కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సత్యమంటే ఏమిటి?’

‘సత్యమంటే ఏమిటి?’

‘సత్యమంటే ఏమిటి?’

యేసును రోమా అధిపతియైన పొంతి పిలాతు హేళనగా ఆ ప్రశ్న అడిగాడు. నిజానికి జవాబుపట్ల అతనికి ఆసక్తిలేదు, యేసు అతనికి జవాబేమీ ఇవ్వలేదు కూడా. సత్యాన్ని అర్థంచేసుకోవడం అసాధ్యమని బహుశా పిలాతు భావించివుండవచ్చు.—యోహాను 18:37-38.

మతనాయకులు, విద్యావేత్తలు, రాజకీయనాయకులతోపాటు నేడు అనేకమంది సత్యంపట్ల ఇలాంటి నిర్లక్ష్య వైఖరినే కనబరుస్తున్నారు. సత్యం, ప్రాముఖ్యంగా నైతిక, ఆధ్యాత్మిక విషయాల గురించిన సత్యం స్థిరంగా ఉండదు గానీ అది సాపేక్షికమైనది, ఎల్లప్పుడూ మారుతూ ఉంటుందని వారు నమ్ముతారు. అంటే ప్రజలు మంచిచెడులను తమంతటతామే నిర్ణయించుకోగలరని ఇది సూచిస్తుంది. (యెషయా 5:20, 21) మునుపటి తరాలవారు అనుసరించిన విలువలను, నైతిక ప్రమాణాలను కాలంచెల్లినవాటిగా ప్రజలు తిరస్కరించగలగాలి అని కూడా ఇది సూచిస్తుంది.

పిలాతు ఆ ప్రశ్న అడగడానికి దారితీసిన మాటలు గమనార్హమైనవి. యేసు ఇలా అన్నాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.” (యోహాను 18:37) యేసు సత్యం అస్పష్టమైనదనీ, అర్థంచేసుకునేందుకు అసాధ్యమైనదనీ భావించలేదు. ఆయన తన శిష్యులకు ఇలా వాగ్దానం చేశాడు: ‘మీరు సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.’—యోహాను 8:31-32.

అలాంటి సత్యాన్ని మనం ఎక్కడ కనుగొనవచ్చు? ఒక సందర్భంలో, దేవునికి ప్రార్థిస్తూ యేసు ఇలా అన్నాడు: “నీ వాక్యమే సత్యము.” (యోహాను 17:17) దైవ ప్రేరేపణతో రాయబడిన బైబిలు, నమ్మదగిన మార్గనిర్దేశాన్ని ఇచ్చే సత్యాన్నే కాక, భవిష్యత్తుకు సంబంధించిన ఖచ్చితమైన నిరీక్షణను అంటే నిత్యజీవ నిరీక్షణను ఇచ్చే సత్యాన్ని కూడా తెలియజేస్తోంది.—2 తిమోతి 3:14-17.

అలాంటి సత్యాన్ని గురించి తెలుసుకునే అవకాశాన్ని పిలాతు నిర్లక్ష్యంగా తిరస్కరించాడు. అలాంటి అవకాశమే మీకు లభిస్తే మీరెలా ప్రతిస్పందిస్తారు? యేసు బోధించిన “సత్యం” ఏమిటో తెలుసుకోవడానికి మీరు యెహోవాసాక్షులను ఎందుకు అడగకూడదు? వారు ఆ సత్యాన్ని మీతో పంచుకోడానికి సంతోషిస్తారు.