అర్థవంతమైన సంకల్పంతో జీవించడం
అర్థవంతమైన సంకల్పంతో జీవించడం
“సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక.”—కీర్తన 150:6.
“ప్రజలకు సహాయం చేసేందుకు నా జీవితాన్ని ఉపయోగించాలనే అభిలాషతో నేను వైద్య విద్యనభ్యసించాను. అలాగే వైద్యునిగా లభించే హోదా, డబ్బుతో సంతోషంగా ఉండవచ్చని కూడా భావించాను. అయితే ప్రజలకు నిజంగా సహాయపడే విషయంలో వైద్యులు చేయగలిగింది చాలా తక్కువని గ్రహించి, ఎంతో నిరాశ చెందాను. ఆ తర్వాత నేను కళను అభ్యసించాను, కానీ నా కళాకృతులు ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చలేకపోయాయి, నేను చేపట్టిన ఈ చర్య స్వార్థపూరితమైనదిగా అనిపించింది. నేను ఉపాధ్యాయ వృత్తి చేపట్టాను, దానివల్ల నేను వాస్తవాలను మాత్రమే అందించగలను గానీ నిజమైన సంతోషానికి నడిపించగల మార్గనిర్దేశాన్ని అందించలేనని గ్రహించాను” అని కొరియాలో పెరిగిన సంగ్‌జిన్ గుర్తుచేసుకుంటున్నాడు. * చాలామందిలాగే సంగ్‌జిన్ అర్థవంతమైన జీవిత సంకల్పం కోసం అన్వేషించాడు.
2 జీవితంలో నిజమైన సంకల్పం ఉండాలంటే, జీవించడానికి ఒక కారణం ఉండాలి, స్పష్టమైన ధ్యేయం ఉండాలి, మన ప్రయత్నాలకు కేంద్రబిందువుగా ఒక లక్ష్యం ఉండాలి. మానవులు నిజంగా అలాంటి సంకల్పాన్ని కలిగివుండగలరా? కలిగివుండగలరు! మనం తెలివి, మనస్సాక్షి, తర్కసామర్థ్యంతో సృష్టించబడ్డామనే వాస్తవం మనల్ని భూమ్మీద ఉంచడంలో సృష్టికర్తకు ఓ చక్కని సంకల్పముందనే భావాన్నిస్తోంది. కాబట్టి, మనం సృష్టికర్త సంకల్పానికి అనుగుణంగా జీవించినప్పుడే మనం నిజ సంకల్పాన్ని కనుగొని దానిని నెరవేర్చగలమనేది సహేతుకం.
3 మన విషయమైన దేవుని సంకల్పంలో చాలా సంగతులు ఇమిడివున్నాయని బైబిలు వెల్లడిస్తోంది. ఉదాహరణకు, మనం ఆశ్చర్యకర రీతిలో సృష్టించబడడం దేవుని నిస్వార్థ ప్రేమకు నిజమైన నిదర్శనం. (కీర్తన 40:5; 139:14) కాబట్టి దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించడమంటే దేవునిలాగే ఇతరులను నిస్వార్థంగా ప్రేమించడమని అర్థం. (1 యోహాను 4:7-11) అలాగే దేవుని ప్రేమపూర్వక సంకల్పానికి అనుగుణంగా జీవించడానికి మనకు సహాయం చేసే ఆయన ఆదేశాలను పాటించడమని కూడా అర్థం.—ప్రసంగి 12:13; 1 యోహాను 5:3.
ఆదికాండము 1:26; 2:15) కానీ సంతోషంగా, సురక్షితంగా, సమాధానంగా ఉండాలంటే మనమేమి చేయాలి? సంతోషంగా, సురక్షితంగా ఉన్నట్లు భావించేందుకు పిల్లవాడు, తన తల్లిదండ్రులు సమీపంలోనే ఉన్నారని గ్రహించడం ఎలా అవసరమో, అలాగే జీవితంలో నిజమైన అర్థాన్ని, సంకల్పాన్ని కనుగొనేందుకు మనం మన పరలోకపు తండ్రితో మంచి సంబంధాలను కలిగివుండడం అవసరం. (హెబ్రీయులు 12:9) దేవుడు తనకు సన్నిహితమయ్యేందుకు మనల్ని అనుమతిస్తూ, మన ప్రార్థనలు ఆలకిస్తూ తనతో అలాంటి సంబంధాన్ని కలిగివుండడాన్ని సాధ్యపరుస్తున్నాడు. (యాకోబు 4:8; 1 యోహాను 5:14, 15) మనం విశ్వాసం కలిగి ‘దేవునితో నడుస్తూ’ ఆయన స్నేహితులుగా మారినప్పుడు, మనం మన పరలోక తండ్రికి ఆనందాన్ని, స్తుతిని తీసుకొస్తాం. (ఆదికాండము 6:9; సామెతలు 23:15, 16; యాకోబు 2:23) అది అత్యంత ఉదాత్తమైన సంకల్పం. కీర్తనకర్త ఇలా రాశాడు: “సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక.”—కీర్తన 150:6.
4 మానవులు పరస్పరమే కాక, మిగతా సృష్టితో కూడా సంతోషంగా, సమాధానంగా జీవించాలని దేవుడు సంకల్పించాడు. (మీ జీవిత సంకల్పమేమిటి?
5 మన విషయమై దేవునికున్న సంకల్పంలో మనం మనపట్ల, మన కుటుంబాలపట్ల మంచి శ్రద్ధ చూపించడం ఒక భాగం. దీనిలో భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధ చూపించడం ఇమిడివుంది. అయితే లౌకిక విషయాలు, వ్యవహారాలు ఎంతో ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలను మరుగు చేయకుండా ఉండేందుకు సమతుల్యం అవసరం. (మత్తయి 4:4; 6:33) విచారకరంగా, చాలమంది దాదాపు తమ జీవితాన్నంతటినీ కేవలం వస్తుపరమైన ఆస్తులను సంపాదించుకోవడం మీదే కేంద్రీకరిస్తున్నారు. అయితే మన అవసరాలన్నింటినీ వస్తుసంపదతో తీర్చుకునేందుకు ప్రయత్నించడం అవివేకం. ఆసియాలోని సంపన్నులపై ఇటీవల జరిపిన ఒక సర్వే, వారిలో చాలమంది “సంపద తమకు తెచ్చిన సామాజిక హోదాను, గౌరవ స్థానాన్ని అనుభవిస్తున్నా అభద్రతా భావంతో, ఆందోళన పడుతున్నారు” అని వెల్లడిచేస్తోంది.—ప్రసంగి 5:11.
6 యేసు “ధనమోసము” గురించి మాట్లాడాడు. (మార్కు 4:18) ధనమెలా మోసకరమైనది? అది ఒక వ్యక్తిని సంతోషపరుస్తున్నట్లే కనిపిస్తుంది, కాని అదలా సంతోషపర్చదు. “డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు తనకి ఉన్న డబ్బుతో ఎన్నడూ తృప్తి చెందడు” అని జ్ఞానియైన సొలొమోను రాజు రాశాడు. (ప్రసంగి 5:10, ఈజీ-టు-రీడ్ వర్షన్) అయితే వస్తుసంపదను అన్వేషిస్తూ, అదే సమయంలో పూర్ణాత్మతో దేవుణ్ణి సేవించడం సాధ్యమా? లేదు, అలా సాధ్యపడదు. యేసు ఇలా వివరించాడు: “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.” యేసు భూమ్మీద వస్తుసంపదలను కాదుగానీ, ‘పరలోకంలో ధనం’ సమకూర్చుకోవాలని అంటే “మీరు . . . అడగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో” తెలిసిన దేవుని ఎదుట మంచి పేరు సంపాదించుకోవాలని తన అనుచరులకు ఉపదేశించాడు.—మత్తయి 6:8, 19-25.
7 తన తోటి పనివాడైన తిమోతికి రాస్తూ అపొస్తలుడైన పౌలు, ఈ విషయంలో గట్టి హెచ్చరికనిచ్చాడు. ఆయన తిమోతికిలా చెప్పాడు: “ధనవంతులైనవారు . . . అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని . . . వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, . . . ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.”—1 తిమోతి 6:17-19.
“వాస్తవమైన జీవము” అంటే ఏమిటి?
8 చాలామందికి “వాస్తవమైన జీవము” అంటే విలాసవంతమైన, సుఖప్రదమైన జీవిత చిత్రమే మదిలోకి వస్తుంది. ఒక ఆసియా వార్తాపత్రిక ఇలా చెబుతోంది: “సినిమాలు లేదా టీవీ చూసేవారు తాము చూసేది తమకూ కావాలని కోరుకుంటూ తాము కలిగివుండగల వాటికోసం కలలుకంటారు.” చాలామంది ధనసంపదను, 1 కొరింథీయులు 2:12; ఎఫెసీయులు 2:2) కాబట్టి నేడు చాలామంది అసంతోషంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు!—సామెతలు 18:11; 23:4, 5.
హోదాను సంపాదించుకోవడమే తమ జీవిత సంకల్పంగా చేసుకుంటారు. వీటి అన్వేషణలో చాలామంది తమ యౌవనాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబ జీవితాన్ని, ఆధ్యాత్మిక విలువల్ని బలిపెడతారు. అలాంటి విలాసవంతమైన, సుఖప్రదమైన జీవితం “లౌకికాత్మను” ప్రతిబింబిస్తుందని చాలా తక్కువమంది అనుకుంటారు. “లౌకికాత్మ” అంటే భూమ్మీది కోట్లాదిమందిలో ఎక్కువశాతం ప్రజల్ని ప్రభావితం చేస్తూ, మన విషయమై దేవునికున్న సంకల్పానికి వ్యతిరేకంగా ప్రవర్తించేలా పురికొల్పే ఆలోచనా విధానం. (9 ఆకలిని, వ్యాధిని, అన్యాయాన్ని నిర్మూలించేందుకు కృషిచేస్తూ ఇతరుల సంక్షేమం కోసం నిస్వార్థంగా శ్రమించేవారి విషయమేమిటి? వారి ఉదాత్తమైన, స్వయంత్యాగపూరిత ప్రయత్నాలు తరచూ అనేకమందికి మేలు చేస్తాయి. అయితే, వారెంత అత్యుత్తమంగా ప్రయత్నించినా, ఈ విధానాన్ని వారెన్నటికీ న్యాయమైన, మేలైన విధానంగా మార్చలేరు. ఎందుకు? ఎందుకంటే “లోకమంతయు దుష్టునియందున్నది,” అంటే సాతాను ఆధీనంలో వుంది, అది మారడం అతనికిష్టం లేదు.—1 యోహాను 5:19.
10 ప్రస్తుత లోకంలో ఈ జీవితంకన్నా మరే నిరీక్షణా లేకపోవడం ఎంత విచారకరమో కదా! “ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము” అని పౌలు రాశాడు. జీవితంలో ఉన్నదల్లా ఇంతే అని నమ్మేవారి దృక్పథం, “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” అనే విధంగా ఉంటుంది. (1 కొరింథీయులు 15:19, 32) కానీ మనకు భవిష్యత్తు ఉంది, “మనం [దేవుని] వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13) ఆ కాలంలో క్రైస్తవులు, “వాస్తవమైన జీవమును” అంటే పరలోకంలో లేదా దేవుని రాజ్య ప్రభుత్వ ప్రేమపూర్వక పరిపాలనలో పరిపూర్ణతను, “నిత్యజీవమును” అనుభవిస్తారు.—1 తిమోతి 6:12.
11 మానవాళి సమస్యలను పరిష్కరించడంలో దేవుని రాజ్యం మాత్రమే పూర్తిగా విజయం సాధిస్తుంది. కాబట్టి దేవుని రాజ్య సంబంధ విషయాలను వృద్ధిచేసేందుకు పనిచేయడమే అత్యంత సంకల్పవంతమైన పని. (యోహాను 4:34) మనమా పనిలో పాల్గొంటుండగా, మనం మన పరలోక తండ్రితో ఆశీర్వాదకర సంబంధాన్ని అనుభవిస్తాం. అలాగే జీవితంలో అదే సంకల్పాన్ని అన్వేషిస్తున్న లక్షలాది ఆధ్యాత్మిక సహోదర సహోదరీలతో జతపనివారిగా సేవచేసే ఆనందాన్ని కూడా మనం కలిగివుంటాం.
సరైన త్యాగాలు చేయడం
12 ప్రస్తుత “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి” అని బైబిలు చెబుతోంది. సాతాను లోకపు ప్రతిష్ట, సంపందతోపాటు దానిలోని సమస్తం సర్వనాశనమౌతాయి, కానీ “దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును.” (1 యోహాను 2:15-17) ప్రస్తుత విధానపు సంపద అస్థిరమైనది, ఖ్యాతి క్షణికమైనది, ఐహికసుఖాలు నిజమైన ఆనందాన్ని ఇవ్వవు, వీటికి భిన్నంగా “వాస్తవమైన జీవము” శాశ్వతమైనది, అదే దేవుని రాజ్యంలో నిత్యజీవం. అంతేకాక, మనం సరైన త్యాగాలు చేసినప్పుడు ఆ త్యాగాలకది తగినది.
13 హెన్రీ, సూజన్‌ల విషయమే తీసుకోండి. తమ జీవితంలో రాజ్యానికి ప్రథమ స్థానమిచ్చేవారికి దేవుని అండదండలు ఉంటాయనే ఆయన వాగ్దానంపై వారికి పూర్తి విశ్వాసముంది. (మత్తయి 6:33) అందువల్ల వారిద్దరూ పనిచేయడానికి బదులు తమ ఇద్దరు పిల్లలతోపాటు ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ సమయం వెచ్చించడానికి వీలుగా చిన్న ఇంటిలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. (హెబ్రీయులు 13:15, 16) శ్రేయోభిలాషియైన ఒక స్నేహితురాలు వారి నిర్ణయాన్ని అర్థం చేసుకోలేకపోయింది. ఆమె సూజన్‌తో ఇలా అంది: “చూడు, సూజన్ మీరొక మంచి ఇంటిలో నివసించాలంటే, ఏదో ఒకటి త్యాగం చేయక తప్పదు.” అయితే, యెహోవాకు ప్రథమ స్థానమివ్వడం “యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినది” అని హెన్రీ, సూజన్‌లకు తెలుసు. (1 తిమోతి 4:8; తీతు 2:12) వారి కుమార్తెలిద్దరూ ఉత్సాహంగా పూర్తికాల సువార్తసేవ చేపట్టారు. ఒక కుటుంబంగా తాము పొగుట్టుకున్నదేమీ లేదని వారు భావిస్తున్నారు, బదులుగా వారు “వాస్తవమైన జీవమును” అన్వేషించడాన్ని తమ సంకల్పంగా చేసుకున్నందుకు ఎంతో ప్రయోజనం పొందారు.—ఫిలిప్పీయులు 3:8; 1 తిమోతి 6:6-8.
‘లోకమును అమితంగా అనుభవించకండి’
14 అయితే, మనం మన నిజ సంకల్పాన్ని మర్చిపోయి, ‘వాస్తవమైన జీవంపై’ పట్టు కోల్పోవడం నిజంగా ప్రమాదకరమైనది. “యీ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగములచేతను అణచివేయబ[డే]” ప్రమాదంలో మనం పడతాం. (లూకా 8:14) విశృంఖలమైన కోరికలు, జీవనసంబంధ లేదా “ఐహిక విచారములు” ఈ విధానంలో పీకలదాకా కూరుకుపోయేందుకు దారి తీయగలవు. (లూకా 21:34) విచారకరంగా కొందరు, సంపన్నులు కావాలనే నవతరపు వెర్రికోరికలో కూరుకుపోయి, యెహోవాతో తమకుగల ప్రశస్త సంబంధాన్ని సహితం పోగొట్టుకొని “విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.” ‘నిత్యజీవమును చేపట్టలేకపోవడం’ ఎంత దుఃఖకరమైన పర్యవసానాలకు దారితీస్తుందో కదా!—1 తిమోతి 6:9, 10, 12; సామెతలు 28:20.
15 ‘ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలెను’ అని పౌలు సలహాయిచ్చాడు. (1 కొరింథీయులు 7:31) కీత్, బోనీలు ఈ సలహాను లక్ష్యపెట్టారు. కీత్ ఇలా చెబుతున్నాడు: “దంతవైద్య విద్యను పూర్తిచేస్తుండగా నేను యెహోవాసాక్షినయ్యాను. ఏదోకటి నిర్ణయించుకోవాలి. చాలామంది రోగులకు వైద్యం చేస్తూ చాలా డబ్బు సంపాదించవచ్చు, అయితే అలా చేయడం మా అధ్యాత్మిక జీవితానికి అంతరాయం కలిగిస్తుంది. ఐదుగురు కూతుర్లున్న మా కుటుంబ ఆధ్యాత్మిక, భావోద్రేక సంక్షేమానికి ఎక్కువ సమయం కేటాయించగలిగేలా నేను కొద్దిమంది రోగులకే వైద్యం చేయాలని నిర్ణయించుకున్నాను. మా దగ్గర ఎప్పుడోగాని డబ్బు అదనంగా ఉండేది కాదు, అయినా పొదుపుగా గడపడం నేర్చుకున్నాం, మేమెల్లప్పుడు అవసరమైన వాటినే కలిగివుండేవాళ్లం. ఒక కుటుంబంగా మేము సన్నిహితంగా, ప్రేమానురాగాలతో, ఆనందంగా ఉండేవాళ్లం. చివరకు మేమందరం పూర్తికాల పరిచర్య ప్రారంభించాం. ఇప్పుడు మా అమ్మాయిలు పెళ్లిచేసుకొని సంతోషంగా ఉన్నారు, వారిలో ముగ్గురికి పిల్లలున్నారు. యెహోవా సంకల్పానికి ప్రథమ స్థానమిస్తుండగా వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉన్నాయి.”
మీ జీవితంలో దేవుని సంకల్పానికి ప్రథమ స్థానమివ్వడం
16 దేవుని సంకల్పంచొప్పున జీవించిన, జీవించని వారి ఉదాహరణలను బైబిలు పేర్కొంటోంది. అలాంటి ఉదాహరణల్లోని పాఠాలు అన్ని వయసుల, సంస్కృతుల, పరిస్థితుల ప్రజలకు వర్తిస్తాయి. (రోమీయులు 15:4; 1 కొరింథీయులు 10:6, 11) నిమ్రోదు మహాపట్టణాలు నిర్మించాడు, కానీ అతడు యెహోవా ఉద్దేశానికి వ్యతిరేకంగా ఆ పని చేశాడు. (ఆదికాండము 10:8, 9) కానీ ఇతరులు చాలామంది మంచి మాదిరిగా ఉన్నారు. ఉదాహరణకు, మోషే ఐగుప్తు ప్రభువుగా తన హోదాను కాపాడుకోవడమే తన జీవిత సంకల్పంగా చేసుకోలేదు. బదులుగా, ఆయన తన ఆధ్యాత్మిక బాధ్యతల్ని ‘ఐగుప్తు ధనముకన్నా గొప్ప భాగ్యమని’ ఎంచాడు. (హెబ్రీయులు 11:24) వైద్యుడైన లూకా బహుశా పౌలుకు, మరితరులకు వైద్య సహాయం అందించి ఉండవచ్చు. కానీ సువార్తికునిగా, బైబిలు రచయితగా లూకా ఇతరులకు అత్యంత గొప్ప సహాయం అందించాడు. ఇక పౌలు విషయానికొస్తే, ఆయన న్యాయశాస్త్ర నిపుణునిగా కాక, మిషనరీగా ‘అన్యజనులకు అపొస్తలునిగానే’ ఎక్కువ పేరుగాంచాడు.—రోమీయులు 11:14.
17 దావీదు ప్రాథమికంగా సైనికాధికారిగా లేదా సంగీతకారునిగా, సంగీతం కూర్చేవానిగా కాదుగానీ ‘యెహోవా చిత్తానుసారమైన మనసుగల వ్యక్తిగానే’ తెలుసు. (1 సమూయేలు 13:14) దానియేలు, బబులోను ప్రభుత్వాధికారిగా తాను చేసిన పనినిబట్టి కాదుగానీ యెహోవా యథార్థ ప్రవక్తగా తాను చేసిన సేవను బట్టి మనకు తెలుసు; ఎస్తేరు, పర్షియా రాణీగా కాదుగానీ, ధైర్య విశ్వాసాలకు మాదిరిగానే మనకు తెలుసు; పేతురు, ఆంద్రెయ, యాకోబు, యోహానులు సమర్థులైన జాలరులుగా కాదుగానీ యేసు అపొస్తలులుగానే మనకు తెలుసు. మరింత ప్రాముఖ్యంగా, యేసును మనం ‘వడ్లవానిగా’ కాదుగానీ ‘క్రీస్తుగానే’ గుర్తుచేసుకుంటాం. (మార్కు 6:3; మత్తయి 16:16) తమకెలాంటి నైపుణ్యాలు, ఆస్తులు లేదా హోదావున్నా తమ జీవితం లౌకిక వృత్తి చుట్టూ కాదుగానీ దేవునికి తాముచేసే సేవచుట్టూ పరిభ్రమించాలని వీరందరూ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. తాము కలిగివుండగల అమూల్యమైన, అత్యంత ప్రతిఫలదాయకమైన సంకల్పం, దైవభక్తిగల వ్యక్తిగా ఉండడమే అని వారికి తెలుసు.
18 ఆరంభంలో పేర్కొనబడిన సంగ్‌జిన్ కూడా చివరకు ఈ విషయాన్నే అర్థం చేసుకున్నాడు. ఆయనిలా వివరిస్తున్నాడు: “నా శక్తినంతా వైద్యానికి, కళకు లేదా లౌకిక ఉపాధ్యాయ వృత్తికే అంకితం చేసే బదులు దేవునికి నేను చేసుకున్న సమర్పణకు అనుగుణంగా నా జీవితాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. బైబిలు బోధకుల అవసరం ఎక్కువున్న ప్రాంతంలో నేనిప్పుడు సేవచేస్తూ, ప్రజలు జీవమార్గంలోకి వచ్చేందుకు సహాయం చేస్తున్నాను. పూర్తికాల పరిచారకునిగా ఉండడం అంత స్ఫూర్తిదాయకంగా ఉండదని నేననుకునేవాణ్ణి. నా వ్యక్తిత్వాన్ని, వివిధ సంస్కృతుల ప్రజలకు బోధించే నా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు నేను ప్రయత్నిస్తుండగా, ఇప్పుడు నా జీవితం క్రితమెన్నటికన్నా మరెంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. యెహోవా సంకల్పాన్ని మన సంకల్పంగా చేసుకోవడమే అర్థవంతమైన జీవన విధానమని నేనిప్పుడు గ్రహించాను.”
19 క్రైస్తవులుగా మనం ప్రాణరక్షణ జ్ఞానంతో, రక్షణార్థమైన నిరీక్షణతో ఆశీర్వదించబడ్డాం. (యోహాను 17:3) కాబట్టి మనం “పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దు.” (2 కొరింథీయులు 6:1) బదులుగా, మన విలువైన కాలాన్ని, జీవితాన్ని యెహోవాను స్తుతించేందుకు ఉపయోగిద్దాం. ఇప్పుడు నిజమైన సంతోషాన్ని తీసుకురావడమే కాక, నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని అందరికీ పంచుదాం. అలా చేయడం ద్వారా, యేసు పలికిన ఈ మాటల సత్యత్వాన్ని అనుభవిస్తాం: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:35) అప్పుడు మనం జీవితంలో నిజమైన సంకల్పాన్ని కనుగొంటాం.
[అధస్సూచి]
^ పేరా 3 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
మీరు వివరించగలరా?
• జీవిత అత్యున్నత సంకల్పమేమిటి?
• వస్తుసంపద కోసం జీవించడం ఎందుకు అవివేకం?
• దేవుడు ఏ ‘వాస్తవమైన జీవాన్ని’ వాగ్దానం చేస్తున్నాడు?
• దేవుని సంకల్పం కోసం మనం మన జీవితాన్ని ఎలా ఉపయోగించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
1. జీవిత సంకల్పం కోసం ఒక యువకుడు చేసిన అన్వేషణను వర్ణించండి.
2. (ఎ) జీవితంలో సంకల్పాన్ని కలిగివుండడమంటే అర్థమేమిటి? (బి) మనల్ని భూమ్మీద ఉంచడంలో సృష్టికర్తకు ఒక సంకల్పముందని మనకెలా తెలుసు?
3. మానవుల విషయమైన దేవుని సంకల్పంలో ఏమి ఇమిడివుంది?
4. (ఎ) జీవితంలో నిజమైన సంకల్పాన్ని కలిగివుండేందుకు ఏమి అవసరం? (బి) ఏది అత్యంత ఉదాత్తమైన సంకల్పం?
5. వస్తుసంపదకు ప్రథమ స్థానమివ్వడం ఎందుకు అవివేకం?
6. ధనసంపదను అన్వేషించే విషయంలో యేసు ఏ ఉపదేశమిచ్చాడు?
7. “వాస్తవమైన జీవమును” మనమెలా ‘సంపాదించుకోవచ్చు’?
8. (ఎ) చాలామంది ఎందుకు ధనసంపద, హోదా కోసం పాటుపడతారు? (బి) అలాంటి వారు దేనిని గ్రహించడం లేదు?
9. మానవులు దేనిని ఎన్నటికీ సాధించలేరు, ఎందుకు?
10. విశ్వాసులు ఎప్పుడు “వాస్తవమైన జీవమును” అనుభవిస్తారు?
11. దేవుని రాజ్య సంబంధ విషయాలను వృద్ధిచేసేందుకు పనిచేయడం ఎందుకు సంకల్పవంతమైనది?
12. ప్రస్తుత విధానపు జీవితానికి, ‘వాస్తవమైన జీవమునకు’ మధ్యవున్న భేదాన్ని చూపించండి.
13. ఒక జంట ఎలా సరైన త్యాగాలు చేసింది?
14. మన నిజ సంకల్పాన్ని మర్చిపోవడం ఏ దుఃఖకర పర్యవసానాలకు దారి తీయగలదు?
15. ‘లోకాన్ని అమితంగా అనుభవించనందువల్ల’ ఓ కుటుంబం ఎలా ప్రయోజనం పొందింది?
16, 17. నైపుణ్యంగల ఎవరి ఉదాహరణలను బైబిలు పేర్కొంటోంది, వారెలా గుర్తుచేసుకోబడుతున్నారు?
18. ఒక యౌవన క్రైస్తవుడు తన జీవితాన్ని ఎలా ఉపయోగించేందుకు నిర్ణయించుకున్నాడు, చివరకు ఆయనేమి గ్రహించాడు?
19. జీవితంలో నిజమైన సంకల్పాన్ని మనమెలా కనుగొనవచ్చు?
[18వ పేజీలోని చిత్రాలు]
క్రైస్తవులు సరైన త్యాగాలు చేయాలి