కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రాచీన ఇశ్రాయేలులో వ్రాయడానికున్న ప్రాముఖ్యత

ప్రాచీన ఇశ్రాయేలులో వ్రాయడానికున్న ప్రాముఖ్యత

ప్రాచీన ఇశ్రాయేలులో వ్రాయడానికున్న ప్రాముఖ్యత

ప్రాచీన గ్రీసుకు చెందిన రెండు గొప్ప పురాణ కావ్యాలైన ఇలియడ్‌ లేదా ఒడెస్సీలోని భాగాలను మీరెప్పుడైనా చదివారా? అవి సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో లేదా ఎనిమిదవ శతాబ్దాంలో కూర్చబడినట్లుగా భావించబడుతోంది. వీటికీ, వీటికన్నా చాలా శతాబ్దాల క్రితం వ్రాయబడిన బైబిలుకు మధ్య తేడా ఏమిటి? ద జ్యూయిష్‌ ఎండ్‌ ద క్రిస్టియన్‌ బైబిల్‌ అనే సంపుటి ఇలా వ్యాఖ్యానించింది: “బైబిల్లో వ్రాయడం గురించి, వ్రాతప్రతుల గురించి కనీసం 429 సార్లు ప్రస్తావించబడింది. ఇది గమనార్హమైనది, ఎందుకంటే వాటిని చదవడం గుర్తున్నట్లయితే, ఇలియడ్‌లో వ్రాయడం గురించి ఒకే ఒకసారి ప్రస్తావించబడింది, ఒడెస్సీలో అయితే అసలు దాని ప్రస్తావనే లేదు.”

ది ఆక్స్‌ఫర్డ్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఆర్కియాలజీ ఇన్‌ ద నియర్‌ ఈస్ట్‌ ఇలా వివరిస్తుంది: “ప్రాచీన ఇశ్రాయేలులో వ్రాయడం ఆరాధనలో భాగంగా ఉన్నట్లు అనిపిస్తుంది.” ఉదాహరణకు, ధరశాస్త్ర నిబంధన వ్రాయబడడమేకాక, ఆ తర్వాత అది పురుషుల, స్త్రీల, పిల్లలందరి ముందు క్రమంగా చదివి వినిపించబడేది. ప్రజలు దానిని ఒక గుంపుగానే కాక, వ్యక్తిగతంగా కూడా చదివి, అధ్యయనం చేసేవారు. లివర్‌పూల్‌ విశ్వవిద్యాలయంలో సీనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆలన్‌ మిలార్డ్‌ ధర్మశాస్త్రంలోని కొన్ని అంశాలను పరిశీలించిన తర్వాత, ఈ ముగింపుకొచ్చాడు: “ఎలాంటి తేడాలేకుండా ఇశ్రాయేలీయులందరూ చదవగలరని, వ్రాయగలరని బైబిలు రచయితలు భావించారు.”—ద్వితీయోపదేశకాండము 31:9-13; యెహోషువ 1:8, 8:34; నెహెమ్యా 8:13-15.

ఈ పరిశుద్ధ వ్రాతలను క్రైస్తవులెలా దృష్టించాలో అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు: “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.” మీరు, బైబిలును క్రమంగా చదవడం ద్వారా దానిని విలువైనదిగా ఎంచుతున్నారా?—రోమీయులు 15:4.