కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికల నుండి ప్రయోజనం పొందారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

“సంఘము” అనే పదం క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఏ నాలుగింటికి వర్తిస్తుంది?

ప్రాథమికంగా అది ఆత్మాభిషిక్త అనుచరుల సంయుక్త గుంపును (కొన్ని వచనాల్లో క్రీస్తు కూడా చేర్చబడ్డాడు) సూచిస్తోంది. మరికొన్నిసార్లు “దేవుని సంఘము” ఒక నిర్దిష్టమైన కాలంలో నివసిస్తున్న క్రైస్తవులందరికీ వర్తిస్తుంది. మూడవది ఒక ప్రాంతంలోని క్రైస్తవులందరికీ అన్వయిస్తుంది. చివరిగా ఒక ఇంట్లో కూడుకునే స్థానిక సంఘంగా రూపొందిన క్రైస్తవులను సూచిస్తుంది.—4/15, 21-3 పేజీలు.

క్రైస్తవులకు పరలోక నిరీక్షణ కోసం ఇవ్వబడే పిలుపు ఎప్పుడు ఆగిపోతుంది?

బైబిలు దానికి ఖచ్చితమైన జవాబివ్వడంలేదు. ఆ పిలుపు సా.శ. 33లో ప్రారంభమై, ఆధునిక కాలాల వరకు కొనసాగింది. 1935 తర్వాత గొప్ప సమూహంలోనివారు సమకూర్చబడాలనే ముఖ్య ఉద్దేశంతో శిష్యులను చేసే పని చేయబడింది. 1935 తర్వాత బాప్తిస్మంపొందిన కొందరు తమకు పరలోక నిరీక్షణ ఉన్నట్లు పరిశుద్ధాత్మ ద్వారా సాక్ష్యం పొందారు కాబట్టి, క్రైస్తవులు పరలోక నిరీక్షణకు పిలవబడడం ఫలానా తేదీన ఆగిపోయిందని మనం నిర్ణయించలేం. అభిషిక్తులకు పరిశుద్ధాత్మ అధికంగా ఉండదనేది నిజమే, అంతేకాక ఇతరులు తమకు సేవలు చేయాలని వారు ఆశించరు. క్రైస్తవుల నిరీక్షణ ఏదైనప్పటికీ, వారు నమ్మకంగా ఉంటూ దేవుని చిత్తం చేయడంలో కొనసాగాలి.—5/1, 30-1 పేజీలు.

యెఫ్తా మ్రొక్కుబడి చేసినప్పుడు తన కూతురిని దేవునికి దహనబలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడా?

లేదు. మోషే ధర్మశాస్త్రంలోవున్న ఏర్పాటు ప్రకారం, యెఫ్తా తనకు ఎదురొచ్చే వ్యక్తిని దేవుని సేవకే అంకితం చేస్తానని మ్రొక్కుకున్నాడు. (1 సమూయేలు 2:22) ఆ మ్రొక్కుబడిని చెల్లించడానికి యెఫ్తా కుమార్తె దేవుని మందిరంలో సేవచేస్తూ గడిపింది, అది గొప్ప త్యాగమే ఎందుకంటే ఆమె ఎన్నటికీ వివాహం చేసుకోకూడదు.—5/15, 9-10 పేజీలు.

తొలి క్రైస్తవత్వంలో కోడెక్స్‌ ఎలాంటి పాత్ర పోషించింది?

కనీసం సా.శ. మొదటి శతాబ్దాంతం వరకైనా క్రైస్తవులు ఎక్కువగా చుట్టలను లేక గ్రంథపుచుట్టలను ఉపయోగించినట్లు అనిపిస్తుంది. సా.శ. రెండవ శతాబ్దంలో కోడెక్స్‌ను సమర్థించేవారికీ, గ్రంథపుచుట్టను సమర్థించేవారికీ మధ్య సంఘర్షణ జరిగింది. క్రైస్తవులు కోడెక్స్‌ను ఉపయోగించడంవల్లనే దానికి అన్నిచోట్లా ప్రజాదరణ లభించిందని నిపుణులు భావిస్తున్నారు.—6/1, 14-15 పేజీలు.

గెజెర్‌ క్యాలెండర్‌ అంటే ఏమిటి?

అది 1908వ సంవత్సరంలో, గెజెరు నగరంలో వెలుగుచూసిన సున్నపురాయి పలక. ఆ పలక ఒక పాఠశాల విద్యార్థి రాసిన హోమ్‌వర్క్‌ అని చాలామంది భావిస్తారు. ఆ పలక, కోతకాలం మొదలయ్యే నెలను సూచించే సెప్టెంబరు/అక్టోబరుతో ప్రారంభమయ్యే సరళీకృత వ్యవసాయ సంవత్సరం లేక చక్రం గురించే కాక, ఇతర పంటలను, వ్యవసాయ కార్యకలాపాల గురించి కూడా వివరిస్తుంది.—6/15, 8వ పేజీ.

పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేయడమంటే ఏమిటి?

యెహోవా పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపంచేసే అవకాశముంది, అది క్షమాపణ లేని పాపము. (మత్తయి 12:31) మనం క్షమించరాని పాపం చేశామా, మననుండి తన ఆత్మను తీసేయాలా వద్దా అనేది నిర్ణయించేది దేవుడు. (కీర్తన 51:11) మనం చేసిన పాపాన్నిబట్టి తీవ్రంగా దుఃఖిస్తే మనం నిజంగా పశ్చాత్తాపపడతాం, అప్పుడు మనం పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేసినట్లవదు.—7/15, 16-17 పేజీలు.

రాజైన సౌలు దావీదును ఇంతకుముందే కలిసినప్పటికీ, దావీదు ఎవరి కుమారుడని ఎందుకు అడిగాడు? (1 సమూయేలు 16:22; 17:58)

సౌలు కేవలం దావీదు తండ్రెవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అలా ప్రశ్నించలేదు. గొల్యాతును ఓడించడంలో విశ్వాసాన్ని, ధైర్యసాహసాలను కనబర్చిన దావీదును కలిసిన సౌలు, అతణ్ణి ఎలాంటి వ్యక్తి పెంచాడో తెలుసుకోవాలనుకున్నాడు. యెష్షయిని, లేదా అతని కుటుంబంలోని ఇతర సభ్యుల్ని తన సైన్యంలో చేర్చుకోవాలనే ఉద్దేశం కూడా సౌలుకు ఉండివుండవచ్చు.—8/1, 31వ పేజీ.