కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఆయన అసాధారణమైన నిశ్చయతను చూసి ఆశ్చర్యపోయాను”

“ఆయన అసాధారణమైన నిశ్చయతను చూసి ఆశ్చర్యపోయాను”

“ఆయన అసాధారణమైన నిశ్చయతను చూసి ఆశ్చర్యపోయాను”

జ ర్మన్‌ రచయిత, 1999లో సాహిత్యరచనకు నోబుల్‌ బహుమతి అందుకున్న గూంటర్‌ గ్రాస్‌, 2006లో తన స్వీయ చరిత్రను ప్రచురించారు. దానిలో, తాను జర్మన్‌ పౌర రక్షణ శాఖలో చేర్చుకోబడిన సమయాన్ని గురించి ఆయన వివరించారు. అదే పుస్తకంలో, 60 సంవత్సరాలపైనే గడిచిపోయినా ఇప్పటికీ గుర్తుపెట్టుకునేంతగా తనపై ప్రగాఢముద్ర వేసిన ఒక వ్యక్తి గురించి వ్రాశారు. ఆయన తీవ్రమైన హింస సమయంలో తన విశ్వాసం కోసం స్థిరంగా నిలబడిన ఏకైక వ్యక్తి.

గ్రాస్‌, ఫ్రాంక్‌ఫర్టర్‌ ఆలగెమైన్‌ సైటుంగ్‌ అనే దినపత్రికలో ప్రచురించబడిన ఒక ఇంటర్వ్యూలో, ఆయుధాలు చేపట్టడానికి తిరస్కరించిన ఈ అసాధారణమైన వ్యక్తి గురించి ప్రస్తావించారు. ఆయన “ప్రఖ్యాతిగాంచిన అప్పటి ఏ సిద్ధాంతాలకూ మద్దతునివ్వలేదు, ఆయన నాజీ కాదు, కమ్యూనిస్టు కాదు, సోషలిస్టు కాదు. ఆయనొక యెహోవాసాక్షి” అని గ్రాస్‌ చెప్పారు. గ్రాస్‌కి ఆ సాక్షి పేరు గుర్తులేదు, ఆయన ఆ సాక్షిని, “మేము అలాంటివి చేయం” అనే పేరుతో ప్రస్తావించాడు. ఆయన పేరు యోయాకీమ్‌ ఆల్ఫ్‌మాన్‌ అని యెహోవాసాక్షుల్లోని పరిశోధకులు గుర్తించారు. ఆయన ఎన్నోసార్లు కొట్టబడి, అవమానపర్చబడ్డారు, ఆ తర్వాత ఆయన కారాగారంలో ఒంటరిగా ఉంచబడ్డారు. అయినప్పటికీ ఆల్ఫ్‌మాన్‌, స్థిరంగా ఉండి, ఆయుధాలను చేపట్టడానికి తిరస్కరించారు.

గ్రాస్‌ ఇలా చెప్పారు: “ఆయన అసాధారణమైన నిశ్చయతను చూసి ఆశ్చర్యపోయాను. నేనిలా అనుకున్నాను: దీనినంతటినీ ఆయనెలా తట్టుకోగలుగుతున్నారు? ఇదంతా ఆయనకెలా సాధ్యమవుతోంది?” దేవునిపట్ల తన యథార్థతను విడిచిపెట్టేలా చేయడానికి ఎంతోకాలంపాటు జరిగిన ప్రయత్నాలను తట్టుకున్న తర్వాత, ఆల్ఫ్‌మాన్‌ చివరకు 1944 ఫిబ్రవరిలో ష్టుట్‌హాఫ్‌ నిర్బంధ శిబిరానికి తరలించబడ్డారు. ఆయన 1945 ఏప్రిల్‌లో విడుదల చేయబడి, యుద్ధంలో చనిపోకుండా ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు, 1998లో చనిపోయేంతవరకు ఆయన యెహోవాకు నమ్మకమైన సాక్షిగా ఉన్నారు.

జర్మనీలో, నాజీలు ఆక్రమించుకున్న దేశాల్లో తమ విశ్వాసాన్నిబట్టి ప్రతీకార దాడులను అనుభవించిన దాదాపు 13,400 మంది సాక్షుల్లో ఆల్ఫ్‌మాన్‌ కూడా ఒకరు. వారు రాజకీయవిషయాల్లో తటస్థంగా ఉంటూ ఆయుధాలు చేపట్టేందుకు తిరస్కరించడం ద్వారా బైబిలు నిర్దేశాన్ని పాటించారు. (మత్తయి 26:52; యోహాను 18:36) దాదాపు 4,200 మంది సాక్షులు నిర్బంధ శిబిరాల్లో వేయబడ్డారు, వారిలో 1,490 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. వారు వహించిన స్థానం, నేడు కూడా, సాక్షులు కాకపోయినా వారి స్థిరత్వాన్ని అభినందించేవారిని ప్రభావితం చేస్తోంది.

[32వ పేజీలోని చిత్రం]

యోయాకిమ్‌ ఆల్ఫ్‌మాన్‌