటు కొనసాగేది. పవిత్ర క్యాలెండరు ప్రకారం, ఆ పండుగ రెండవ రోజున అంటే నీసాను 16న ఆ సంవత్సరపు మొదటి కోతకాలం ప్రారంభమయ్యేది. ఆ రోజున ప్రధానయాజకుడు యవల “మొదటి పంటలో ఒక పనను” తీసుకుని ఆలయంలోని ‘యెహోవా సన్నిధిలో ఆ పనను అల్లాడింపవలెను.’ (లేవీయకాండము 23:​5-12) పురుషులందరూ పొంగని రొట్టెల పండుగకు హాజరవ్వాలని ఆజ్ఞాపించబడ్డారు కాబట్టి అర్పించబడే యవల పనను ఎవరు కోతకోసేవారు?

పొంగని రొట్టెల పండుగ సమయంలో యెహోవాకు పంటలోని ప్రథమఫలాన్ని అర్పించాలనే ఆజ్ఞ జనాంగమంతటికీ ఇవ్వబడింది. అయితే ప్రతీ ఒక్కరూ కోతపనిని ప్రారంభించి, ప్రథమఫలాన్ని పరిశుద్ధస్థలానికి తీసుకురావాలని ఆజ్ఞాపించబడలేదు. కానీ, ఆ జనాంగానికి ప్రాతినిధ్యం వహించే కొందరు వ్యక్తులు దాన్ని తీసుకురావాలని ఆజ్ఞాపించబడింది. కాబట్టి, పొంగని రొట్టెల పండుగ కోసం నియమిత ప్రతినిధులు మాత్రమే సమీపంలోవున్న పొలానికి వెళ్లి పనలను కోసుకొనిరావచ్చు. దీని గురించి వ్యాఖ్యానిస్తూ ఎన్‌సైక్లోపీడియా జుడైకా ఇలా అంటోంది: “ఆ సమయానికి యవలు పండితే దానిని యెరూషలేముకు సమీపంలోనున్న పొలాల నుండి తీసుకొచ్చేవారు, అక్కడ పండకపోతే ఇశ్రాయేలు దేశంలోని మరే ప్రాంతంనుండైనా తీసుకురావవచ్చు. ముగ్గురు వ్యక్తులు తమ స్వంత కొడవళ్ళతో, గంపలతో వెళ్ళి కోత కోసుకొచ్చేవారు.” ఆ తర్వాత ఒక యవల పన యాజకుని దగ్గరకు తీసుకురాబడేది, ఆయన దానిని యెహోవాకు అర్పించేవాడు.

కోతలోని ప్రథమఫలాన్ని అర్పించాలనే ఆజ్ఞ, దేవుడు తమ భూమిని, కోతను ఆశీర్వదించినందుకు ఇశ్రాయేలీయులు తమ కృతజ్ఞత తెలియజేసేందుకు చక్కని అవకాశాన్ని కల్పించింది. (ద్వితీయోపదేశకాండము 8:​6-10) అంతకన్నా ప్రాముఖ్యంగా, ఆచారబద్ధమైన ఆ అర్పణ “రాబోవుచున్న మేలుల ఛాయగలది.” (హెబ్రీయులు 10:⁠1) గమనార్హంగా, యేసుక్రీస్తు సా.శ. 33వ సంవత్సరం, నీసాను 16న అంటే యెహోవాకు కోతలోని ప్రథమఫలాన్ని అర్పించే రోజునే పునరుత్థానం చేయబడ్డాడు. యేసు గురించి అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు. . . . ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.” (1 కొరింథీయులు 15:​20-23) ప్రధానయాజకుడు యెహోవా ముందు అల్లాడించిన ప్రథమఫలంలోని పన, నిత్యజీవం పొందేలా మృతుల్లోనుండి మొట్టమొదట పునరుత్థానం చేయబడిన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉంది. అలా యేసు మానవజాతి పాపమమరణాల నుండి విడుదల పొందే మార్గాన్ని సుగమం చేశాడు.

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

© 2003 BiblePlaces.com