కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—II

యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—II

యెహోవా వాక్యము సజీవమైనది

యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—II

అది సా.శ.పూ. 607వ సంవత్సరం డిసెంబరు నెల. బబులోను రాజు యెరూషలేముమీద తన చివరి ముట్టడి ప్రారంభించాడు. బబులోను చెరలోవున్నవారికి తమ ప్రియమైన యెరూషలేము నగరపు పతనం, నాశనం అనే అంశం గురించి ఇప్పటివరకు యెహెజ్కేలు సందేశం వివరించింది. అయితే, ఇప్పుడు యెహెజ్కేలు ప్రవచనాల్లోని సందేశం, దేవుని ప్రజలకు కలిగే కష్టాలను చూసి సంతోషించే అన్య జనాంగాలమీద రాబోయే తీర్పు గురించి వివరిస్తోంది. 18 నెలల తర్వాత యెరూషలేము పతనమైనప్పుడు, సత్యారాధనకు సంబంధించిన మహిమాన్విత పునరుద్ధరణ అనే మరో క్రొత్త అంశాన్ని అది వివరిస్తోంది.

యెహెజ్కేలు 25:1-48:35లోని వచనాల్లో, ఇశ్రాయేలు చుట్టుప్రక్కలనున్న జనాంగాల గురించిన, దేవుని ప్రజల విడుదల గురించిన ప్రవచనాలు ఉన్నాయి. * యెహెజ్కేలు 29:17-20 వచనాలు తప్ప, దానిలోని వృత్తాంతం కాలక్రమానుసారంగానే కాక, అంశానుక్రమంగా కూడా ఉంది. అయితే, ఈ నాలుగు వచనాలు సమకాలీన అంశాలను వివరిస్తున్నాయి. ప్రేరేపిత లేఖనాల్లో భాగంగా యెహెజ్కేలు గ్రంథములోని సందేశం “సజీవమై బలముగలది.”—హెబ్రీయులు 4:12.

‘ఆ భూమి ఏదెను వనములా అవుతుంది’

(యెహెజ్కేలు 25:1-39:29)

యెరూషలేము పతనమైనప్పుడు అమ్మోను, మోయాబు, ఏదోము, ఫిలిష్తియ, తూరు, సీదోను దేశాలు ఎలా స్పందిస్తాయో ముందుగానే గ్రహించి యెహోవా వాటికి వ్యతిరేకంగా యెహెజ్కేలు ద్వారా ప్రవచింపజేశాడు. ఐగుప్తు కొల్లగొట్టబడుతుంది. ‘ఐగుప్తు రాజైన ఫరో, అతని సమూహం,’ “బబులోనురాజు ఖడ్గము” ద్వారా నరికివేయబడే దేవదారు వృక్షంతో పోల్చబడ్డారు.—యెహెజ్కేలు 31:2, 3, 12; 32:11, 12.

సా.శ.పూ. 607లో, యెరూషలేము నాశనమై ఆరు నెలలు గడిచిన తర్వాత యెరూషలేము నుండి తప్పించుకున్న ఒక వ్యక్తి యెహెజ్కేలు దగ్గరికి వచ్చి ఇలా నివేదిస్తాడు: “పట్టణము కొల్లపెట్టబడెను!” ఆ ప్రవక్త చెరలోవున్నవారితో ‘అప్పటినుండి మౌనిగా లేడు.’ (యెహెజ్కేలు 33:21, 22) ఆయన పునరుద్ధరణ ప్రవచనాలను ప్రకటించాల్సివుంది. యెహోవా ‘తన సేవకుడైన దావీదును వారిమీద కాపరిగా నియమిస్తాడు.’ (యెహెజ్కేలు 34:23) ఎదోము నిర్మానుష్యంగా మారుతుంది, అయితే ఎదోము అవతలనున్న యూదా “ఏదెను వనమువలె” అవుతుంది. (యెహెజ్కేలు 36:35) తన పునఃస్థాపిత ప్రజలను “గోగు” దాడి నుండి రక్షిస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు.—యెహెజ్కేలు 38:2.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

29:8-12ఐగుప్తు ఎప్పుడు 40 ఏళ్లు నిర్మానుష్యంగా ఉంది? యిర్మీయా హెచ్చరించినా, సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం చేయబడిన తర్వాత యూదాలో మిగిలినవారు ఐగుప్తుకు పారిపోయారు. (యిర్మీయా 24:1, 8-10; 42:7-22) అలా పారిపోవడంద్వారా వారు బబులోనీయుల నుండి తప్పించుకోలేదు, ఎందుకంటే నెబుకద్నెజరు ఐగుప్తుమీద దండెత్తి దానిని జయించాడు. ఆ విజయం తర్వాత ఐగుప్తు 40 ఏళ్లు నిర్మానుష్యంగా ఉండివుండవచ్చు. లౌకిక చరిత్ర ఈ నిర్మానుష్యం గురించిన ఎలాంటి రుజువు ఇవ్వకపోయినా, యెహోవా ప్రవచనాలను నెరవేర్చువాడు కాబట్టి అది నిర్మానుష్యంగా ఉండివుండవచ్చనే నమ్మకంతో మనం ఉండవచ్చు.—యెషయా 55:11.

29:18‘అందరి తలలు బోడిగా’ ఎలా తయారయ్యాయి, ఎలా ‘అందరి భుజాలు కొట్టుకొనిపోయాయి’? తీరానికి దూరంగా ఉన్న తూరు నగర ముట్టడి ఎంత తీవ్రంగా, శ్రమతోకూడినదిగా ఉందంటే, నెబుకద్నెజరు సైనికుల తలలు తమ శిరస్త్రాణాల రాపిడివల్ల బోడిగా తయారయ్యాయి, ప్రాకారాల కోసం, కోటల కోసం నిర్మాణ సామగ్రిని మోసుకెళ్లడంవల్ల వారి భుజాలు కొట్టుకొనిపోయాయి.—యెహెజ్కేలు 26:7-12.

మనకు పాఠాలు:

29:19, 20. తూరువాసులు తమ సంపదలో అధిక భాగాన్ని తీసుకొని తమ ద్వీప నగరానికి పారిపోయారు కాబట్టి, నెబుకద్నెజరు తూరు నగరం నుండి రవ్వంత సొమ్మునే కొల్లగొట్టుకోగలిగాడు. నెబుకద్నెజరు గర్విష్ఠియైన, స్వార్థపూరిత అన్యపాలకుడే అయినా, ఐగుప్తుదేశమును “అతని సైన్యమునకు జీతము”గా ఇవ్వడం ద్వారా యెహోవా ఆయన సేవలకు ప్రతిఫలాన్నిచ్చాడు. ప్రభుత్వాలు మనకు సేవలు అందిస్తున్నాయి కాబట్టి, వాటికి పన్నులు చెల్లించడం ద్వారా మనం సత్యదేవుణ్ణి అనుకరించవద్దా? లోక అధికారుల ప్రవర్తనగానీ, వారు పన్నులను వినియోగించే విధానంగానీ ఈ బాధ్యత నుండి మనల్ని తప్పించదు.—రోమీయులు 13:4-7.

33:7-9. ఆధునికదిన కావలివాని తరగతి అయిన అభిషిక్త శేషం, దాని సహచరులు రాజ్యసువార్త ప్రకటించడంలో, రాబోయే ‘మహాశ్రమల’ గురించి ప్రజలను హెచ్చరించడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు.—మత్తయి 24:21.

33:10-20. మనం చెడు మార్గాలను వదిలి, దేవుడు కోరిన విధంగా నడుచుకోవడంమీద మన రక్షణ ఆధారపడివుంది. నిజానికి యెహోవా మార్గం ఖచ్చితంగా ‘న్యాయమైనది.’

36:20, 21. “యెహోవా జనులు”గా తమకున్న పేరుకు తగ్గట్టు ఇశ్రాయేలీయులు జీవించకపోవడం ద్వారా వారు జనాంగాల మధ్య దేవుని పేరును అగౌరవపరిచారు. మనం నామకార్థ యెహోవా ఆరాధకులుగా ఎన్నడూ మారకూడదు.

36:25, 37, 38. మనం ఆనందిస్తున్న ఆధ్యాత్మిక పరదైసు ‘ప్రతిష్ఠితమైన’ లేదా పవిత్రమైన ‘మనుష్యుల గుంపుతో’ నిండివుంది. కాబట్టి, దానిని పవిత్రంగా ఉంచేందుకు మనం కృషిచేయాలి.

38:1-23. యెహోవా, మాగోగు దేశపువాడైన గోగు దాడి నుండి తన ప్రజలను కాపాడతాడని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహాన్నిస్తుందో కదా! “లోకాధికారి” అయిన అపవాదియగు సాతాను పరలోకం నుండి పడద్రోయబడిన తర్వాత అతనికి గోగు అనే పేరుపెట్టబడింది. మాగోగు దేశం, అపవాది, అతని దయ్యాలు పరిమితం చేయబడిన భూపరిధిని సూచిస్తోంది.—యోహాను 12:31; ప్రకటన 12:7-12.

“నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని . . . మనస్సులో ఉంచుకొనుము”

(యెహెజ్కేలు 40:1-48:35)

అప్పటికి యెరూషలేము పట్టణం నాశనం చేయబడి 13 సంవత్సరాలైంది, 14వ సంవత్సరం నడుస్తోంది. (యెహెజ్కేలు 40:1) ఇశ్రాయేలీయులు చెరలో మరో యాభై ఆరు సంవత్సరాలు ఉండాలి. (యిర్మీయా 29:10) యెహెజ్కేలుకు ఇప్పుడు దాదాపు 50 ఏళ్లు. ఒక దర్శనంలో ఆయన ఇశ్రాయేలు దేశానికి కొనిపోబడ్డాడు. ఆయనకు ఇలా చెప్పబడింది: “నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనస్సులో ఉంచుకొనుము.” (యెహెజ్కేలు 40:2-4) యెహెజ్కేలు క్రొత్త దేవాలయానికి సంబంధించిన దర్శనం పొంది ఎంతగా పులకించిపోయివుంటాడో కదా!

యెహెజ్కేలు చూసిన ఆ మహిమాన్విత దేవాలయానికి ఆరు గుమ్మాలు, 30 చిన్న గదులు లేక భోజనశాలలు, పరిశుద్ధ, అతిపరిశుద్ధ స్థలం, కర్రతో చేసిన బలిపీఠం, దహనబలులకు ఒక బలిపీఠం ఉన్నాయి. ఆ దేవాలయం నుండి ‘ఉబికే’ పిల్లకాలువ, నదిగా మారుతుంది. (యెహెజ్కేలు 47:1) వివిధ గోత్రాలవారికి కేటాయించబడిన భూభాగాలకు సంబంధించిన దర్శనాన్ని కూడా యెహెజ్కేలు పొందుతాడు, ఆ దర్శనంలో ప్రతీ గోత్రానికి తూర్పుపడమరలుగా భూమి కేటాయించబడుతుంది, యూదా, బెన్యామీను గోత్రానికి కేటాయించబడిన భూభాగానికి మధ్యలో కార్యనిర్వాహక భాగం ఉంది. “యెహోవా పరిశుద్ధస్థలము”తోపాటు యెహోవాషామా లేక యెహోవా ఉండు స్థలమనే పేరుగల “పట్టణము” ఈ భూభాగంలోనే ఉన్నాయి.—యెహెజ్కేలు 48:9, 10, 15, 35.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

40:3-47:12యెహెజ్కేలు దర్శనంలోని దేవాలయం దేనిని సూచిస్తోంది? యెహెజ్కేలు దర్శనంలో చూసిన అసాధారణ పరిమాణంలో ఉన్న ఆ దేవాలయం నిజానికి ఎన్నడూ నిర్మించబడలేదు. అది దేవుని ఆధ్యాత్మిక ఆలయాన్ని, అంటే మన కాలంలో స్వచ్ఛారాధన కోసం ఆయన చేసిన దేవాలయంలాంటి ఏర్పాటును సూచిస్తోంది. (యెహెజ్కేలు 40:2; మీకా 4:1; హెబ్రీయులు 8:1-2; 9:23, 24) దేవాలయపు దర్శనం, “అంత్యదినములలో” యాజకత్వం శుద్ధీకరించబడినప్పుడు నెరవేరింది. (2 తిమోతి 3:1; యెహెజ్కేలు 44:10-16; మలాకీ 3:1-3) అయితే దాని అంతిమ నెరవేర్పు పరదైసులో జరుగుతుంది. ఆ దేవాలయ దర్శనం చెరలోవున్న యూదులకు, స్వచ్ఛారాధన పునఃస్థాపించబడుతుందనే హామీని, ప్రతీ యూదా కుటుంబానికి దేశంలో స్వాస్థ్యం ఉంటుందనే హామీని ఇచ్చింది.

40:3-43:17దేవాలయం కొలవబడడానికున్న ప్రాముఖ్యత ఏమిటి? దేవాలయం కొలవబడడం స్వచ్ఛారాధన విషయంలో యెహోవా సంకల్పం తప్పక నెరవేరుతుందని సూచిస్తోంది.

43:2-4, 7, 9దేవాలయం నుండి తొలగించబడాల్సిన “తమ రాజుల కళేబరములు” ఏమిటి? ఆ కళేబరాలు విగ్రహాలను సూచిస్తుండవచ్చు. యెరూషలేము పాలకులు, దాని ప్రజలు దేవుని ఆలయాన్ని విగ్రహాలతో కలుషితం చేసి, వాటిని తమ రాజులుగా చేసుకున్నారు.

43:13-20—యెహెజ్కేలు దర్శనంలో చూసిన బలిపీఠం దేనిని సూచిస్తోంది? ఆ సూచనార్థక బలిపీఠం, యేసుక్రీస్తు విమోచనా క్రయధన బలికి సంబంధించిన దేవుని చిత్తాన్ని సూచిస్తోంది. ఈ ఏర్పాటువల్ల, అభిషిక్తులు నీతిమంతులుగా ప్రకటించబడ్డారు మరియు “గొప్పసమూహము” దేవుని దృష్టిలో పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంది. (ప్రకటన 7:9-14; రోమీయులు 5:1, 2) బహుశా, అందుకే సొలొమోను దేవాలయంలో యాజకులు తమను తాము శుభ్రంచేసుకోవడానికి ఉపయోగించిన పెద్ద నీటితొట్టి అయిన ‘పోతపోసిన సముద్రం’ యెహెజ్కేలు దర్శనంలోని దేవాలయంలో లేదు.—1 రాజులు 7:23-26.

44:10-16యాజక తరగతి ఎవరిని సూచిస్తోంది? యాజక తరగతి, మన కాలంలోని అభిషిక్త క్రైస్తవులకు పూర్వఛాయగా ఉంది. 1918లో, యెహోవా తన ఆధ్యాత్మిక ఆలయంలో “శోధించి నిర్మలము” చేసేవానిగా కూర్చున్నప్పుడు వారు శుద్ధి చేయబడ్డారు. (మలాకీ 3:1-5) పవిత్రంగావున్నవారు లేక పశ్చాత్తాపపడినవారు తమ ప్రత్యేక సేవాధిక్యతలో కొనసాగవచ్చు. ఆ తర్వాత వారు తమకు ‘ఇహలోకమాలిన్యము అంటకుండా’ ఉండేందుకు కృషిచేయాలి, అలా వారు యాజకులుకాని గోత్రాలవారు సూచించిన ‘గొప్పసమూహానికి’ మాదిరిగా ఉంటారు.—యాకోబు 1:27; ప్రకటన 7:9, 10.

45:1; 47:13-48:29“దేశము,” దేశాన్ని కేటాయించడం దేనిని సూచిస్తున్నాయి? దేశము, దేవుని ప్రజల కార్యకలాపాల పరిధిని సూచిస్తోంది. యెహోవా ఆరాధకుడు ఎక్కడున్నా ఆయన సత్యారాధనను సమర్థిస్తున్నంతవరకు ఆయన పునఃస్థాపిత దేశంలో ఉన్నట్లే లెక్క. దేశాన్ని కేటాయించడానికి సంబంధించిన ప్రవచనపు చివరి నెరవేర్పు, నూతనలోకంలో నమ్మకమైన ప్రతీ వ్యక్తి ఒక స్థలాన్ని స్వాస్థ్యంగా పొందినప్పుడు నెరవేరుతుంది.—యెషయా 65:17, 21.

45:7, 16యాజకత్వానికి, అధిపతికి ప్రజలు చెల్లించవలసిన అర్పణము దేనిని సూచిస్తోంది? ఆధ్యాత్మిక ఆలయంలో, ఇది ప్రాథమికంగా ఆధ్యాత్మిక మద్దతును ఇవ్వడాన్ని అంటే సహాయం చేయడాన్ని, సహకార స్ఫూర్తిని కనబరచడాన్ని సూచిస్తోంది.

47:1-5—యెహెజ్కేలు దర్శనంలోని నదిలోని నీళ్లు దేనిని సూచిస్తున్నాయి? ఆ నీళ్లు, క్రీస్తుయేసు విమోచనా క్రయధన బలి, బైబిల్లోని దేవుని జ్ఞానంతోపాటు జీవం కోసం యెహోవా చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లను సూచిస్తున్నాయి. (యిర్మీయా 2:13; యోహాను 4:7-26; ఎఫెసీయులు 5:25-27) సత్యారాధనను అంగీకరించే ప్రవాహంలా వస్తున్న క్రొత్తవారికి చోటు కల్పించడానికి నది నీళ్ల లోతు క్రమంగా పెరుగుతోంది. (యెషయా 60:22) వెయ్యేండ్ల పరిపాలనలో, నది అత్యంత శక్తిగల జీవజలంతో ప్రవహిస్తుంది, అప్పుడు విప్పబడే ‘గ్రంథాల’ నుండి పొందిన అదనపు అవగాహన ఆ నీటిలో ఉంటుంది.—ప్రకటన 20:12; 22:1, 2.

47:12—ఫలవంతమైన వృక్షములు దేనిని సూచిస్తున్నాయి? ఆ సూచనార్థక వృక్షాలు, మానవజాతిని తిరిగి పరిపూర్ణతకు తీసుకురావడానికి దేవుడు చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లను సూచిస్తున్నాయి.

48:15-19, 30-35—యెహెజ్కేలు దర్శనంలోని పట్టణం దేనిని సూచిస్తోంది? “యెహోవా యుండు స్థలము” లేక యెహోవాషామా “పవిత్రమైనది కాని” (క్యాతలిక్‌ అనువాదము) స్థలంలో ఉంది కాబట్టి, అది భూసంబంధమైనది కావచ్చు. ఆ పట్టణం, నీతియుక్త “క్రొత్త భూమి”లో భాగంగా ఉండే వారికి ప్రయోజనాలు చేకూర్చే భూసంబంధమైన పరిపాలనను సూచిస్తున్నట్లు అనిపిస్తోంది. (2 పేతురు 3:13) అన్ని ప్రక్కల గుమ్మాలు ఉండడం దానిలో సులభంగా ప్రవేశించవచ్చని స్పష్టం చేస్తోంది. దేవుని ప్రజల మధ్య ఉండే పైవిచారణకర్తలు సమీపింపదగినవారిగా ఉండాలి.

మనకు పాఠాలు:

40:14, 16, 22, 26. ఆలయ ద్వారాల దగ్గరున్న గోడలమీద ఖర్జూరపుచెట్లు రూపించబడడం నైతిక యథార్థతగలవారు దానిలో ప్రవేశించడానికి అనుమతించబడతారని చూపిస్తోంది. (కీర్తన 92:12) మనం యథార్థపరులుగా ఉంటేనే యెహోవా మన ఆరాధనను అంగీకరిస్తాడని అది మనకు బోధిస్తోంది.

44:23. ఆధునికదిన యాజక తరగతి అందిస్తున్న సేవలకు మనమెంత కృతజ్ఞత కలిగివుండవచ్చో కదా! యెహోవా దృష్టిలో ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో గుర్తించడానికి సహాయం చేసే సమయోచితమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడంలో “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” నాయకత్వం వహిస్తున్నాడు.—మత్తయి 24:45.

47:9, 11. సూచనార్థక నీటిలో ప్రాముఖ్య అంశమైన జ్ఞానం మన కాలంలో అద్భుతమైన స్వస్థతను చేకూరుస్తోంది. దానిని తీసుకున్న ప్రతీచోట అది ప్రజలను ఆధ్యాత్మికంగా జీవింపజేస్తుంది. (యోహాను 17:3) మరోవైపు, జీవాన్నిచ్చే నీళ్లను త్రాగనివారు ‘ఉప్పుగలవారై ఉంటారు’ అంటే శాశ్వతంగా నాశనం చేయబడతారు. ‘మనం సత్యవాక్యమును సరిగా ఉపయోగించడానికి జాగ్రత్తపడడం’ లేక శాయశక్తులా కృషిచేయడం ఎంత ప్రాముఖ్యమో కదా!—2 తిమోతి 2:15.

“నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును”

దావీదు వంశంలోని చివరి రాజు నిర్మూలించబడిన తర్వాత, “స్వాస్థ్యకర్త” వచ్చేంతవరకు ఎంతో సమయం గడిచేందుకు సత్య దేవుడు అనుమతించాడు. అయితే, దేవుడు దావీదుతో చేసిన నిబంధనను విడిచిపెట్టలేదు. (యెహెజ్కేలు 21:27; 2 సమూయేలు 7:11-16) “కాపరిగా,” “రాజుగా” మారే “నా సేవకుడైన దావీదు” గురించి యెహెజ్కేలు ప్రవచనం వివరిస్తోంది. (యెహెజ్కేలు 34:23, 24; 37:22, 24, 25) ఆయన మరెవరో కాదు రాజ్యాధికారంలో ఉన్న యేసుక్రీస్తే. (ప్రకటన 11:15) మెస్సీయ రాజ్యం ద్వారా యెహోవా ‘[తన] ఘనమైన నామాన్ని పరిశుద్ధపర్చుకుంటాడు.’—యెహెజ్కేలు 36:23.

అతి త్వరలో, దేవుని పరిశుద్ధ నామాన్ని అగౌరవపరిచేవారందరూ నాశనం చేయబడతారు. అయితే యెహోవాను అమోదయోగ్యమైన విధంగా ఆరాధించడం ద్వారా తమ జీవితాల్లో ఆ నామాన్ని పవిత్రపరిచేవారు నిత్యజీవాన్ని పొందుతారు. కాబట్టి, మన దినాల్లో సమృద్ధిగా పారుతున్న ఆ జీవపుజలాలను పూర్తిగా వినియోగించుకొని సత్యారాధనను మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన అంశంగా చేసుకుందాం.

[అధస్సూచి]

^ పేరా 4 యెహెజ్కేలు 1:1-24:27 వచనాల్లోని అంశాల చర్చ కోసం, కావలికోట, జూలై 1, 2007 సంచికలోని యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—I చూడండి.

[9వ పేజీలోని చిత్రం]

యెహెజ్కేలు దర్శనంలోని మహిమాన్విత ఆలయం

[10వ పేజీలోని చిత్రం]

యెహెజ్కేలు దర్శనంలోని జీవజలముల నది దేనిని సూచిస్తోంది?

[చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.