కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడానికి కారణమేమిటి?

దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడానికి కారణమేమిటి?

దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడానికి కారణమేమిటి?

దుష్టత్వం ఎంత ప్రబలంగా ఉందో చూడడానికి మీరు ఎక్కడికో వెళ్లనవసరం లేదు, అది అన్నిచోట్లా ఉంది. యుద్ధాల్లో సైనికులేకాక పౌరులు కూడా మృత్యువాత పడుతున్నారు. నేరం, దౌర్జన్యం లేని ప్రాంతమంటూ ఏదీ లేదు. బహుశా మీరు కూడా ఇటీవల వివక్షకో అన్యాయానికో గురై ఉండవచ్చు. మీరు చూసిన, అనుభవించిన వాటిని బట్టి మీరు బహుశా ఈ ప్రశ్న వేసుకుని ఉండవచ్చు, ‘దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడానికి కారణమేమిటి?’

ఆ ప్రశ్న అందరూ అడిగేదే. దాదాపు 3,600 సంవత్సరాల క్రితం, దేవుని యథార్థ సేవకుల్లో ఒకడైన యోబు ఇలా అడిగాడు: “భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?” (యోబు 21:7) సా.శ.పూ. ఏడవ శతాబ్దానికి చెందిన యిర్మీయా ప్రవక్త, తన దేశ ప్రజల దుష్టకార్యాలను చూసి భరించలేక ఇలా అడిగాడు: “దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?” (యిర్మీయా 12:1) యోబుకు, యిర్మీయాకు దేవుడు నీతిమంతుడనే విషయం తెలుసు. అయినప్పటికీ, అంత దుష్టత్వం ఎందుకుందనే విషయంలో వారు కలవరపడ్డారు. బహుశా మీరు కూడా ఈ విషయమై కలవరపడుతుండవచ్చు.

దుష్టత్వానికి, బాధలకు దేవుడే బాధ్యుడని కొందరు అనుకుంటారు. మరికొందరు ఇలా అడుగుతారు: ‘ఒకవేళ దేవుడు, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, ప్రేమాస్వరూపి అయితే ఈ దుష్టత్వాన్ని, బాధలను ఎందుకు తీసివేయడంలేదు? కీడు ఇంతకాలం కొనసాగడానికి ఆయన ఎందుకు అనుమతిస్తున్నాడు?’ తర్వాతి ఆర్టికల్‌ ఈ ప్రశ్నలకు, మరితర ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

AP Photo/Adam Butler