కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఆదికాండము 27:18,19లో రాయబడినట్లుగా, యాకోబు తానే ఏశావుగా నటించడం తప్పుకాదా?

ఆ వృత్తాంతం మీకు తెలిసే ఉండవచ్చు. ఇస్సాకు తన వృద్ధాప్యంలో, ఏశావు తన కోసం వేటాడిన మాంసం తేవాలని చెప్తూ ఇలా అన్నాడు: “నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నన్ను తిననివ్వు.” తన భర్త మాటలు విన్న రిబ్కా రుచికరమైన భోజ్యములను సిద్ధపరచి, యాకోబును ఇలా ఆజ్ఞాపించింది: “నీ తండ్రి మృతిబొందక ముందు అతడు తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని [భోజ్యములను] నీ తండ్రియొద్దకు తీసికొనిపోవలె[ను].” ఆ తర్వాత యాకోబు ఏశావు వస్త్రాలను ధరించి, మేకపిల్లల చర్మాన్ని మెడకు, చేతులకు కప్పుకొని రుచికరమైన భోజ్యములతో తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. ‘నా కుమారుడా నీవెవరవు?’ అని ఇస్సాకు తనను అడిగినప్పుడు, యాకోబు ఇలా జవాబిచ్చాడు: “నేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను.” ఇస్సాకు అతణ్ణి నమ్మి, అతణ్ణి దీవించాడు.—ఆదికాండము 27:1-29.

రిబ్కా, యాకోబులు అలా ఎందుకు చేశారో బైబిలు వివరంగా చెప్పపోయినా, ఊహించనిరీతిలో ఆ పరిస్థితి ఎదురయ్యిందని మాత్రం అది చెబుతోంది. రిబ్కా, యాకోబులు చేసిన పనిని దేవుని వాక్యం సమర్థించలేదు అలాగని ఖండించనూ లేదు కాబట్టి ఆ వృత్తాంతం అబద్ధాలు చెప్పడానికి, మోసం చేయడానికి ఒక ప్రమాణాన్ని స్థిరపర్చడం లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే పరిస్థితిని అర్థం చేసుకునేందుకు బైబిలు మరిన్ని వివరాలందిస్తోంది.

మొదటిగా, తండ్రి దగ్గరనుండి దీవెనలు పొందే హక్కు యాకోబుకే ఉందిగానీ ఏశావుకు లేదు అని ఆ వృత్తాంతం స్పష్టం చేస్తోంది. తన ఆకలిని తీర్చుకోవడానికి ఒక పూట ఆహారం కోసం జ్యేష్ఠత్వపు హక్కును ఏ మాత్రం విలువలేనిదిగా పరిగణిస్తూ అమ్మివేసిన కవలసోదరుని నుండి అంతకుముందు యాకోబు న్యాయబద్ధంగా ఆ జ్యేష్ఠత్వపు హక్కును కొన్నాడు. ఏశావు “జ్యేష్ఠత్వమును తృణీకరిం[చాడు].” (ఆదికాండము 25:29-34) కాబట్టి యాకోబు న్యాయంగా తనకు చెందవలసిన దీవెన పొందడానికే తన తండ్రి దగ్గరకు వెళ్లాడు.

రెండవదిగా, ఇస్సాకు తాను యాకోబును దీవించానని గ్రహించినప్పుడు ఆయన దానిని మార్చడానికి ప్రయత్నించలేదు. కవల పిల్లలు జన్మించకముందు యెహోవా రిబ్కాకు, “పెద్దవాడు చిన్నవానికి దాసుడగును” అని చెప్పిన విషయాన్ని ఇస్సాకు బహుశా జ్ఞాపకం చేసుకొనివుండవచ్చు. (ఆదికాండము 25:23) యాకోబు హారానుకు బయలుదేరబోతుండగా, ఇస్సాకు ఆయనను ఇంకా ఎక్కువ దీవించాడనేది కూడా గమనించదగిన విషయం.—ఆదికాండము 28:1-4.

చివరిగా, జరుగుతున్నదంతా యెహోవాకు తెలుసనీ, దానిపట్ల ఆయనకు అసక్తి కూడా ఉందనీ గుర్తుంచుకోవాలి. ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానంతో ముడిపెట్టబడింది. (ఆదికాండము 12:2, 3) ఆ ఆశీర్వాదం యాకోబుకు చెందకూడదు అని దేవుడు అనుకుంటే, ఆయన ఏదోవిధంగా జోక్యం చేసుకుని ఉండేవాడు. బదులుగా, ఆ విషయాన్ని స్థిరపరుస్తూ యెహోవా యాకోబుతో ఇలా చెప్పాడు: “భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.”—ఆదికాండము 28:10-15.