కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రూపకర్త లేకుండా రూపకల్పనా?

రూపకర్త లేకుండా రూపకల్పనా?

రూపకర్త లేకుండా రూపకల్పనా?

ప్రాణికోటిలోని సంక్లిష్టతకు, వైవిధ్యానికి ప్రకృతివరణం కారణమని చార్లెస్‌ డార్విన్‌ ప్రతిపాదించి దాదాపు 150 ఏళ్లు గడిచాయి. అయితే, ఎంతో అద్భుతంగా, సూక్ష్మాతిసూక్ష్మంగా మెరుగులు దిద్దబడిన జీవుల రూపనిర్మాణం సంకల్పవంతమైన రూపకల్పన ఉన్నట్టు రుజువుచేస్తుందని నమ్మేవారు, ఆయన ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతంతోపాటు నేడు ఆ సిద్ధాంతంలో వచ్చిన మార్పులను ఇటీవల ప్రశ్నిస్తున్నారు. భూమ్మీద మనం చూసే వివిధరకాల జీవాలు ఉనికిలోకి రావడానికి పరిణామ సిద్ధాంతం కారణమనే తలంపును గౌరవార్హులైన అనేకమంది శాస్త్రవేత్తలు కూడా అంగీకరించడంలేదు.

అలాంటి కొంతమంది శాస్త్రవేత్తలు, వివిధరకాల జీవాలు ఉనికిలోకి రావడానికి జ్ఞానవంతమైన రూపకల్పన అని పిలవబడే మరో కారణం కూడా ఉందని చెబుతూ, సృష్టి రూపొందించబడిందని జీవశాస్త్రం, గణితశాస్త్రంతోపాటు ఇంగితజ్ఞానం కూడా గట్టిగా సమర్థిస్తున్నాయని వాదిస్తున్నారు. జ్ఞానవంతమైన రూపకల్పన గురించి విద్యార్థులకు బోధించమని కూడా వారు పాఠశాలలకు సిఫారసు చేస్తున్నారు. ప్రధానంగా, అమెరికాలో పరిణామ యుద్ధాలని పిలవబడే పోరులు జరుగుతున్నాయి, అయితే ఇంగ్లండ్‌, టర్కీ, నెదర్‌లాండ్స్‌, పాకిస్థాన్‌, సెర్బియాలలో కూడా అలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నట్లు నివేదించబడ్డాయి.

రూపకర్త ప్రస్తావనే లేకపోవడం!

అయితే, జ్ఞానవంతమైన రూపకల్పన అనే సిద్ధాంతాన్ని సమర్థించేందుకు జాగ్రత్తగా తయారుచేయబడిన వాదనలో సాధారణంగా, ఒక మాట తొలగించబడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అది రూపకర్త గురించిన ప్రస్తావన. రూపకర్త లేకుండా రూపకల్పన సాధ్యమని మీరు నమ్ముతారా? జ్ఞానవంతమైన రూపకల్పన అనే సిద్ధాంతాన్ని సమర్థించేవారు “రూపకర్త ఎవరై ఉంటారు లేక ఏదైవుంటుంది అనే విషయంలో ఎలాంటి నిర్దిష్టమైన వాదనలు చేయరు” అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌ నివేదిస్తోంది. దానిని సమర్థించేవారు “దేవుణ్ణి చర్చలోకి తీసుకురాకుండా జాగ్రత్తపడతారు” అని క్లోడియా వాలస్‌ అనే రచయిత్రి పేర్కొంది. “జ్ఞానవంతమైన రూపకల్పన అనే సిద్ధాంతం, రూపకర్త ఉనికిని గురించి, గుర్తింపును గురించి ఏమీ ప్రస్తావించడంలేదు” అని న్యూస్‌వీక్‌ పత్రిక వ్యాఖ్యానించింది.

అయితే రూపకర్త గురించిన ప్రశ్నకు సమాధానమివ్వకుండా తప్పుకోవడానికి చేసే ప్రయత్నం వ్యర్థమని మీకిప్పటికే అర్థమై ఉంటుంది. రూపకర్త ఉనికిని, గుర్తింపును మరుగుచేస్తే లేదా అసలు పరిశీలించకుండా వదిలేస్తే విశ్వంలో, ప్రాణికోటిలో కనిపించే రూపకల్పన గురించిన వివరణ ఎలా పూర్తవుతుంది?

రూపకర్తను గుర్తించాలా లేదా అనే అంశంమీద జరుగుతున్న చర్చ కొంతవరకు ఈ ప్రశ్నల చుట్టే తిరుగుతోంది: మానవాతీత రూపకర్త ఉనికిలో ఉన్నాడని అంగీకరించడం విజ్ఞానశాస్త్ర, మేధోసంబంధ ప్రగతికి ప్రతిబంధకంగా ఉంటుందా? మరే ఇతర హేతుబద్ధ వివరణ దొరకనప్పుడు మాత్రమే జ్ఞానవంతుడైన రూపకర్త ఉన్నాడని మనం ఒప్పుకోవాలా? రూపకల్పనను చూసి రూపకర్త ఉన్నాడనే నిర్ధారణకు రావడం నిజంగా జ్ఞానయుక్తమేనా? తర్వాతి ఆర్టికల్‌ ఈ ప్రశ్నలను, వీటికి సంబంధించిన ఇతర ప్రశ్నలను చర్చిస్తుంది.

[3వ పేజీలోని చిత్రాలు]

జీవంలోని సంక్లిష్టతకు ప్రకృతివరణం కారణమని చార్లెస్‌ డార్విన్‌ నమ్మాడు

[చిత్రసౌజన్యం]

డార్విన్‌: From a Photograph by Mrs. J. M. Cameron/U.S. National Archives photo