కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మింటనున్న నమ్మకమైన సాక్షి’

‘మింటనున్న నమ్మకమైన సాక్షి’

‘మింటనున్న నమ్మకమైన సాక్షి’

చం ద్రుని అందాన్ని ఎన్నో శతాబ్దాలుగా కవులు, గీత రచయితలు అభివర్ణిస్తూవున్నారు. ఉదాహరణకు, దైవిక ప్రేరణతో రాయబడిన ఒక గీతంలో “చంద్రబింబమంత అందము”గల ఒక స్త్రీ గురించి ప్రస్తావించబడింది. (పరమగీతము 6:​10) చంద్రుణ్ణి ‘మింటనున్న నమ్మకమైన సాక్షి’ అని ఒక కీర్తనకర్త పిలిచాడు. (కీర్తన 89:​36) చంద్రుని గురించిన ఆ వర్ణనకున్న ప్రాముఖ్యతేమిటి?

చంద్రుడు 27.3 ఖచ్చితంగా రోజులకొకసారి తన కక్ష్యలో భూమిచుట్టూ పరిభ్రమించడాన్ని పూర్తిచేస్తాడు. కాబట్టి చంద్రుడు నమ్మకంగా ఉండడం అది క్రమం తప్పకుండా పరిభ్రమించడాన్ని సూచించవచ్చు. అయితే, కీర్తనకర్త మనసులో దానికన్నా మరింత లోతైన భావమే ఉండివుండవచ్చు. యేసు తన అనుచరులకు రాజ్యం గురించి ప్రార్థించడాన్ని నేర్పించాడు, ఆ రాజ్యం గురించిన ప్రవచనాత్మక పాటలో కీర్తనకర్త చంద్రుణ్ణి “నమ్మకమైన సాక్షి” అని పిలిచాడు.​—⁠మత్తయి 6:​9, 10.

యెహోవా దేవుడు దాదాపు 3,000 సంవత్సరాల క్రితం ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదుతో రాజ్య నిబంధన చేశాడు. (2 సమూయేలు 7:​12-16) దావీదు వారసునిగా యేసుక్రీస్తు సింహాసనాన్ని శాశ్వతంగా పొందేందుకు చట్టబద్ధమైన ఆధారాన్ని ఆ నిబంధన కల్పించింది. (యెషయా 9:⁠7; లూకా 1:​32, 33) దావీదు “సంతానము” యొక్క సింహాసనాన్ని సూచిస్తూ కీర్తనకర్త ఇలా పాడాడు: “చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనున్న సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడును.”​—⁠కీర్తన 89:​35, 36.

కాబట్టి, ‘రాత్రిని ఏలే జ్యోతి’ అయిన చంద్రుడు, క్రీస్తు పరిపాలన శాశ్వతంగా నిలుస్తుందనడానికి సరైన జ్ఞాపికగా ఉన్నాడు. (ఆదికాండము 1:​16) క్రీస్తు రాజ్యం గురించి దానియేలు 7:⁠14 ఇలా చెబుతోంది: “ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” చంద్రుడు, ఆ రాజ్యం గురించి, మానవజాతి కోసం ఆ రాజ్యం తీసుకువచ్చే ఆశీర్వాదాల గురించి మనకు గుర్తుచేసే సాక్షి.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

చంద్రుడు: NASA photo